by Rama Chandra P | Mar 14, 2026 | జనరల్, పరిశీలన
”ఖర్గ్ ద్వీపం” ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు ఆరో ప్రాణం అంటారు . ..ఎందుకు ?
ఇరాన్ ముడి చమురు బిజినెస్ లో అత్యంత కీలకమైనది . .. ఖర్గ్ ద్వీపం. ఆ దేశ ఆయిల్ ఎగుమతుల్లో 90 శాతం ఈ ద్వీపం నుంచే జరుగుతుంటాయి. అటువంటి కీలకమైన ఖర్గ్ ద్వీపంపై అమెరికా వైమానిక దాడులు చేసింది. ఈ విషయాన్ని స్వయంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం వెల్లడించారు. ప్రస్తుతానికి ఖర్గ్ ద్వీపంలోని ఇరాన్ సైనిక స్థావరాలను ధ్వంసం చేశామని, తమ నెక్ట్స్ టార్గెట్‌లో అక్కడి చమురు మౌలిక సదుపాయాలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఖర్గ్ గురించి అంతటా చర్చ జరుగుతోంది. ఈ ఐలాండ్ ఇరాన్‌లో ఎక్కడుంది ? ఇది ఇరాన్‌కు అంతగా ముఖ్యమైందా ? దీన్ని అమెరికా ఎందుకు లక్ష్యంగా చేసుకుంది ? అమెరికా దాడికి ఇరాన్ స్పందన ఎలా ఉంటుంది ? ఇపుడు ప్రపంచ వ్యాప్తంగా ఇదే చర్చ . ..?
ఖర్గ్ ద్వీపం ఎక్కడుంది ?
ఖర్గ్ ద్వీపం ఇరాన్ నైరుతి సముద్ర తీరానికి 26 కి.మీ దూరంలో ఉంది. కీలకమైన హర్మూజ్ జలసంధికి వాయవ్య దిశలో దాదాపు 483 కి.మీ దూరంలో ఈ ఐలాండ్ ఉంది. ఇరాన్ ఓడరేవు నగరం బుషెహర్‌కు వాయవ్య దిశలో 55 కి.మీ దూరంలో ఖర్గ్ ఉంది. ఈ ద్వీపం చుట్టూ సహజసిద్ధంగానే చాలా లోతు వరకు సముద్రజలాలు ఉన్నాయి. దీంతో భారీ సైజు ముడి చమురు ట్యాంకర్లను పార్కింగ్ చేసేందుకు ఈ ద్వీపంలోని తీర ప్రాంతం అనువైంది. ఆయిల్ ట్యాంకర్లు, నౌకల పార్కింగ్ కోసం ఖర్గ్ ద్వీపం చుట్టూ పెద్దసంఖ్యలో టెర్మినళ్లను ఇరాన్ నిర్మించింది. ఇక్కడ పెద్దసంఖ్యలో ఇరాన్ సైనిక స్థావరాలు ఉన్నాయి. ప్రత్యేకించి ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) పహారాలో ఖర్గ్ ఉంది. ఎందుకంటే ఇరాన్ ముడి చమురు ఎగుమతుల్లో 90 శాతం ఈ ద్వీపం నుంచే జరుగుతుంటుంది. ఈవిధంగా దేశ ముడి చమురు వాణిజ్యంపైనా ఐఆర్‌జీసీకి బలమైన పట్టు ఏర్పడింది.
ఖర్గ్ ఇరాన్‌కు అత్యంత ముఖ్యమైంది? ఎందుకంటే . .
అమెరికా గూఢచార సంస్థ సీఐఏ సేకరించిన 1984 నాటి డీక్లాసిఫైడ్ నోట్ ప్రకారం, ఖర్గ్ ద్వీపం ఇరాన్ పెట్రోలియం వ్యవస్థలో అత్యంత కీలకమైంది. ఇది ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక లాంటిది. 1980వ దశకంలో జరిగిన ఇరాన్-ఇరాక్ యుద్ధం టైంలో, 2003లో జరిగిన అమెరికా – ఇరాక్ యుద్ధం వేళ ఖర్గ్ ద్వీపం ప్రధాన టార్గెట్‌గా మారింది. ఆనాడు ఇరాన్ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడానికి ఇరాక్ వందలాది సార్లు ఖర్గ్ ద్వీపంపై బాంబు దాడులు చేసింది. ఈ ద్వీపంలోని టెర్మినళ్లకు భారీ చమురు నిల్వ సామర్థ్యం ఉంది. ఇరాన్‌లోని అబూజర్, ఫోరౌజాన్, డోరూడ్ చమురు, సహజ వాయువు క్షేత్రాల నుంచి ఖర్గ్ వరకు పైప్‌లైన్‌లు విస్తరించి ఉన్నాయి. ఈ పైప్‌లైన్ల వ్యవస్థ సముద్ర జలాల అడుగున ఉంది. దీని ద్వారా ఖర్గ్‌కు చేరుకునే చమురు, సహజ వాయువును భారీ నౌకలు, ఆయిల్ ట్యాంకర్ల ద్వారా ప్రపంచ దేశాలకు సరఫరా చేస్తూ ఉంటారు .
