రష్యా చమురు  –తెరవెనుక కథ

రష్యా చమురు –తెరవెనుక కథ

రష్యా నుంచి చౌకగా కొన్న ముడి చమురు భారత రిఫైనరీలకు, ముఖ్యంగా రిలయన్స్ ఇండస్ట్రీస్, నయారా ఎనర్జీ వంటి ప్రైవేట్ సంస్థలకు వేల కోట్ల లాభాలను తెచ్చిపెడుతోంది . ..

ఉక్రెయిన్‌పై రష్యా దాడికి ప్రతిగా, పాశ్చాత్య దేశాలు మాస్కో ఆదాయాన్ని దెబ్బతీయడానికి కఠినమైన ఆర్థిక ఆంక్షలను విధించాయి. ఇందులో భాగంగా రష్యా సముద్రమార్గ చమురుపై బ్యారెల్‌కు $60 ధరల పరిమితిని విధించాయి. అయితే, ఈ ఆంక్షలను తప్పించుకోవడానికి రష్యా ఒక రహస్య మార్గాన్ని ఎంచుకుంది. అదే “షాడో ఫ్లీట్“ (ఎలాంటి పర్మిట్లూ లేని “దొంగ” నౌకలు అనేక మోసపూరిత పద్ధతులను అనుసరిస్తాయి. ఈ నౌకల యజమానులు ఎవరో స్పష్టంగా తెలియకుండా ఉండేందుకు సంక్లిష్టమైన కంపెనీ నిర్మాణాలు, షెల్ కంపెనీలను ఉపయోగిస్తారు. పనామా, లైబీరియా, గాబన్ వంటి దేశాల జెండాలను ఎగురవేస్తాయి. ఈ దేశాలలో నిబంధనలు చాలా సరళంగా ఉండటంతో, నౌకల తనిఖీ, భద్రతా ప్రమాణాల నుంచి తప్పించుకోవడం సులభం. ఈ నౌకలకు సరైన భీమా ఉండదు. పాశ్చాత్య భీమా కంపెనీలు ఆంక్షల కారణంగా సేవలు అందించవు. దీంతో, ప్రమాదం జరిగితే నష్టపరిహారం చెల్లించే నాథుడు ఉండడు. ఈ నౌకాదళంలోని చాలా ట్యాంకర్లు 15-20 ఏళ్లకు పైబడినవి. వాటి నిర్వహణ సరిగా లేకపోవడంతో ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఎక్కువ. తమ కదలికలను దాచిపెట్టడానికి ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ (AIS) ట్రాన్స్‌పాండర్లను ఆపివేస్తాయి. సముద్రం మధ్యలో ఒక నౌక నుంచి మరో నౌకకు చమురును మార్చేసి చమురు ఎక్కడి నుంచి వస్తుందో తెలియకుండా చేస్తాయి.వందలాది పాత చమురు ట్యాంకర్లతో కూడిన ఈ రహస్య నెట్‌వర్క్ ద్వారా తన చమురును, ముఖ్యంగా భారత్, చైనా వంటి దేశాలకు అమ్ముతూ ప్రపంచ ఇంధన మార్కెట్‌లో తన స్థానాన్ని నిలబెట్టుకుంటోంది.

ఈ క్రమం ప్రపంచ భౌగోళిక రాజకీయాల్లో కొత్త ఉద్రిక్తతలకు, పర్యావరణ ప్రమాదాలకు దారితీస్తోంది.

పాశ్చాత్య దేశాలు రష్యా చమురును బహిష్కరించడంతో, భారత్, చైనాలు అతిపెద్ద కొనుగోలుదారులుగా అవతరించాయి. ముఖ్యంగా, యుద్ధానికి ముందు రష్యా నుంచి నామమాత్రంగా చమురు కొనుగోలు చేసిన భారత్, ఆంక్షల తర్వాత తన దిగుమతులను భారీగా పెంచుకుంది. రష్యా అందించిన తగ్గింపు ధరలను అందిపుచ్చుకుని, తన జాతీయ ప్రయోజనాలు, ఇంధన భద్రతను కాపాడుకుంటున్నామని భారత్ వాదిస్తోంది.

