రష్యా..ఇండియా..చైనా.. కలిస్తే ఏమవుతుంది ?

రష్యా..ఇండియా..చైనా.. కలిస్తే ఏమవుతుంది ?

ఐక్యమత్యంతోనే ఈ సాంకేతిక యుగంలో ముందుకెళ్లగలం

“ఆపరేషన్ సిందూర్” తో భారత్ …పాకిస్థాన్ ను గోడకుర్చీ వేయించింది/ అంతకు మించి ప్రపంచంలో శక్తివంతమైన “ఇండో పసిఫిక్” రాజకీయ, ఆర్ధిక డైనమిక్స్ ముందువరుసలో భారత్ ను తీసుకువెళ్తుంది. 

ఇండో పశిఫిక్ ప్రాంతం గురించి క్లుప్తంగా తెలుసుకుందాం: హిందూ మహాసముద్రం, పసిఫిక్ మహాసముద్రం  పశ్చిమ, మధ్య భాగాలను ఇండో-పసిఫిక్ ప్రాంతం అంటారు. ఇందులో తూర్పు ఆఫ్రికా నుండి పశ్చిమ అమెరికా వరకు విస్తరించిన భూభాగం ఉంటుంది. ఈ ప్రాంత భౌగోళిక లక్షణాలు రాజకీయ ఆర్థిక డైనమిక్స్‌ను గణనీయంగా ప్రభావితం చేస్తాయి. ఇండో-పసిఫిక్ యొక్క భౌగోళిక రాజకీయ మరియు ఆర్థిక ముఖచిత్రం యొక్క కీలక భౌగోళిక అంశాలు ఉన్నాయి.

ప్రపంచ వాణిజ్యంలో 50% కంటే ఎక్కువ జరిగే సముద్ర మార్గాలు ఇండో-పసిఫిక్ ప్రాంతంలో వున్నాయి. మలక్కా జలసంధి ద్వారా సంవత్సరానికి 100,000 ఓడలు దాటుతాయి, ఇవి చైనా, జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాలకు ఇంధనాన్ని వస్తువులను రవాణా చేస్తాయి. సింగపూర్, హాంకాంగ్, మరియు షాంఘై వంటి ఓడరేవులు ఈ ప్రాంతంలో ఆర్థిక కేంద్రాలుగా ఉన్నాయి.

ప్రపంచం “పెద్దన్న” గా భావించే అమెరికా నేతృత్వంలో జపాన్, ఫిలిప్పీన్స్, ఆస్ట్రేలియా దేశాల కూటమి ఇండో పశిఫిక్ ప్రాంతంలో ఆధిపత్యం వహిస్తోంది. అమెరికా ఉద్దేశ్యపూర్వకంగానే భారత్ ను ఇందులో కలపలేదు.

ఆపరేషన్ సిందూర్ తరువాత ప్రపంచదేశాల్లో భారత్ పట్ల ఆలోచనల్లో పెద్ద మార్పు వచ్చింది. ఇది కేవలం సైనిక విజయం వల్ల మాత్రమే కాదు. ఆరు సంవత్సరాలుగా ఆర్ధిక రంగంలో వృద్ధి ప్రభావం. ఆర్ధికంగా 10 వస్ధానం నుంచి 4 వ స్థానానికి చేరుకున్న భారత్ సామర్ధ్యాన్ని ప్రపంచం కుతూహలంగా గమనిస్తోంది. ఆపరేషన్ సిందూర్ ఒక ట్రిగ్గర్ గా పనిచేసింది.

మరోవైపు ఇండో పశిఫిక్ ప్రాంతంలో అమెరికా పక్కనపెట్టిన భారత్ ఇదే ప్రాంతంలోని తైవాన్ తో వాణిజ్యం, ఫిలిప్పీన్స్ తో మిసైల్స్ సరఫరా, జపాన్ తో టెక్నాలజీ సప్లైస్, వియత్నాంతో సైనిక సహకారం, ఇండోనేషియాతో సముద్ర భద్రత ఒప్పందాలు కుదుర్చుకుంది.