ఖర్గ్ దెబ్బతింటే ఇరాన్‌కు ఇక్కట్ల
ఖర్గ్ ద్వీపం ఇరాన్ ప్రభుత్వానికి, సైన్యానికి నిధులు సమకూర్చడంలో కీలక పాత్ర పోషిస్తోంది. ఒకవేళ ఖర్గ్‌లో ముడి చమురు వాణిజ్యం ఆగిపోతే ఇరాన్ ప్రభుత్వం ఆర్థికంగా దెబ్బతింటుంది. ఫలితంగా సైనికశక్తి కూడా బలహీనపడుతుంది. అమెరికా కోరుకుంటున్నది ఇదే. ఒకవేళ ఖర్గ్‌పై అమెరికా దాడులు తీవ్రతరమైతే, ఇరాన్ కూడా బలంగా ప్రతిఘటించే ఛాన్స్ ఉందన్న విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి.
హర్మూజ్‌తో ఇరాన్- ఖర్గ్‌తో అమెరికా ఒత్తిడి
ఖర్గ్ ద్వీపంలో చమురు వాణిజ్యం స్తంభిస్తే ఇరాన్ ఆర్థికంగా బలహీనపడటం ఖాయం. ఎందుకంటే ఇరాన్ చమురు వాణిజ్యంలో 90 శాతం ఆ ఒక్క ద్వీపం నుంచే జరుగుతోంది. అందుకే ఇప్పుడు ఖర్గ్‌పై అమెరికా ఫోకస్ పెట్టింది. తద్వారా హర్మూజ్ విషయంలో ఇరాన్ వైఖరిని మార్చాలని భావిస్తోంది. హర్మూజ్ జలసంధి ద్వారా అమెరికాపై ఒత్తిడిని పెంచేందుకు ఇరాన్ యత్నిస్తోంది. దీనికి ప్రతిగా ఖర్గ్‌పై దాడులతో, ఇరాన్‌పై ఒత్తిడిని పెంచేందుకు అమెరికా యత్నిస్తోందని జేపీ మోర్గాన్ కంపెనీకి చెందిన గ్లోబల్ కమోడిటీ రీసెర్చ్ ప్రతినిధులు చెబుతున్నారు.
ఖర్గ్ ద్వీపంలో ఇరాన్ చమురు శాఖకు చెందిన మూడు ప్రధాన ఇంధన సౌకర్యాలు ఉన్నాయి. వాటిలో ఒక దాని పేరు ఫలాత్ ఇరాన్ ఆయిల్ కంపెనీ. ఇది రోజుకు 5 లక్షల బ్యారెళ్ల ముడి చమురును ఉత్పత్తి చేస్తుంది. ఇరాన్‌లో చమురును ఉత్పత్తి చేసే నాలుగు శుద్ధి కర్మాగారాలలో ఇదే అతిపెద్దది. ఈ ద్వీపంలోనే ఖర్గ్ పెట్రోకెమికల్ కంపెనీ కూడా ఉంది. ఈ కంపెనీ యూనిట్లలోనే చమురు, ద్రవీకృత సహజ వాయువును నిల్వ చేస్తారు, ఎగుమతి చేస్తారు. ఇరాన్ ప్రభుత్వం ఖర్గ్‌లోని చమురు టెర్మినల్ నిల్వ సామర్థ్యాన్ని 2 మిలియన్ బ్యారెళ్లకు విస్తరించిందని 2025లో నివేదికలు వచ్చాయి. ఇక్కడున్న ప్రతీ చమురు ట్యాంక్‌కు ఒక మిలియన్ బ్యారెళ్ల చమురును నిల్వ చేసే కెపాసిటీ ఉంది.
ఇరాన్ ప్రతిదాడి ఎలా?