రష్యా నుంచి చౌకగా కొన్న ముడి చమురు భారత రిఫైనరీలకు, ముఖ్యంగా రిలయన్స్ ఇండస్ట్రీస్, నయారా ఎనర్జీ వంటి ప్రైవేట్ సంస్థలకు వేల కోట్ల లాభాలను తెచ్చిపెట్టింది. ఈ సంస్థలు చౌక చమురును శుద్ధి చేసి, పెట్రోలియం ఉత్పత్తులను అధిక ధరలకు అంతర్జాతీయ మార్కెట్లలో, ముఖ్యంగా రష్యాపై ఆంక్షలు విధించిన యూరప్ దేశాలకే ఎగుమతి చేశాయి. ప్రభుత్వం కూడా ఈ లాభాలపై “విండ్‌ఫాల్” పన్నుల రూపంలో ఆదాయం పొందింది. అయితే, ఈ ప్రయోజనాలు దేశీయ వినియోగదారులకు చేరలేదు. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గలేదు.

ఈ నీడల నౌకాదళం సముద్ర పర్యావరణానికి పెను ముప్పుగా మారింది. పాత నౌకలు, సరైన నిర్వహణ లేకపోవడం, భీమా సౌకర్యం కొరవడటంతో ప్రమాదాలు సర్వసాధారణమయ్యాయి.రెండు “దొంగ” నౌకలు నల్ల సముద్రంలో డిసెంబర్ 2024 న తుఫానులో చిక్కుకుని ముక్కలవ్వడంతో భారీగా చమురు సముద్రంలో కలిసి, తీవ్ర పర్యావరణ నష్టం జరిగింది.

2024 మార్చి లో రష్యా నుంచి భారత్‌కు వస్తున్న ‘ఇన్నోవా’ అనే ట్యాంకర్ స్కాట్లాండ్ తీరంలో 23 కిలోమీటర్ల పొడవున చమురును కక్కేసింది.

2024 ఫిబ్రవరిలో ఇటలీ తీరంలో ‘అరుణా గుల్కే’ అనే నౌక 47 కిలోమీటర్ల మేర చమురును చిమ్మింది.

మారుతున్న భౌగోళిక రాజకీయ సమీకరణాలు

రష్యా చమురు వాణిజ్యం ప్రపంచ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. భారత్ రష్యా నుంచి చమురు కొనడాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన అమెరికా, భారతీయ ఎగుమతులపై భారీ సుంకాలను విధించింది. ఇది దశాబ్దాలుగా బలపడుతున్న ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని దెబ్బతీసింది. ఈ పరిణామాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను రెండుగా చీలుస్తున్నాయని, డాలర్ ఆధిపత్యానికి సవాలు విసురుతూ బ్రిక్స్ పే (BRICS Pay) వంటి ప్రత్యామ్నాయ చెల్లింపుల వ్యవస్థలు పుట్టుకొస్తున్నాయని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు .

ట్రంప్ – మోదీ… ఒకటే బాట..

ట్రంప్ – మోదీ… ఒకటే బాట..

మొండి – జగమొండి రకం వీరిద్దరూ . …

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి అధినేత ఒకరు . . మరొకరు అత్యంత శక్తివంతమైన దేశానికి అధ్యక్షుడు. ఒకరు నరేంద్ర మోదీ. ఇంకొకరు డొనాల్డ్ ట్రంప్. వారిద్దరి మధ్య వేల మైళ్ళ దూరం ఉండవచ్చు. వారి రాజకీయ నేపథ్యాలు వేరు కావచ్చు. కానీ వారిద్దరినీ ఒకే గాటన కట్టే అంశాలు చాలా ఉన్నాయి. వారి రాజకీయ ప్రయాణం, పరిపాలన శైలి అచుగుద్దినట్లు అనిపిస్తుంది.