ఇదే అదనులో రష్యా ప్రతిపాదించిన రష్యా ఇండియా చైనా (RIC) ప్రతిపాదన మరోసారి తెరమీదికి వచ్చింది.

RIC ఒక త్రైపాక్షిక సహకార వేదికను సూచిస్తుంది. ఇది ఈ మూడు దేశాల మధ్య రాజకీయ, ఆర్థిక, వ్యూహాత్మక, మరియు సాంస్కృతిక సంబంధాలను బలోపేతం చేయడానికి ఏర్పాటైన ఒక అనధికారిక ఏర్పాటు. RIC సమావేశాలు సాధారంణంగా ఈ దేశాల విదేశాంగ మంత్రుల స్థాయిలో జరుగుతాయి.

వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధన రంగం, మరియు సాంకేతికతలో సహకారాన్ని పెంచడం RIC లక్ష్యం.

ప్రపంచ రాజకీయాలలో పాశ్చాత్య దేశాల ఏకపక్ష వ్యతిరేకించి, ప్రపంచ వ్యవస్థను ప్రోత్సహిస్తాయి. ఉగ్రవాదం, సైబర్ భద్రత, మరియు ప్రాంతీయ స్థిరత్వంపై సమిష్టి చర్యలపై చర్చలు జరుగుతాయి.ఆఫ్ఘనిస్తాన్, మధ్య ఆసియా, మరియు ఇండో-పసిఫిక్ ప్రాంతంలో స్థిరత్వం కోసం సహకారం. విద్య, పర్యాటకం, సాంస్కృతిక మార్పిడి కార్యక్రమాల ద్వారా ప్రజల మధ్య సంబంధాలను బలోపేతం చేయడం.

ఆపరేషన్ సిందూర్ తరువాత RIC కూటమి బలోపేతం కాగల అవకాశాలు బాగా మెరుగయ్యాయి. ప్రపంచ జనాభాలో ఈ మూడుదేశాల జనాభా 36 శాతం. అలాగే ప్రపంచ వాణిజ్యంలో ఈ మూడుదేశాల వాటా 37 శాతం. RIC బలపడితే ఈ సహజ సామర్ధ్యమే!

ఈ కూటమి దేశాల సమస్యలను చర్చలద్వారా పరిష్కరించుకోగలిగి, ఏకాభిప్రాయంతో ముందుకి వెళ్ళగలిగితే సూపర్ పవర్ కాగలుగుతాయి.

ఆధిపత్యాన్ని నిలబెట్టుకోడానికి విభజించి పాలించడం ఒక కుటిలనీతి. అపుడు బ్రిటన్, ఇపుడు అమెరికా ఇదే దుర్నీతి పాటించాయి. ఫలితంగా పుట్టిన ద్వేషాగ్నితో ఇప్పటికీ ఇండియా, పాకిస్థాన్ – రష్యా, ఉక్రెయిన్ మండిపోతున్నాయి. వనరులను సద్వినియోగం చేసుకోగలిగిన సామర్థ్యమే శక్తిగా మారుతుంది. ఆ శక్తితో పాటు దౌత్యనీతి కూడా భారత్ ను పెద్ద ఇన్ ఫ్లుయెన్సర్ గా  నిలబెడుతోంది. ఇలాంటి ఇన్ ఫ్లుయెన్సే విద్వేషాల్ని చల్లార్చగలుగుతుంది.