హర్మూజ్ మీదుగా ఇతర దేశాల ఆయిల్ ట్యాంకర్ల రాకపోకలను ఇరాన్ అడ్డుకుంటోంది. కానీ ఖర్గ్ ద్వీపం నుంచి చమురు సప్లైలను ఇరాన్ ఇంకా కొనసాగిస్తోందని తెలుస్తోంది. తాజాగా TankerTrackers.com చేసిన ఉపగ్రహ చిత్రాల విశ్లేషణ ప్రకారం, మార్చి 11న (బుధవారం) ఖర్గ్ ద్వీపంలో అనేక పెద్ద ముడి చమురు ట్యాంకర్లు లోడ్ అవుతున్నట్లు వెల్లడైంది. ఈ యుద్ధం ప్రారంభమైన ఫిబ్రవరి 28 నుంచి బుధవారం వరకు ఇరాన్ రోజుకు సగటున 1.1 మిలియన్ బ్యారెళ్ల నుంచి 1.5 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురును ఎగుమతి చేసినట్లు సమాచారం. ఈనేపథ్యంలో ఖర్గ్‌పై అమెరికా దాడిని ఇరాన్ తీవ్రమైన అంశంగా పరిగణించే అవకాశాలు ఉన్నాయి. తమ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకలాంటి ఖర్గ్‌ను అమెరికా లక్ష్యంగా చేసుకున్నందుకు ఇరాన్ ఘాటుగా బదులిచ్చే ఛాన్స్ ఉందని ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
by Rama Chandra P | Mar 13, 2026 | జనరల్
పాటలతో జనంలో చైతన్యం నింపిన యువకుడు ప్రధాని . ..
—————————————-
నేపాల్.. హిమాలయాల ఒడిలో ఒదిగిపోయిన అందమైన దేశం. కానీ అక్కడ రాజకీయాలు మాత్రం ఎప్పుడూ రణరంగమే. ఒకప్పుడు రాజుల ఏలుబడి, ఆ తర్వాత కుర్చీలాటలో మునిగిపోయిన నేతలు. సరిగ్గా ఇలాంటి టైంలోనే సీన్ లోకి వచ్చాడు బాలెన్ షా.
”చేతిలో మైక్ పట్టుకుని పాటలు పాడే ఒక రాపర్, ఇవాళ దేశ గమనాన్నే మార్చేస్తున్నాడు. ఇది కేవలం ఒక గెలుపు కాదు, హిమాలయాల్లో పుట్టిన నిప్పుకణిక…” అంటూ యావత్ నేపాల్ కీర్తిస్తోంది .
మార్చి 2026. ఫలితాలు వస్తుంటే పాత తరం నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. 18 ఏళ్లలో 15 ప్రభుత్వాలను మార్చిన నేపాల్ ప్రజలు..
ఈసారి విసిగిపోయి ఒక కొత్త దారి వెతుక్కున్నారు. యువత ఐక్యమై బాలెన్ షా వెనుక నడిచింది. కాట్మండు మేయర్‌గా అక్రమ కట్టడాలను కూల్చినప్పుడే అర్థమైంది, ఇతను మామూలోడు కాదని!
ఆ రాత్రి.. కాట్మండు వీధుల్లో..
చలి గాలులు వీస్తున్నాయి. ఫలితాలు దాదాపు ఖాయమైపోయాయి. పాత పార్టీ ఆఫీసుల్లో నిశ్శబ్దం రాజ్యమేలుతుంటే, బాలెన్ అనుచరులు మాత్రం వీధుల్లో సందడి చేస్తున్నారు.
ఒక ముసలాయన అంటున్నాడు:
“ఒరేయ్.. రాజులు పోయారు, రౌడీలు వచ్చారు. ఇన్నాళ్లకు కష్టాలు తెలిసిన కుర్రాడు వస్తున్నాడురా!”
బాలెన్ షా మేడ మీద నుంచి జనాలను చూస్తూ నవ్వాడు. పక్కనే ఉన్న మిత్రుడు అడిగాడు, “ఏంటి బాలెన్.. గెలిచేశాం కదా? నెక్స్ట్ ఏంటి?”
“ఇది గెలుపు కాదు దోస్త్.. ఒక పెద్ద బాధ్యత. పాటల్లో విమర్శించడం ఈజీ, కానీ పాలనలో చేసి చూపించడం కష్టం. నేపాల్ ఇన్నాళ్లు చీకట్లో ఉంది, ఇక వెలుగు చూడాలి.”
ట్విస్ట్ ఏంటంటే..
నేపాల్ రాజకీయాల్లో ఎప్పుడూ భారత్, చైనాల ప్రమేయం ఉంటుంది. కానీ బాలెన్ షా మాత్రం ‘నేపాల్ ఫస్ట్’ అంటున్నాడు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీలా ఇతను కూడా ఒక ఎంటర్ టైనర్ నుంచి లీడర్ గా మారాడు. అయితే అధికారం అంటే పదునైన కత్తి. బంగ్లాదేశ్ లో జరిగినట్టుగా తప్పులు చేస్తే ప్రజలు క్షమించరు.