మోదీ, ట్రంప్ ఇద్దరూ రాజకీయాల్లోకి ఓ కొత్త శక్తిలా దూసుకొచ్చారు. అప్పటికే ఉన్న రాజకీయ వ్యవస్థపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను చాకచక్యంగా వాడుకున్నారు. తాము ఆ వ్యవస్థకు చెందిన వారం కాదని, ప్రజల పక్షాన పోరాడటానికి వచ్చిన బయటి వాళ్ళమని చాటుకున్నారు.

వాషింగ్టన్‌లోని అవినీతి రాజకీయాలపై ట్రంప్ యుద్ధం ప్రకటించారు. ఢిల్లీలోని “ల్యూటెన్స్ మీడియా, మేధావుల వర్గాన్ని” మోదీ లక్ష్యం చేసుకున్నారు. (దేశ రాజధానిని కలకత్తా నుండి ఢిల్లీకి మార్చే బ్రిటిష్ సామ్రాజ్య ప్రాజెక్టుని ఆర్కిటెక్ట్ ఎడ్విన్ “ల్యూటెన్స్” రూపొందించారు. ఇది పాశ్చాత్య భారతీయ నిర్మాణ శైలుల మిశ్రమాన్ని ప్రతిబింబించే విశాలమైన, చెట్లతో కప్పబడిన అవెన్యూలు, గొప్ప ప్రభుత్వ భవనాలు పెద్ద బంగ్లాలతో వుంటుంది. ఈ ప్రాంతం రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు ఇతర ప్రభావవంతమైన వ్యక్తులతో సహా ప్రముఖ నివాసితులకు ప్రసిద్ధి చెందింది. ప్రజలతో సంబందంలేకుండా అన్ని రంగాలను ప్రభావితం చేయగల వారిని ఢిల్లీ ల్యూటెన్స్ అంటారు.) ప్రజల భాషలో మాట్లాడుతూ, వారి భావోద్వేగాలను స్పృశిస్తూ సామాన్యులకు చేరువయ్యారు.

ఈ పాలకులు ఇద్దరి ప్రచారాల్లో జాతీయవాదం ప్రధాన అస్త్రంగా మారింది. “మేక్ అమెరికా గ్రేట్ అగైన్” అంటూ ట్రంప్ అమెరికన్ల దేశభక్తిని తట్టిలేపారు. “సబ్ కా సాథ్, సబ్ కా వికాస్” అంటూనే మోదీ ఒక “నవ భారత” నిర్మాణం గురించి మాట్లాడారు. తమ దేశ ప్రయోజనాలే ముఖ్యమని, వాటిని కాపాడటానికే తాము ఉన్నామని ప్రజలను నమ్మించారు. ఈ జాతీయవాద నినాదాలు వారి మద్దతుదారులను ఏకం చేశాయి. వారిని గుడ్డిగా ఆరాధించే భక్త గణాన్ని తయారుచేశాయి.

మెయిన్ స్ట్రీమ్ మీడియాపై దాడి చేయడం వారిద్దరి రాజకీయ వ్యూహంలో మరో కీలక భాగం. తమకు వ్యతిరేకంగా వార్తలు రాసే పత్రికలను, చానెళ్లను ట్రంప్ “ఫేక్ న్యూస్” అని కొట్టిపారేశారు. మోదీ మద్దతుదారులు అలాంటి మీడియాను “ప్రెస్టిట్యూట్స్” అని, (డబ్బు లేదా ఇతర ప్రయోజనాల కోసం తమ వృత్తిపరమైన నిజాయితీని, నైతికతను అమ్ముకుని, వార్తలు రాసే పత్రికలను, మీడియా సంస్థలను, లేదా జర్నలిస్టులను కించపరిచేందుకు వాడే ఒక అవమానకరమైన పదం ఇది.) “దేశద్రోహులు” అని ముద్ర వేశారు. మీడియాను బలహీనపరిచి, తమ సందేశాన్ని నేరుగా సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఇద్దరూ సఫలమయ్యారు. దీనివల్ల తమ చుట్టూ ఒక అభేద్యమైన కోటను నిర్మించుకున్నారు. విమర్శలు ఆ కోట గోడలను తాకలేకపోయాయి.