మన స్వరం పెంచి ఐక్యరాజ్య సమితి ని నిలదీసే వరకూ భారత్ ఇన్ ఫ్లుయెన్స్ పెరిగింది. సమితిలో శాశ్వత సభ్యత్వం, వీటో అధికారాల కోసం ఇండియా చాలాకాలంగా ప్రయత్నిస్తోంది. సమితి భద్రతామండలి తాజాసమావేశంలో సెక్రెటరీ మేరీ జాన్సన్ ఈ అంశాన్ని ప్రస్తావించి “భారత్ అభివృద్ధి చెందుతున్న దేశం మాత్రమే. అభివృద్ది చెందాక వీటో అధికారం కూడా వస్తుంది” అన్నారు. దీనిపై విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ భారత్ ఏ రంగంలో ఏమేమి  సాధించిందో వివరిస్తూ, భారత్ ఎక్కడ వెనుకబడిందో చెప్పాలని అడిగినపుడు సెక్రెటరీ మాట్లాడలేకపోయారు. అంటే పరిస్థితి ఏవిధంగా ఉందొ అర్ధం చేసుకోవచ్చు .

టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్.. లోకేష్ ని  ఆపిందెవరు?

టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్.. లోకేష్ ని ఆపిందెవరు?

రాజకీయ నిర్ణయాలలో చంద్రబాబు తటపటాయింపులతో నష్టం – సీనియర్లను పక్కనపెట్టాలి

యువగళం పాదయాత్ర ద్వారా తన సత్తా ఏమిటో నిరూపించుకున్న నేత నారా లోకేష్. అంచలంచలుగా రాజకీయంగా తన సామర్ధ్యాన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ రాటుదేలారు లోకేష్. టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా లోకేష్ కి ఈ మహానాడులోనే పట్టంకడతారని అంతా భావించారు . అయితే చంద్రబాబు ప్రతీ విషయంన్నీ పదేపదే ఆలోచిస్తారు. దీనివల్ల ఎక్కువ నష్టం వాటిల్లుతుంటుంది . పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి విషయంలో సైతం సీనియర్లు నూరిపోసి భయ0తో చంద్రబాబు వెనకడుగువేసినట్లు కనిపిస్తోంది .