హిమాలయాల్లో మంచు కరుగుతోంది.. పాత రాజకీయాల మకిలి కూడా వదులుతోంది. కానీ ఈ కొత్త కెరటం ఎంత కాలం నిలబడుతుంది? అప్పుడే కథ అయిపోలేదు.. అసలు ఆట ఇప్పుడే మొదలైంది! వెనుకబాటుతనంతో అల్లాడుతున్న నేపాలీలకు దారిదీపం దొరికింది .
by Abhi Correspondent | Mar 7, 2026 | జనరల్, పరిశీలన
అమెరికా, ఇజ్రాయెల్ దాడుల నుంచి తన ఆయుధ సంపత్తిని కాపాడుకునేందుకు ఇరాన్ వ్యూహాత్మకంగా నిర్మించుకున్న భూగర్భ క్షిపణి వ్యవస్థ ప్రమాదకరంగా మారింది . సదరు నగరాలు ఇప్పుడు ఆ దేశానికే ప్రతికూలంగా మారుతున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ ఏకపక్ష యుద్ధం ప్రకటించిన కొన్ని రోజులకే ఇరాన్ వ్యూహం బెడిసికొట్టినట్లు కనిపిస్తోంది. భారీ భూగర్భ బంకర్ల నుంచి బయటకు వస్తున్న క్షిపణి లాంచర్లనే లక్ష్యంగా చేసుకుని అగ్రరాజ్యం, ఇజ్రాయెల్ బాంబులతో విరుచుకుపడుతున్నాయి. ఇరాన్ అత్యంత పకడ్బందీగా నిర్మించుకున్న క్షిపణి నగరాల్లో ఇప్పుడు ఏం జరుగుతోంది? టెహ్రాన్ వ్యూహం ఎందుకు విఫలమైంది?
తాజాగా ఇరాన్‌లోని డజన్ల కొద్దీ భారీ స్థావరాలపై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు, డ్రోన్లు నిరంతరం చక్కర్లు కొడుతున్నాయి. క్షిపణులను ప్రయోగించేందుకు భూగర్భం నుంచి లాంచర్లు బయటకు రాగానే వాటిపై ముప్పేట దాడి చేస్తున్నాయి. అమెరికా భారీ బాంబర్ల దాడులతో ఇరాన్ ఆయుధాలు కొన్ని చోట్ల భూగర్భంలోనే చిక్కుకుపోయినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. ఇరాన్ దక్షిణ నగరమైన షిరాజ్ సమీపంలోని స్థావరాలతో పాటు ఇస్ఫహాన్, తబ్రిజ్, కెర్మాన్‌షా సమీపంలోని స్థావరాలపై దాడులు జరిగినట్లు ఇటీవల తీసిన శాటిలైట్ చిత్రాల ద్వారా స్పష్టమవుతోంది. దాడికి గురైన స్థావరాలన్నీ భూగర్భంలో ఉన్నప్పటికీ, వాటి పైభాగంలో ఉన్న భవనాలు, ప్రవేశ ద్వారాలు, రోడ్ల ద్వారా వాటిని సులభంగా గుర్తించి దాడులు చేస్తున్నారు.
క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఇరాన్ అంచనాలకు భిన్నంగా ఉన్నాయి. లాంచర్లను బయటకు తీసుకురాకుండా నేరుగా భూగర్భ బంకర్ల నుంచే క్షిపణులను ప్రయోగించేందుకు కొన్ని స్థావరాల వద్ద ఇరాన్ సైన్యం భూగర్భ గోతులను నిర్మించింది. దక్షిణ ఇరాన్‌లోని ఖోర్ముజ్ పట్టణం సమీపంలో ఉన్న ఒక స్థావరంలో ఇటువంటి సామర్థ్యాలున్న తొమ్మిది భూగర్భ గోతులు ఉన్నట్లు అమెరికా సైనిక మాజీ నిపుణుడు కాలిన్ డేవిడ్ వెల్లడించారు. ఇవి పర్షియన్ గల్ఫ్ వైపు చూసేలా పర్వతాల వాలులో తవ్విన లోతైన గుంతలు. పదే పదే ఈ గోతులను వినియోగించడంలో ఉన్న సాంకేతిక ఇబ్బందుల వల్ల భూగర్భ ప్రయోగ కేంద్రాల ఆలోచనను ఇరాన్ దాదాపుగా విరమించుకుందని వాషింగ్టన్‌కు చెందిన సీఎన్ఏ కార్పొరేషన్ విశ్లేషకులు చెబుతున్నారు.
ఇరాన్‌ను తక్కువ అంచనా వేయడంలేదా ?