వ్యక్తి ఆరాధన.. ఇద్దరి పాలనలోనూ స్పష్టంగా కనిపిస్తుంది. ప్రభుత్వ పథకాలైనా, దేశ విజయాలైనా అన్నీ తమ ఘనతగానే ప్రచారం చేసుకున్నారు. తామే దేశానికి రక్షకులమని, తమ వల్లే దేశం సురక్షితంగా ఉందని చాటుకున్నారు. నిర్ణయాలన్నీ కేంద్రీకృతంగా జరిగాయి. మంత్రులు, అధికారులు నామమాత్రంగా మిగిలిపోయారు. నాయకుడే సర్వస్వం అనే భావన బలపడింది.

ఆర్థిక రంగంలోనూ వారి విధానాల్లో పోలికలు ఉన్నాయి. ఇద్దరూ దేశీయ పరిశ్రమలకు పెద్దపీట వేస్తామని హామీ ఇచ్చారు. ట్రంప్ చైనా నుంచి వచ్చే దిగుమతులపై సుంకాలు పెంచితే, మోదీ “మేక్ ఇన్ ఇండియా” అంటూ స్వదేశీ ఉత్పత్తిని ప్రోత్సహించారు. వారి విధానాలు కొన్నిసార్లు ఆర్థికవేత్తల విమర్శలకు గురైనా, తమ మద్దతుదారుల నుంచి మాత్రం బలమైన సమర్థన లభించింది.

ఈ ఇద్దరు నేతల ప్రస్థానం ఆధునిక రాజకీయాల్లో ఒక కొత్త ధోరణికి అద్దం పడుతోంది. ప్రజాస్వామ్య వ్యవస్థలోనే ఉంటూ, దాని స్ఫూర్తిని దెబ్బతీసే నాయకత్వ శైలి ఇది. ప్రజల ఆకాంక్షలను, వారి భయాలను చాకచక్యంగా వాడుకుంటూ అధికారాన్ని చేజిక్కించుకుని, దాన్ని నిలబెట్టుకునే సరికొత్త రాజకీయం ఇది. అందుకే మోదీ, ట్రంప్ వేర్వేరు దేశాల నేతలైనా, వారి రాజకీయ పంథా మాత్రం ఒకే దారిలో సాగుతున్నట్టు కనిపిస్తుంది. మీకు కూడా ఓననిపిస్తుందా ?

భారత దిగుమతులపై 25 శాతం ట్రంప్ టారిఫ్స్ అమల్లోకి..

భారత దిగుమతులపై 25 శాతం ట్రంప్ టారిఫ్స్ అమల్లోకి..

ఈ ప్రభావం పై భారత్ నిపుణులు అంచనాలు . .. దిగుమతులపై ఆలోచన

భారత్​పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ విధించిన 25 శాతం సుంకాలు గురువారం నుంచి అమల్లోకి వచ్చాయి. భారత్​తో సహా పలు దేశాలపై వేసిన కూడా సుంకాలు అమల్లోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో ట్రంప్​ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ పెట్టారు. తన చర్యను సమర్థించుకున్నారు. అమెరికా నుంచి ప్రయోజనాలు పొందిన దేశాల నుంచి బిలియన్‌ డాలర్లు తిరిగి వెనక్కి రానున్నాయని తెలిపారు.