మహానాడులో లోకేష్ సత్తా . …

మహానాడులో లోకేశ్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మూడవ తరం ప్రతినిధిగా తెలుగుదేశం పార్టీ బాధ్యతలు నిర్వహించగల శక్తియుక్తులు తనకు ఉన్నాయని ఆయన నమ్మకం కలిగించగలిగారు. మహానాడులో లోకేశ్‌ ప్రసంగాన్ని గమనిస్తే ఆయనలో మూర్తీభవించిన ఆత్మవిశ్వాసం ప్రస్ఫుటమైంది . ఎన్టీఆర్‌ ఉన్నప్పుడు నంబర్‌ 2గా ఉన్న చంద్రబాబును కూడా అప్పటి కాంగ్రెస్‌ నాయకులు టార్గెట్‌ చేశారు. ఆయనపై నిత్యం ఆరోపణలు చేసేవారు. చివరికి చర్మ సంబంధమైన సమస్య వచ్చి చికిత్స తీసుకున్నప్పుడు కూడా అవమానించారు. అయితే లోకేశ్‌కు ఎదురైనన్ని అవమానాలు చంద్రబాబుకు ఎదురవలేదు. తనపై వస్తున్న ఆరోపణలకు చంద్రబాబు వెరవకుండా కార్యకర్తలు, నాయకులకు నిత్యం అందుబాటులో ఉండటం ద్వారా ఎన్టీఆర్‌కు వారసుడిగా నిలిచారు. 1983లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయిన చంద్రబాబు, ఆ తర్వాత సురక్షితమైన కుప్పం నియోజకవర్గానికి మారారు. లోకేశ్‌ అలా చేయలేదు. సంక్లిష్టమైన మంగళగిరి నుంచి మొట్టమొదటిసారి పోటీచేసిన ఆయన ఓడిపోయారు. మంగళగిరి నుంచి పోటీ చేసి ఉండాల్సింది కాదు అని అప్పట్లో చాలా మంది అభిప్రాయపడ్డారు. ఎందుకంటే, మంగళగిరిలో 1983 నుంచి నేటి వరకు తెలుగుదేశం పార్టీ మూడు నాలుగు పర్యాయాలు మాత్రమే గెలిచింది. అయినప్పటికీ లోకేశ్‌ మరో సురక్షిత నియోజకవర్గం వెతుక్కోకుండా ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలి అన్నట్టుగా పట్టుదల ప్రదర్శించి గత ఎన్నికల్లో తాను ఓడిన మంగళగిరి నుంచే 91 వేల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు. ఆయనలోని ధైర్యానికి, పట్టుదలకు ఇదొక నిదర్శనం. ఈ నేపథ్యంలో కడపలో జరిగిన మహానాడులో లోకేశ్‌కు పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పదవి అప్పగించాలని పలువురు ప్రతిపాదించారు. నిజానికి ఆయన ఇప్పుడు జాతీయ ప్రధాన కార్యదర్శిగా మాత్రమే ఉన్నప్పటికీ పార్టీ నిర్వహణ బాధ్యతలను ఇప్పటికే చేపట్టారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రభుత్వ కార్యక్రమాలతో బిజీగా ఉంటున్నందున పార్టీ బాధ్యతలను లోకేశ్‌ చూసుకుంటున్నారు. పార్టీలోని సీనియర్‌ నాయకులు కూడా ఆయన నాయకత్వాన్ని ఇప్పుడిప్పుడే అంగీకరిస్తున్నారు. కార్యకర్తల్లో కూడా లోకేశ్‌ నాయకత్వం పట్ల నమ్మకం ఏర్పడుతోంది. జగన్‌ అధికారంలో ఉన్నప్పుడు దారుణ హత్యకు గురైన చంద్రయ్య అనే పార్టీ కార్యకర్త కుమార్తెకు ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించడంలో లోకేశ్‌ పట్టుదలతో కృషి చేశారు. దీంతో ఆయనపై కార్యకర్తల్లో భరోసా ఏర్పడింది. ఇప్పుడు ప్రజా నాయకుడిగా గుర్తింపు పొందడమే లోకేశ్‌ ముందున్న కర్తవ్యం. ప్రజలతో నేరుగా సంబంధాలు ఏర్పరచుకోవడం, అంటే ప్రజల్లోకి వెళ్లడం ద్వారా ప్రజామోదం పొందే ప్రయత్నాలను ఆయన ఇప్పటికే మొదలెట్టారు.

మోదీ సలహ . .. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీని లోకేశ్‌ కలుసుకోవడం, ప్రధాని వారితో రెండు గంటలపాటు గడపటం తెలిసిందే. ఈ సందర్భంగా లోకేశ్‌కు కొన్ని సూచనలు చేయడంతో పాటు ఆయనలో తాను గమనించిన మార్పు గురించి కూడా ప్రధాని మోదీ ప్రస్తావించారు. ‘మీలో పరిణతి కనిపిస్తోంది. ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతోంది. మీ ప్రసంగాలలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ మార్పును నేను గమనించాను. మొదట్లో తడబడిన మీరు ఇప్పుడు ఆసువుగా ఉపన్యసిస్తున్నారు’ అని ప్రధాని మోదీ ప్రశంసించారు. అదే సమయంలో చంద్రబాబు నీడ నుంచి బయటపడి సొంతంగా ఎదిగే ప్రయత్నం చేయాలని కూడా లోకేశ్‌కు ప్రధాని సూచించారు. ప్రధాని పరిశీలన నిజమే. గతంతో పోలిస్తే లోకేశ్‌ ఇప్పుడు రాటుదేలారు. నిజం చెప్పాలంటే, ముఖ్యమంత్రి చంద్రబాబు ఉపన్యాసాలు ప్రజలను ఆకట్టుకొనే విధంగా ఉండవు. ఆయనకు అంతటి వాగ్ధాటి లేదు. 2019కి పూర్వం తెలుగులో మాట్లాడటానికి తొట్రుపడిన లోకేశ్‌, ఇప్పుడు అనర్గళంగా మాట్లాడగలుగుతున్నారు. లోకేశ్‌ భాష కూడా బాగా మెరుగైంది. అదే సమయంలో ఆయనలో ఆత్మవిశ్వాసం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. బాడీ లాంగ్వేజ్‌ కూడా అందుకు అనుగుణంగా మారింది. దీనికోసం లోకేష్ ఎంతో ప్రాక్ట్స్స్ చేసారు .