ఇజ్రాయెల్, అమెరికా దాడుల నుంచి రక్షించుకునేందుకు యుద్ధం ప్రారంభం కావడానికి ముందే ఇరాన్ అప్రమత్తమైంది. కొన్ని క్షిపణులను, లాంచర్లను బంకర్ల నుంచి బయటకు తరలించి ఉండవచ్చని, తద్వారా వాటిని చెదరగొట్టి దాడుల నుంచి రక్షించుకోవాలని భావించినట్లు తెలుస్తోంది. ఇరాన్‌కు ఉన్న భారీ భూగర్భ స్థావరాలను పూర్తిగా ధ్వంసం చేసే బంకర్-బస్టింగ్ బాంబులు అమెరికా ఆయుధాగారంలో పరిమితంగానే ఉన్నాయి. అందుకే, లాంచర్లు బయటకు రాగానే ప్రవేశ ద్వారాల వద్దే ధ్వంసం చేసే వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. క్షిపణులను అడ్డుకునే ఎయిర్-డిఫెన్స్ ఇంటర్‌సెప్టార్ల నిల్వలు అయిపోకముందే, టెహ్రాన్ ప్రయోగ సామర్థ్యాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయాలని వాషింగ్టన్ భావిస్తోంది.
తాజా దాడుల ప్రభావంతో ఇరాన్ నుంచి బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్ల ప్రయోగాలు తగ్గుముఖం పట్టాయని ఇజ్రాయెల్, అమెరికా అధికారులు ధ్రువీకరిస్తున్నారు. సుదీర్ఘకాలం సాగే యుద్ధం కోసం ఇరాన్ ఉద్దేశపూర్వకంగానే తన ఆయుధ నిల్వలను ఆదా చేసుకుంటున్నట్లు కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇరాన్ క్షిపణి నిల్వలపై భిన్నమైన అంచనాలున్నాయి. యుద్ధానికి ముందు ఇరాన్ వద్ద 2,500 క్షిపణులు ఉండొచ్చని ఇజ్రాయెల్ అంచనా వేయగా, సుమారు 6,000 వరకు ఉంటాయని అంతర్జాతీయ నిపుణులు అంచనావేస్తున్నారు .
by Rama Chandra P | Mar 5, 2026 | జనరల్, పరిశీలన
తరిగిపోతున్న ఆయుధాలు – ఇరాన్‌తో మరో 10 రోజులు యుద్ధం కొనసాగితే అమెరికా క్షిపణి నిల్వలు తగ్గే అవకాశం – పెంటగాన్ హెచ్చరిక
ఇరాన్‌తో సైనిక ఘర్షణ వేళ అమెరికా రక్షణ శాఖ అధికార వర్గాలు కీలక హెచ్చరిక చేసాయ ? అంతర్జాతీయ మీడియా సంస్థలు ఔవుననే చెపుతున్నాయి . ఇరాన్‌పై దాడులు ఇదేరీతిలో 10 రోజులకుపైగా కొనసాగితే అమెరికా మిస్సైళ్ల నిల్వలు మరింత తగ్గిపోయే అవకాశం ఉంటుందని పెంటగాన్ సీనియర్ అధికారి ఒకరు చెప్పారంటూ అంతర్జాతీయ మీడియా రాసుకొచ్చింది. ఇప్పుడు ఈ కథనం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అమెరికా ఇప్పటికే టోమాహాక్ ల్యాండ్ ఎటాక్ మిస్సైళ్లు, గగనతల రక్షణ వ్యవస్థల్లో వినియోగించే ఎస్ఎం-3 ఇంటర్‌సెప్టర్ల కొరతను ఎదుర్కొంటోందని ఆ అధికారి చెప్పారని కథనంలో సదరు మీడియా పేర్కొనడం గమనార్హం .
ఏ నిల్వలు తగ్గిపోతాయి ?
సీఎన్ఎస్, ఖతర్ ప్రభుత్వ మీడియా సంస్థ అల్ జజీరా, అమెరికా మీడియా సంస్థ వాల్ స్ట్రీట్ జర్నల్ ఈ అంశంపై కథనాలను ప్రచురించాయి. దీర్ఘకాలం పాటు ఇరాన్‌తో యుద్ధాన్ని కొనసాగిస్తే అమెరికా కీలక ఆయుధ నిల్వలన్నీ తగ్గిపోయే ముప్పు ఉంటుందని దేశాధ్యక్షుడు ట్రంప్‌ను హెచ్చరించామని పెంటగాన్ అధికార వర్గాలు, అమెరికా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ ఛైర్మన్ డ్యాన్ కైనీ చెప్పారంటూ ఆ కథనాలు పేర్కొన్నాయి. 2025 జూన్‌లో ఇరాన్ – ఇజ్రాయెల్ సైనిక ఘర్షణ వేళ అమెరికా తన దగ్గరున్న థాడ్ గగనతల రక్షణ వ్యవస్థ ఇంటర్‌సెప్టర్లలో 25 శాతాన్ని వాడేసిందని పేర్కొన్నాయి. ఆ టైంలో ఇజ్రాయెల్‌పైకి ఇరాన్ సంధించిన డ్రోన్లు, మిస్సైళ్లను అడ్డుకొని నిర్వీర్యం చేయడానికి దాదాపు 150 థాడ్ ఇంటర్‌సెప్టర్లను అమెరికా వినియోగించిందని వాల్ స్ట్రీట్ జర్నల్ తెలిపింది.