బిలియన్ల డాలర్లు ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోకి రానున్నాయని పోస్ట్​ పెట్టారు. “పరస్పర సుంకాలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. ఏళ్ల తరబడి అమెరికాను సద్వినియోగం చేసుకున్నాయి కొన్ని దేశాలు. ఇప్పుడు ఆ దేశాల నుంచి బిలియన్ల డాలర్లు తరలిరానున్నాయి. అమెరికా గొప్పతనాన్ని ఆపగల ఏకైక విషయం ఏమిటంటే, మన దేశం విఫలమవ్వాలని కోరుకునే అతివాద వామపక్ష కోర్టులు!” అని ట్రంప్ మరొక పోస్ట్‌లో అన్నారు.

వారం రోజుల క్రితం . .. ట్రంప్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలపై విధించే వివిధ సుంకాలను జాబితా చేస్తూ కార్యనిర్వాహక ఉత్తర్వులు జారీ చేశారు. ఆ తర్వాత ప్రతీకార సుంకాల్లో మరిన్ని మార్పులు అంటూ దాదాపు 70 దేశాలపై ఉన్న సుంకాలను ఇటీవల పెంచారు. 10% నుంచి 41% వరకు సుంకాలు విధించే కార్యనిర్వాహక ఉత్తర్వులపై అప్పుడు సంతకం చేశారు. ఆ సమయంలో సిరియాపై అత్యధికంగా 41 శాతం టారిఫ్‌ను విధించారు. బ్రెజిల్‌పై ఇప్పటికే ఉన్న 10 శాతం సుంకాలకు అదనంగా 40 శాతం కలిపారు.

మన దాయాది దేశమెయిన్ పాకిస్థాన్‌కు 29% నుంచి 19 శాతానికి తగ్గించి ప్రేమ చూపించారు. భారత్​పై మాత్రం అక్కసు వెళ్లగక్కారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుందన్న కారణంగా ముందు 25 శాతం టారిఫ్‌ విధించారు. దాన్ని 50 శాతానికి పెంచుతూ బుధవారం కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేశారు. అదనపు 25% సుంకాలు ఈనెల 27 నుంచి అమల్లోకి రానున్నాయని ప్రకటించారు. మళ్లీ శాంక్షన్స్​ ఉంటాయని సూత్రప్రాయంగా తెలిపారు. దీంతో ట్రంప్ విధించిన సుంకాల్లో భారత్​కే అత్యధికం కావడం విశేషం .

అమెరికా టారిఫ్  ఎఫెక్ట్ – భారత్ పై ఏ మేరకు?

అమెరికా టారిఫ్ ఎఫెక్ట్ – భారత్ పై ఏ మేరకు?

అమెరికా టారిఫ్​లు, అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో వడ్డీరేట్లను యథాతథంగా 5.5 శాతం వద్దే స్థిరంగా ఉంచింది. ఈ క్రమంలో అమెరికా సుంకాలు భారత ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తాయా? టారిఫ్​లు ఇండియన్ ఎకానమీపై ప్రభావం చూపుతాయా? తదితర విషయాల గురించి ఆర్​బీఐ గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా ఏ అంచనా వేస్తున్నారు . అయన విశ్లేషణ ఏమిటి ??

‘భారత్ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంది’
అలాగే ప్రపంచ వాణిజ్య ఉద్రిక్తతలపైనా గవర్నర్ సంజయ్ మల్హోత్రా స్పందించారు. ట్రంప్ సుంకాల ప్రకటనలు, కొనసాగుతున్న వాణిజ్య చర్చల గురించి ప్రస్తావించారు. ఈ పరిణామాలు భారతదేశ వృద్ధిని ప్రభావితం చేస్తాయని అన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ బలంగా ఉన్నప్పటికీ, సుంకాల వంటి ప్రపంచ వాణిజ్య సమస్యలు సవాళ్లను తీసుకురావచ్చని వివరించారు. “దీర్ఘకాలిక భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, కొనసాగుతున్న ప్రపంచ అనిశ్చితులు, ప్రపంచ ఆర్థిక మార్కెట్లలో అస్థిరత నుంచి ఉత్పన్నమయ్యే ఎదురుగాలులు వృద్ధికి ఆటంకం కలిగించే అవకాశం ఉంది. అయినప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ముందుకెళ్తోంది. వృద్ధి బలంగా ఉంది” అని సంజయ్ ప్రకటించారు.