ఎదురైన అవమానాలు . .. వర్తమాన రాజకీయాలలో లోకేశ్‌కు ఎదురైనన్ని అవమానాలు మరే ఇతర నాయకుడికీ ఎదురవలేదు. జగన్‌ అండ్‌ కో ఒక పథకం ప్రకారం లోకేశ్‌ను కించపరిచే విధంగా ప్రచారం చేశారు. పప్పు అని అవమానించారు. ఆయన భాషను హేళన చేశారు. చివరికి ఆయన పుట్టుకపై కూడా జుగుప్సాకరంగా మాట్లాడారు. మామూలుగా అయితే ఇన్ని అవమానాలు ఎదురైనప్పుడు మానసికంగా కుంగిపోతాం. అయితే లోకేశ్‌ వాటిని పట్టించుకోకుండా లక్ష్యం వైపు కదిలారు. తానేమిటో రుజువు చేసుకోవడానికి అహరహం కృషి చేశారు. బాడీ షేమింగ్‌కు గురైనప్పటికీ బాధపడకుండా ఆహార నియంత్రణ పాటించడం ద్వారా విమర్శకుల నోళ్లు కట్టేశారు. రాజకీయాలలో నంబర్‌ 2గా ఉన్న వారిని టార్గెట్‌ చేసుకోవడం సహజం.

లోకేష్ నడపగలరు . .. పార్టీని సమర్ధవంతంగా నడపగల సత్తా లోకేష్ సంపాదించుకున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇస్తే ఆయన సామర్ధ్యాన్ని నిరూపించుకునే ఛాన్స్ దక్కుతుంది . చంద్రబాబు సీనియర్ల మాటాలకు కాస్త భయపడుతూ . .. తన నిర్ణయాన్ని వాయిదావేసుకోవడం పార్టీ రాజకీయాలకు ఎంతోకొంత నష్టం చేకూరుస్తుంది . దీనిపై చంద్రబాబు పునరాలోచుంచుకోవాలి .

అమరావతి విష బీజాలు కట్టడి చేయకపోతే,

అమరావతి విష బీజాలు కట్టడి చేయకపోతే,

Those who are spewing venom at Amaravati must be stopped

జగన్ మోహన్ రెడ్డి పార్టీని 11 సీట్లకే పరిమితం చేసి జనం మూలన కూర్చోబెట్టినా.. కొందరు కీలక నేతలైతే కుదేలయ్యారు కానీ , ,ఆ పార్టీ సోషల్ మీడియా బ్యాచ్ మాత్రం ఎక్కడా తగ్గలేదు. విష ప్రచారాలను చొప్పిస్తూనే ఉన్నారు . వీరిని కట్టడి చేయడం కూటమి సర్కార్ కి చేతకావడంలేదనే చెప్పాలి. ఒకటీ , ఆరా కేసులు పెట్టినా వాళ్లలో భయం పుట్టించలేకపోతున్నారన్న విమర్శలు కూటమి కేడర్ నుంచే బలంగా వినిపిస్తున్నాయి .