ఖరీదైన యుద్ధం . ..
ఇరాన్‌పై అమెరికా చేస్తున్న యుద్ధం ఖర్చు తడిపిమోపెడు అవుతోంది . అత్యు0త భారీగా ఉందని . . అమెరికా మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఫిబ్రవరి 28న ఉదయం ఇరాన్‌పై దాడులు మొదలుపెట్టినప్పటి నుంచి మొదటి 24 గంటల్లోగా అమెరికాకు దాదాపు రూ.7186 కోట్ల ఖర్చు అయినట్లు తెలుస్తోంది . గల్ఫ్ సముద్ర జలాల్లో యూఎస్ఎస్ గెరాల్డ్ ఆర్ ఫోర్డ్ లాంటి ఒక విమాన వాహక యుద్ధ నౌకను, అందులోని సైనికులు, యుద్ధ విమానాలను నిర్వహించడానికి ఒకరోజుకు రూ.59 కోట్ల దాకా ఖర్చు వస్తుందని అంచనా వేశారు. వాస్తవానికి ఇరాన్‌పై దాడులు చేయడానికి, దాదాపు నెల రోజుల ముందు నుంచే గల్ఫ్ సముద్ర జలాల్లో యుద్ధ నౌకలు, విమాన వాహక నౌకల మోహరింపును అమెరికా మొదలుపెట్టింది.
యుద్ధం 4 వారాలు ఉంటే.. లక్షల కోట్ల ఖర్చు . ..
ట్రంప్ చెప్పినట్టుగా ఇరాన్‌తో సైనిక ఘర్షణ నాలుగైదు వారాల పాటు కొనసాగితే, అమెరికా యుద్ధం మొత్తం ఖర్చు రూ.19.37 లక్షల కోట్లకు చేరుతుందని అమెరికా రక్షణ రంగ అధ్యయన సంస్థ పెన్ వార్టన్ బడ్జెట్ మోడల్‌కు చెందిన నిపుణుడు కెంట్ స్మెట్టర్స్ తెలిపారు. 2023 అక్టోబరు 7 నుంచి ఇప్పటివరకు ఇజ్రాయెల్‌కు రూ.2 లక్షల కోట్ల సైనిక సహాయాన్ని అమెరికా అందించింది. ఈ వ్యవధిలో యెమన్, ఇరాన్ దాడుల నుంచి ఇజ్రాయెల్‌ను కాపాడటానికి అమెరికా సొంతంగా దాదాపు రూ.1 లక్ష కోట్ల సైనిక వ్యయాన్ని చేసింది. అంటే గత రెండున్నర ఏళ్లలో ఇజ్రాయెల్ రక్షణ కోసం అమెరికా దాదాపు రూ.3 లక్షల కోట్ల వరకు ఖర్చు చేసినట్లు అంచనా . .
ఏకకాలంలో ఎన్ని యుద్ధాలనైనా అమెరికా చేయగలదు : ట్రంప్
‘‘అమెరికా ఆయుధ సప్లైలు బలమైన స్థితిలో ఉన్నాయి. మునుపెన్నడూ లేనంత స్థాయిలో ఇప్పుడు అమెరికా దగ్గర ఆయుధ నిల్వలు ఉన్నాయి. అన్ లిమిటెడ్‌గా ఆయుధాలను సప్లై చేసే సత్తా అమెరికాకు ఉంది. ఏకకాలంలో ఎన్ని యుద్ధాలనైనా అమెరికా చేయగలదు’’ అని పేర్కొంటూ ఇటీవలే ట్రూత్ సోషల్ వేదికగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పోస్ట్ పెట్టడం గమనార్హం. ఇలాంటి పోస్టులు చేయడం ట్రంప్ కి ముందు నుంచీ అలవాటే . . అని ప్రముఖులు చెపుతున్నారు .
by Rama Chandra P | Feb 15, 2026 | జనరల్
”భవిష్యత్తు భారత్ దే . ఆ దేశ ఆర్ధిక వ్యవస్థ రాబోయే రోజులలో దూసుకుపోతుంది . ..” ఇది మన దేశంలో ఎదో ఒక నాయకుడు చేసిన కామెంట్స్ కాదు . . ఐక్యరాజ్య సమితి ( చీఫ్) సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్ ఇచ్చిన కితాబు .