ఆర్​బీఐ గవర్నర్ మల్హోత్రా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ గురించి కూడా మాట్లాడారు. తక్కువ వృద్ధి, ద్రవ్యోల్బణం కారణంగా ప్రపంచవ్యాప్తంగా పాలసీ మేకర్స్ ఇప్పటికీ ఇబ్బందులను ఎదుర్కొంటున్నారన్నారు. “ప్రపంచ వాణిజ్య సవాళ్లు కొనసాగుతున్నప్పటికీ, రాజకీయ అనిశ్చితులు కొంత వరకు తగ్గాయి. ఇటీవల కాలంలో మారుతున్న పరిస్థితులను బట్టి భారత ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి మంచి అవకాశాలను కలిగి ఉంది. ప్రపంచంలోని పలు దేశాలు తక్కువ వృద్ధిని, ద్రవ్యోల్బణ భారాన్ని ఎదుర్కొంటున్నాయి. కొన్ని అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలు ద్రవ్యోల్బణంలో పెరుగుదలను కూడా చూస్తున్నాయి” అని సంజయ్ మల్హోత్రా అభిప్రాయపడ్డారు.

కీలక విషయాలపై వివరణ
ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను ఆర్​బీఐ గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా ప్రకటించారు. ఈ క్రమంలో ద్రవ్యోల్బణం, వృద్ధి రేటు, భారత ఆర్థిక వ్యవస్థపై అమెరికా సుంకాల ఎఫెక్ట్, ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న వాణిజ్య ఉద్రిక్తతల గురించి సంజయ్ వివరణ ఇచ్చారు. భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం ఎలా ఉంది? ప్రపంచ వాణిజ్య వాతావరణంలో కొనసాగుతున్న మార్పుల వల్ల అది ఎలా ప్రభావితమవుతుంది? అనే విషయాలను వెల్లడించారు.

“రెపో రేటును 5.5శాతం వద్ద కొనసాగించాలని ఎంపీసీ ఏకగ్రీవంగా నిర్ణయించింది. ఇతర కీలక రేట్లు, స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ 5.25శాతం, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ, బ్యాంక్ రేటు 5.75 శాతం వద్దే స్థిరంగా ఉన్నాయి. ఆగస్టు 4, 5,6 తేదీలలో ఎంపీసీ సమావేశం జరిగింది. ఆ సమావేశంలోనే పాలసీ రెపో రేటును 5.5శాతం వద్ద స్థిరంగా ఉంచడానికి ఎంపీసీ ఏకగ్రీవంగా ఓటు వేసింది. కొత్త డేటా, మారుతున్న దేశీయ, ప్రపంచ పరిస్థితులపై కమిటీ నిశితంగా నిఘా కొనసాగిస్తుంది. తగిన ద్రవ్య విధాన విధానాన్ని రూపొందించడానికి ఇన్​కమింగ్ డేటా, అభివృద్ధి చెందుతున్న దేశీయ వృద్ధి, ద్రవ్యోల్బణ పరిస్థితులపై నిశితంగా నిఘా ఉంచాలని ఎంపీసీ నిర్ణయించింది. దీని ప్రకారం, సభ్యులందరూ తటస్థ వైఖరిని కొనసాగించాలని నిర్ణయించుకున్నారు” అని సంజయ్ మల్హోత్రా తెలిపారు.