‘‘అమరావతి పేరిట ఒక వర్గం ప్రజలకు మేలు చేసేందుకు అప్పులు చేసి లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేయడం అవసరమా? రాష్ట్ర ప్రజలందరికీ చెందిన సొమ్మును ఒకేచోట ఖర్చు చేయడం ఏమిటి?’’ అంటూ ప్రజలలో విష ప్రచారం చేస్తున్న వారికీ వాస్తవాలు తెలుసు . అయినా విషం చిమ్ముతున్నారు . అమరావతి నిర్మాణానికి ఖర్చు చేయబోయే డబ్బుకు రాష్ట్ర బడ్జెట్‌తో సంబంధం లేదు. రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఇచ్చిన భూముల్లో ప్రభుత్వానికి తన వాటాగా వచ్చే భూమిని అభివృద్ధి చేసి విక్రయించడం ద్వారా రాజధాని నిర్మాణానికి నిధులు సమకూర్చుకుంటున్నారు. అందుకే ఇది సెల్ఫ్‌ ఫైనాన్స్‌ ప్రాజెక్టు అయింది. హైదరాబాద్‌లో, అంటే సైబరాబాద్‌లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి తెలంగాణ ప్రభుత్వాలు కూడా తమ వద్ద ఉన్న భూములను విక్రయించడం ద్వారా నిధులు సమకూర్చుకోవడం వాస్తవం కాదా? ఇప్పుడు అభివృద్ధి చెందిన హైదరాబాద్‌ నుంచి అందుతున్న ఫలాలతోనే తెలంగాణలోని మిగతా ప్రాంతాలను అభివృద్ధి చేయడాన్ని గుర్తు చేసుకోవాలి .

రాజధాని నిర్మాణం కోసం యాభై వేల ఎకరాలు అవసరమా? అని వైసీపీ సోషల్ మీడియాతో పాటు , ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కొంతమంది అపర మేధావులు ఇప్పటికీ గొంతు చించుకుంటూనే ఉన్నారు . ఇలాంటి వాళ్లు హైదరాబాద్‌ అభివృద్ధి ఎలా జరిగిందో తెలుసుకోవాలి. ప్రైవేటు సంస్థలకు కేటాయించడానికి అవసరమైన భూమి ప్రభుత్వం వద్ద ఉన్నప్పుడే ఏ కంపెనీ అయినా ముందుకు రావడానికి ఆసక్తి చూపుతుంది. హైదరాబాద్‌లో ఇప్పటికీ ప్రభుత్వం వద్ద కొన్ని వేల ఎకరాల భూమి ఉంది. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలనుకొనే వారికి ఈ భూములను ఆకర్షణగా చూపుతున్నారు. అమరావతి మహానగరంగా అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వాలతో పాటు ప్రైవేటు రంగం కూడా ముందుకు రావాలి. ప్రధానమంత్రి శుక్రవారం నాడు ప్రారంభించిన పనులతోనే రాజధాని నిర్మాణం సంపూర్ణం కాదు. ప్రభుత్వ నిర్మాణాలతో పాటు ప్రైవేటు రంగంలో కూడా నిర్మాణాలు జరిగినప్పుడే రాజధానికి ఒక రూపు వస్తుంది. అమరావతిని మాత్రమే అభివృద్ధి చేస్తే రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల పరిస్థితి ఏమిటని నసుగుతున్నవారు ఈ విషయం తెలుసుకోవాలి. తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర ఆర్థికంగా పరిపుష్టంగా ఉండటానికి కారణం ??? చెన్నయ్‌, బెంగళూరు, ముంబై వంటి మహానగరాలు ఉండటం వల్లనే ఈ రాష్ట్రాలకు భారీగా ఆదాయం సమకూరుతుంది . ఇలాంటివన్నీ ప్రజలలోకి వెళ్లేలా కూటమి సర్కార్ చర్యలు తీసుకోవాలి .

అమరావతిపై లేనిపోని విష ప్రచారం చేస్తున్న వైసీపీ సోషల్ మీడియా , మేధావుల ముసుగులో జనాన్ని రెచ్చగొడుతూ . . రాష్ట్రాభివృద్ధికి అడ్డుగా ఉండేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. వారి ప్రతి చర్యలను గమనించడానికి పోలీసు శాఖలో ఒక ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసి . .. నిఘా ద్వారా విష బీజాలు నాటే వారిని ఆదిలోనే అడ్డుకోవాలి . లేకపోతె . .. అమరావతి అనే మహా యజ్ఞంలో విషం చిమ్మే వారు మరింత పెట్రేగిపోయే ప్రమాదం పొంచి ఉందని చంద్రబాబు , పవన్ కళ్యాణ్ గ్రహించి మేల్కోవాలి. మెతక వైఖరి వీడి , అరాచకవాదులపై కొరఢా ఝళిపించాలి .

