తమిళనాడులో తండ్రీకొడుకుల లాకప్‌డెత్ కేసు- 9మంది పోలీసులకు మరణశిక్ష
సత్తాంకుళం లాకప్‌డెత్ కేసు- ఒక ఇన్స్పెక్టర్ సహా 9 మంది పోలీసులకు మరణశిక్ష విధించిన మధురై సెషన్స్ కోర్టు
Sathankulam Father-Son Murder Case
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2020 నాటి సత్తాంకుళం లాకప్ డెత్ కేసులో మధురైలోని ఒకటవ అదనపు జిల్లా, సెషన్స్ కోర్టు వెలువరించిన తీర్పు దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనమ్ సృష్టించింది . వ్యాపారి జయరాజ్, అతని కుమారుడు బెనిక్స్ మరణానికి కారణమైన 9 మంది పోలీసులకు మరణశిక్ష విధించింది. ఈ కేసులో మొత్తం 10 మంది పోలీసులపై సీబీఐ కేసు నమోదు చేయగా, విచారణ సమయంలో ఒక పోలీసు అధికారి కొవిడ్ కారణంగా మృతిచెందారు.
ఏమి జరిగింది . .. నిర్దేశించిన సమయం కంటే అదనపు సమయం మొబైల్ షాప్ తెరచి ఉంచారని కోవిద్ సమయంలో పోలీసులు జయరాజ్ ను, అతడి కుమారుడిని అదుపులోకి తీసుకున్నారు .
2020 జూన్ 19న జయరాజ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి కుమారుడు బెనిక్స్ పోలీసు స్టేషన్‌కు చేరుకొని తన తండ్రిని కొట్టడాన్ని అడ్డుకున్నాడు. కోపోద్రికులైన పోలీసులు రెచ్చిపోయారు . విచక్షణ మరిచారు . ”పోలీసులతో ఎలా ప్రవర్తించాలో నేర్పిస్తాం . .మీకు తగిన బుద్ధి చెబుతాం” అంటూ ఇద్దరినీ రాత్రంతా పోలీస్ స్టేటషన్ లోనే విచక్షణారహితంగా చిత్రహింసలకు గురిచేశారు. మరుసటి రోజు ఉదయం ఒక పారిశుద్ధ్య కార్మికుడితో రక్తాన్ని శుభ్రం చేయించి ఆధారాలను ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు. ఒక మహిళా హెడ్ కానిస్టేబుల్ వాంగ్మూలం, మెడికల్ రిపోర్ట్, జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ నివేదిక ఆధారంగా మద్రాస్ హైకోర్టు మధురై ధర్మాసనం సుమోటోగా స్పందించి, పోలీసులపై హత్య కేసు నమోదు చేయాలని ప్రాథమికంగా నిర్ధారించారు . అప్పటి అన్నాడీఎంకే ప్రభుత్వం ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించింది. సెప్టెంబర్ 2020లో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు చేయగా, సోమవారం న్యాయస్థానం ఈ చారిత్రక తీర్పును వెలువరించింది.
అయితే ఈ కేసులో మహిళా కానిస్టేబుల్ ఇచ్చిన వాంగ్మూలం కీలక0గా మారింది . స్టేషన్ లో రక్తపు మరకలను కూడా పోలీసులు తుడిపించేసారు . ప్రధాన సాక్షిగా ఉన్న సదరు మహిళా కానిస్టేబుల్ కి అత్యంత భారీ భద్రత కల్పించాలని ప్రజాసంఘాలు కోరుతున్నాయి .