‘వార్ 2’ అందుకే ఒప్పుకున్నా.. రీజన్  చెప్పిన ఎన్టీఆర్

‘వార్ 2’ అందుకే ఒప్పుకున్నా.. రీజన్ చెప్పిన ఎన్టీఆర్

ఈ స్క్రిప్ట్ త‌న‌ను బాగా ఆక‌ర్షించింద‌న్న తార‌క్‌

ఏదైనా కధ నచ్చితే వెనక్కి చూడకుండా నటించడానికి అంగీకరిస్తారు జూనియర్ ఎన్టీఆర్ . యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తన బాలీవుడ్ అరంగేట్ర చిత్రం ‘వార్ 2’ గురించి నోరు విప్పారు . ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులో నటించడానికి తాను ఎందుకు అంగీకరించారో వెల్లడించారు. బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్‌తో కలిసి నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నెల 14న మూవీ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలో ప్ర‌ముఖ మ్యాగ‌జైన్‌ ‘ఎస్క్వైర్‌ ఇండియా’ తాజాగా ఎడిష‌న్ క‌వ‌ర్‌పేజీపై తార‌క్ ఫొటోను ముద్రించింది. ఆ మ్యాగ‌జైన్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఎన్టీఆర్ ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను పంచుకున్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యలు సిని అభిమానులలో ఆసక్తిని పెంచుతున్నాయి.

ఒక నటుడిగా తనను తాను సవాల్ చేసుకునే పాత్రలో నటించాలనే ఉద్దేశంతోనే ఈ సినిమాకు అంగీకరించినట్లు ఎన్టీఆర్ వివరించారు. అందుకు ‘వార్ 2’ స్క్రిప్ట్ క‌రెక్ట్‌గా అనిపించింద‌ని తెలిపారు. బ‌ల‌మైన క‌థ‌తో ఇది రూపొందిన‌ట్లు తార‌క్ చెప్పారు. “భారతీయ ప్రేక్షకులకు ఏదైనా కొత్త ఫీలింగ్ ని పంచే పాత్రతో హిందీలో అడుగుపెట్టాలనుకున్నాను. ‘వార్ 2’లో నా పాత్ర ఆ కోవకు చెందిందే. ఇది నటుడిగా నాకు సవాల్ విసిరింది. 

ఇక‌, ఈ సినిమాలో భాష‌తో సంబంధం లేకుండా అంద‌రూ క‌లిసి ప‌నిచేశారు. ఇక‌పై బాలీవుడ్‌, టాలీవుడ్‌, మాలీవుడ్, కోలీవుడ్ అనేవి వుండవు. మన‌మంతా ఒక్క‌టే ఇండ‌స్ట్రీ. భార‌తీయ చిత్ర ప‌రిశ్ర‌మ‌గా గుర్తించాలి. ఇదే విష‌యాన్ని గ‌తంలో రాజ‌మౌళి కూడా చెప్పారు. ఎంచుకున్న క‌థ‌ను ప్రేక్ష‌కుల‌కు న‌చ్చేలా చూపించాలంతే” అని ఎన్టీఆర్ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. 

ఈ పీక్శ్చర్ లో హృతిక్ రోషన్ పోషిస్తున్న ‘కబీర్’ పాత్రకు దీటైన శక్తిగా తన పాత్రను తీర్చిదిద్దారని, ఇది కేవలం యాక్షన్‌కే పరిమితం కాకుండా మానసిక సంఘర్షణతో కూడి ఉంటుందని తెలిపారు. ఆయ‌న‌తో క‌లిసి న‌టించ‌డం త‌న‌కు ఎంతో ఆనందాన్ని ఇచ్చింద‌ని తార‌క్ వెల్ల‌డించారు. కాగా, ఈ చిత్రంలో ఎన్టీఆర్ ‘విక్రమ్’ అనే శక్తిమంతమైన స్పెషల్ ఫోర్సెస్ అధికారి క్యారెక్టర్ లో తెరపై దర్శనం ఇవ్వబోతున్నారు .