మద్యం కుంభకోణంలో ‘మర్డర్ ‘  కేసులు

మద్యం కుంభకోణంలో ‘మర్డర్ ‘ కేసులు

2019లో అధికారం చేపట్టిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ధనదాహానికి ఆంధ్రప్రదేశ్ లో వందలమంది మందుబాబులు బలయ్యారు . వేలమంది అనారోగ్యంపాలై , రోగాలతో కునారిల్లడానికి నాసిరకం , కల్తీ మద్యం కారణమని చెప్పవచ్చు .

అప్పట్లో జరిగిన మద్యం కుంభకోణంపై కూటమి సర్కార్ ‘సిట్ ‘ వేసింది . ఈ కేసులో ఇప్పటివరకు పదిమంది వరకు అరెస్టయ్యారు . కీలక సూత్రధారులైన రాజ్ కసిరెడ్డి , సజ్జల రెడ్డి వంటి వారు అరెస్టయ్యారు . మరికొందరు అరెస్టవ్వడానికి సిద్ధంగా ఉన్నారు . ఇంతవరకు ఓకె . అయితే ఈ కేసును కేవలం ఆర్ధిక దోపిడీ వరకు చూసి వదిలేయడానికి లేదు . జగన్ సర్కార్ చర్యల వల్ల ప్రాణాలు కోల్పోయిన వారందరి తరపున మద్యం కుంభకోణంలో సూత్రదారులు , పాత్రదారులపై హత్య నేరం కింద కేసులు పెట్టాలన్న డిమాండ్ రోజురోజుకీ ఎక్కువవుతోంది .

సీఎంగా అధికార పీఠం ఎక్కిన వెంటనే  జగన్మోహన్‌రెడ్డి  మద్యం కొనుగోళ్ల వ్యవహారాన్ని సమూలంగా మార్చి తనకు, తన వారికి  పాడి ఆవుగా చేసుకున్నారు. అప్పటి వరకు ఉన్న  పాపులర్‌ బ్రాండ్లను పక్కనబెట్టి, కమీషన్లు ముట్టజెప్పిన కంపెనీల మద్యాన్ని మాత్రమే కొనుగోలు చేసే విధానాన్ని తీసుకువచ్చారు.   ఊరూ పేరూ లేని కంపెనీలను సృష్టించి, వాటి ద్వారా నాసిరకం మద్యాన్ని ఉత్పత్తి చేయించి ప్రభుత్వం తరపున  కొనుగోలు చేశారు. ఫలితంగా పలువురు మద్యం ప్రియులు ప్రాణాలు కోల్పోగా, మరెందరో రోగాలు పాలయ్యారు.   కుంభకోణానికి పాల్పడిన వారు కొన్ని వేల కోట్ల రూపాయల సొమ్ము జేబులో వేసుకోవడంతోపాటు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడారు. ఈ కారణంగా దీన్నొక ఆర్థిక నేరంగానే కాకుండా ప్రజల చావుకు కారకులుగా గుర్తించి కేసు కట్టాల్సిన అవసరం ఉందన్న డిమాండ్లను పరిగణలోకి తీసుకోవాలి.