భారత్ చాలా విజయవంతంగా వికసిస్తున్న ఆర్థిక వ్యవస్థ.. అని ఐక్యరాజ్యసమితి సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్ అభివర్ణించారు. అంతర్జాతీయ వ్యవహారాలపై పెద్ద ప్రభావాన్ని చూపగల సత్తా భారత ఆర్థిక వ్యవస్థకు ఉందన్నారు. ఏఐ ఇంపాక్ట్ సదస్సు- 2026 లాంటి అంతర్జాతీయ స్థాయి కీలక కార్యక్రమాన్ని నిర్వహించేందుకు భారతే సరైన చోటు అని తాను అభిప్రాయపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. అమెరికాలోని న్యూయార్క్‌లో ఉన్న ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో భారత వార్తాసంస్థ పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆంటోనియో గుటెరెస్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఫిబ్రవరి 16 నుంచి 20 వరకు న్యూదిల్లీ వేదికగా ప్రతిష్ఠాత్మకమైన ఏఐ ఇంపాక్ట్ సదస్సు- 2026 జరగబోతోందనే విషయాన్ని ప్రస్తావిస్తూ ఆయన ఈ కామెంట్స్ చేశారు.
బహుళ ధ్రువ ప్రపంచాన్ని కోరుకుంటున్నాను
‘ యావత్ ప్రపంచ వ్యవహారాలపై పెత్తనం ఒకే దేశం చేతిలో అస్సలు ఉండకూడదు. యావత్ ప్రపంచం రెండు సూపర్ పవర్‌ల మధ్య విభజితమై కూడా ఉండకూడదు. బహుళ ధ్రువ ప్రపంచాన్ని బలంగా కోరుకునే వ్యక్తుల్లో నేను కూడా ఒకడిని. బహుళ ధ్రువ ప్రపంచం ఏర్పడాలంటే అభివృద్ధిచెందుతున్న దేశాలకు వాణిజ్యం, టెక్నాలజీ, అంతర్జాతీయ సంబంధాలలో చాలాచాలా కీలకమైన పాత్రలను పోషించే అవకాశాలు లభించాలి. ఇటీవలే భారత్, యూరోపియన్ యూనియన్ (ఈయూ) మధ్య జరిగిన వాణిజ్య ఒప్పందమే అందుకు మంచి ఉదాహరణ. భారత్ వికాసాన్ని యావత్ ప్రపంచం గుర్తిస్తోంది. ప్రపంచంలోని అభివృద్ధి చెందిన దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలు ప్రత్యేక సమూహాలుగా ఏర్పడుతున్నాయి. ఈ సమూహాల వల్లే నిజమైన బహుళ ధ్రువ ప్రపంచం దిశగా బాటలు పడుతున్నాయి. దీనివల్ల ఏదో ఒక దేశం పెత్తనానికి అవకాశం లేకుండా పోతోంది’ అని ఐరాస చీఫ్ చెప్పారు.
రెండు సూపర్ పవర్‌లకె కాదు . ..
‘ఆర్టిఫిషియల్ ఇంటెలీజెన్స్ (ఏఐ) అనేది యావత్ ప్రపంచానికి ప్రయోజనాన్ని చేకూర్చాలి. కేవలం అభివృద్ధి చెందిన దేశాలకో, రెండు సూపర్ పవర్‌లకో(అమెరికా, చైనా) అది పరిమితం కాకూడదు. ఏఐ ఎవరో కొందరి సొత్తు కాదు. అది యావత్ ప్రపంచానిది. ప్రపంచంలో ప్రతీచోటా, ప్రతీ ఒక్కరికీ ఏఐ టెక్నాలజీ ఉపయోగపడాలి. ఈ సదస్సును నిర్వహిస్తున్నందుకు భారత్‌కు నా అభినందనలు. ఇందులో పాల్గొనేందుకు నేను కూడా దిల్లీకి వెళ్తున్నాను. భారత్‌లో జరగనున్న సదస్సులో ఏఐ వినియోగంపై కూలంకషమైన చర్చలు జరుగుతాయి. ఏఐను వినియోగించే క్రమంలో ఎదురయ్యే సవాళ్లు, ముప్పులపైనా డిస్కషన్ జరుగుతుంది’ అని ఐరాస చీఫ్ ఆంటోనియో గుటెరెస్ తెలిపారు.
