తమిళ రాజకీయాల్లో కొత్తశకం- విజయ్ సునామీ

Ram Maddipati

May 4, 2026

విజయ్ దెబ్బకు ‘ద్రవిడ’ పార్టీల విలవిలా — TVK గెలుపునకు కారణాలు ఇవే!

తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త శకానికి నాంది .. సుమారు ఐదు దశాబ్దాలుగా డీఎంకే–అన్నాడీఎంకే మధ్యే దోబూచులాడిన రాజకీయం . .. ఇప్పుడు కొత్త నాయకుడి చేతికి చిక్కింది . తమిళ తెరపై విశేష ప్రజాదరణ పొందిన దళపతి విజయ్ స్థాపించిన ”తమిళగ వెట్రి కళగం” (టీవీకే) తొలి ఎన్నికల్లోనే చారిత్రక విజయాన్ని దక్కించుకుని చరిత్రను తిరగరాసింది . ఈ అప్రతిహత విజయానికి దారి తీసిన ప్రధాన కారణాలపై ”అభి న్యూస్ ‘ ‘ ప్రత్యేక కథనం.

తమిళనాటలో దశాబ్దాలుగా కొనసాగుతున్న ద్విపార్టీ వ్యవస్థపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొని ఉంది . 1967 నుంచి రాష్ట్రంలో ప్రధానంగా డీఎంకే లేదా అన్నాడీఎంకే మాత్రమే అధికారంలో ఉండటం, విచ్చలవిడిగా అవినీతి ఆరోపణలు, కుటుంబ పాలన వంటి అంశాలు తమిళ ఓటర్లలో తీవ్ర విసుగు కలిగించాయి . మూడో ప్రత్యామ్నాయం కోసం ఎదురుచూస్తున్న తమిళులకు టీవీకే ఆశాకిరణంగా కనిపించింది.

స్పష్టమైన సిద్ధాంతపరంగా
విజయ్ వ్యక్తిగత నిర్ణయాలు కూడా పార్టీ విజయానికి కీలకంగా మారాయి. తన కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే కోట్లాది రూపాయల రెమ్యునరేషన్ వచ్చే సినిమాలను పూర్తిగా వదిలేయడం ఆయనపై ప్రజల్లో విశ్వాసాన్ని పెంచింది. ప్రజాసేవకే ప్రాధాన్యం ఇస్తున్నానని ఇచ్చిన సందేశం ఓటర్లను బలంగా ఆకట్టుకుంది. ఇక సిద్ధాంతపరంగా కూడా టీవీకే స్పష్టమైన దిశను చూపించింది. మత, కుల విభజనలకు దూరంగా ఉండే సెక్యులర్ భావజాలం, సామాజిక న్యాయం, సమానత్వం వంటి అంశాలను ముందుకు తీసుకెళ్లింది. పెరియార్, కామరాజర్, అంబేద్కర్ ఆలోచనలను సమన్వయం చేస్తూ అన్ని వర్గాలను ఆకర్షించే ప్రయత్నం చేసింది.

ఫ్యాన్ బేస్​ మరింత బలంగా . …
విజయ్‌కు ఉన్న ఫ్యాన్ బేస్ ఈ ఎన్నికల్లో ప్రధాన బలం అయింది. సంవత్సరాలుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న విజయ్ మక్కల్ ఇయక్కం క్రమంగా శక్తిమంతమైన రాజకీయ క్యాడర్‌గా మారింది. రక్తదాన శిబిరాలు, విద్యా సహాయం, విపత్తుల సమయంలో సహాయక చర్యలు వంటి కార్యక్రమాలు ప్రజల్లో విశ్వాసాన్ని పెంచాయి. యువత మద్దతు టీవీకే విజయానికి కీలకం. మొదటిసారి ఓటు వేసిన యువత పెద్దఎత్తున విజయ్‌కు మద్దతు తెలిపారు. ఉద్యోగ అవకాశాలు, విద్యా సంస్కరణలు, పారదర్శక పరీక్షా విధానం వంటి హామీలు వారికి ఆకర్షణీయంగా మారాయి. మహిళల కోసం ప్రత్యేక సంక్షేమ పథకాలు కూడా సైలెంట్ ఓటును టీవీకే వైపు మళ్లించాయి.

విజయ్ వ్యక్తిత్వం కలసివచ్చింది . ..
డిజిటల్ ప్రచారం కూడా పార్టీకి బలంగా పనిచేసింది. సోషల్ మీడియా వేదికల్లో విజయ్ అభిమానులు ముందుండి ప్రచారం నిర్వహించారు. వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ ద్వారా పార్టీ సిద్ధాంతాలు, మేనిఫెస్టో ప్రజలకు చేరేలా చేశారు. ఇది గ్రామీణ ప్రాంతాల్లో కూడా ప్రభావం చూపింది. విజయ్ వ్యక్తిత్వం కూడా ఓటర్లను ఆకట్టుకుంది. సాధారణ జీవనశైలి, ప్రజల్లోకి వెళ్లి మమేకం కావడం, అభిమానులతో దగ్గర సంబంధం పెట్టుకోవడం వంటి లక్షణాలు ఆయనను ప్రజలకు మరింత దగ్గర చేశాయి. అన్నాగా పిలిచే ఈ అనుబంధం ఓట్ల రూపంలో ప్రతిఫలించింది.

You May Also Like…

‘బెంగాల్​ బీజేపీ’ భారీ విజయం

‘బెంగాల్​ బీజేపీ’ భారీ విజయం

ఈ భారీ సక్సెస్ వెనుక ఉన్న మాస్టర్ మైండ్స్ వీరే! కేంద్ర నాయకత్వం నుంచి బూత్ స్థాయి కార్యకర్తల వరకు అనేక మంది నేతల కృషి-...