ఆ అంశంపై ప్రధాని మోదీతో చర్చిస్తా
రోమన్ సామ్రాజ్య కాలంలోనూ మధ్యధరా సముద్ర ప్రాంత దేశాలతో భారత్‌కు బలమైన వాణిజ్య అనుబంధం ఉండేది’ అని ఐరాస చీఫ్ ఆంటోనియో గుటెరెస్ తెలిపార
‘పారదర్శకంగా అన్ని దేశాలకు సమ ప్రాధాన్యత లభించాలంటే ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు, అభివృద్ధిచెందుతున్న దేశాలకు బలంగా వాణిని వినిపించే అవకాశం లభించాలి. ప్రపంచంలో అభివృద్ధిచెందుతున్న దేశాలకు కేంద్ర బిందువుగా భారత్ కనిపిస్తోంది. ఈ అంశంపై నేను భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీతో చర్చిస్తాను. బహుళ ధ్రువ ప్రపంచం సాకారంలో భారత్ కీలక పాత్రను పోషిస్తుందనే ఆశాభావంలో నేను ఉన్నాను. భారత్‌కు వెళ్తున్నందుకు సంతోషంగా ఉంది. భారీ వైవిధ్యం, అద్భుత నాగరికత, సంస్కృతిలకు భారత్ నెలవు. అని తెలిపారు .
by Abhi Correspondent | Dec 6, 2025 | జనరల్
పుతిన్ భారత పర్యటన సందర్బంగా ఏవత్ ప్రపంచం మనవైపు ఫోకస్ పెట్టింది . అమెరికాను ఎదిరించి వాళ్ళ దాయాది దేశం రష్యాతో స్నేహ హస్తం అందుకోవడంపై ట్రంప్ మనపై విరుచుకుపడుతున్నారు . సందర్బం సృష్టించుకుని మరీ ఇండియాపై సుంకాల విధింపులతో ఆటలాడుకుంటున్నాడు . డాలర్ తో పోలిస్తే . .. భారత్ రూపాయ గణనీయంగా పడిపోయింది . రష్యా – భారత్ మైత్రీ మరింత విస్తరిస్తున్న నేపథ్యంలో ఇరు దేశాల మధ్య బంధం వెనుక వాస్తవాలు భ్రీప్ గా . ..
భారత్ . . రష్యా ఒప్పందాలపై కేవలం S-400 ఒప్పందాలు, చమురు బ్యారెల్స్ మాత్రమేనా? అంటే కాదనే చెప్పాలి . మీడియా . .. అంటే పత్రికలు, టివిలు చెప్పని కథ వేరే ఉంది. ఈ స్నేహం వెనుక దశాబ్దాల చరిత్ర, సంక్లిష్టమైన జియో-పాలిటిక్స్ భవిష్యత్తు సవాళ్లు ఎన్నో దాగి ఉన్నాయ్ . వాటిలో కొన్ని లోతైన అంశాలు ఓ సారి చూద్దాం . .
🎙️ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటన సందర్భంగా ప్రపంచం మొత్తం మన రెండు దేశాల వైపు చూడటంలో ఆశ్చర్యంలేదు . ప్రముఖ వార్తా ఛానెల్స్ అన్నీ ఆయుధ ఒప్పందాలు మరియు చమురు దిగుమతుల గురించే ఎక్కువ చర్చిస్తున్నాయి . కానీ, భారత్-రష్యా సంబంధం కేవలం వ్యాపారం మీదే ఆధారపడి ఉందా? 1. కేవలం కొనుగోలుదారు-అమ్మకందారు సంబంధం నుండి ‘మేక్ ఇన్ ఇండియా’ వరకు సాగిన ప్రయాణం. 2. చైనా విషయంలో రష్యా స్టాండ్ మరియు భారత్ ఆందోళనలు. 3. అణుశక్తి మరియు అంతరిక్ష రంగంలో (గగన్‌యాన్) రష్యా పాత్ర. 4. కొత్త వాణిజ్య మార్గాలు (INSTC) మరియు ఆర్థిక వ్యూహాలు. 5. మారుతున్న ప్రపంచంలో భారత్ తన “Strategic Autonomy”ని ఎలా కాపాడుకుంటోంది? పైపై మెరుగులని కాకుండా, సంబంధాల లోతుని అర్థం చేసుకోవడానికి వీటిపై కాస్త ఫోకస్ పెడితే తెలుస్తుంది . బ్యాక్‌గ్రౌండ్ సమాచారం కోసం మాత్రమే దీనిని పరిగణలోకి తీసుకోవాలి. ఇది పూర్తి స్థాయి రాజకీయ విశ్లేషణ కాదని గమనించాలి .