 ఇసుక, మద్యంను సొంత ఆదాయ వనరులుగా మార్చుకోవడంలో జగన్‌ అండ్‌ కో ఆరితేరారు . అంతకు ముందు 2014-2019 మధ్య అధికారంలో ఉన్నపుడు టీడీపీ ఎమ్మెల్యేలు ఇసుకలో మాత్రం బాగానే దండుకున్నారు . దీనిని గమనించిన జగన్ ఇసుక అక్రమాలలో మరో అడుగు ముందుకేసి వేల కోట్ల సమకూర్చుకోగలిగారన్న ఆరోపణలు ఉన్నాయి . ఇసుక వంటి వాటిలో దోపిడీని ప్రజలు సైతం పెద్దగా పట్టించుకోరు . అవసరమైన వాళ్ళు మాత్రం డబ్బు ఎక్కువ పెట్టాల్సిన వస్తుందని ఆ కాసేపు తిట్టుకుని వదిలేస్తారు . మద్యం విషయం అలా కాదు . . నాసిరకం మద్యం సరఫరా ద్వారా బోలెడంత డబ్బుతో పాటు . . అంతకు అనేకరెట్లు పాపం కూడా మూటకట్టుకున్న జగన్ అండ్ కో మాత్రం దానికి మూల్యం చెల్లించుకోవాల్సిందే . చంద్రబాబు సర్కార్ వదిలిపెట్టిన పైవాడు మాత్రం వదిలిపెడతాడా ? అన్న కామెంట్స్ కూడా వస్తున్నాయ్ .

లిక్కర్‌ కుంభకోణంలో అరెస్టయిన వారితో పాటు విచారణకు హాజరైన నిందితులు చెప్పిన వివరాల ప్రకారం… ఈ వ్యవహారంలో భాగస్వామ్యం ఉన్న ప్రతి ఒక్కరూ అమానవీయంగా వ్యవహరించారు. తమ ధనదాహం పేదల ఉసురు తీస్తుందన్న విషయాన్ని విస్మరించిన అధికారులు , అత్యున్నత పదవులు నిర్వహించిన వారు నాసిరకం మద్యంతో మరణించిన , అనారోగ్యంపాలైన కుటుంబాల ఆర్తనాదాలు తగలకుండా ఉంటాయా ? కర్మ ఫలం అనుభవించక తప్పదని మరువకండి .

ఎన్టీఆర్ పై లేని ‘కమ్మ ముద్ర’ చంద్రబాబుపైనే  ఎందుకు?

ఎన్టీఆర్ పై లేని ‘కమ్మ ముద్ర’ చంద్రబాబుపైనే ఎందుకు?

‘కమ్మ ‘ కులానికి చంద్రబాబు ”మేళ్లు ‘ ‘ చేయకపోయినా విమర్శలు ఎందుకు ? రాజకీయ నిర్ణయాలను వ్యతిరేకించేది సొంత కులంలోనే ఎక్కువ – అరాచకాలు చేసినా జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా నిలుస్తున్న వైసీపీ సోషల్ మీడియా చంద్రబాబును తూర్పారబెడుతున్న తెలుగు తమ్ముళ్లు – టీడీపీ మద్దతు సోషల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా

గొప్ప పరిపాలనా దక్షుడు – రాజకీయ చాణక్యుడు – గ్రేట్ విజనరీ – అభివృద్ధి విధాత . .. ఇలాంటి ఎన్నో గొప్ప పదాలు , పోలికలు చంద్రబాబుకి మణిహారాలు. ఈ తరం నేతలలో చంద్రబాబు నిస్సందేహంగా పరిపాలనా దక్షుడే. అకుంఠిత దీక్ష , కష్టపడే తత్త్వం , అధికారులు , ఉద్యోగులను పరుగులు పెట్టించే నైజం ఈయనిది. ప్రత్యేకంగా కులాలపై ప్రేమ ఉండదు. అయినా చంద్రబాబుకి ”కమ్మ ‘ ‘ ముద్ర ఎందుకు పడుతుంది. లేని అపఖ్యాతిని ఎందుకు మూటకట్టుకోవాల్సి వస్తోంది? సీరియస్ గా ఆలోచించుకోవాల్సిన తరుణం ఆసన్నమయింది .

టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు .. పై ఎప్పుడూ కమ్మ ముద్ర పడలేదు . బడుగు , బలహీనవర్గాల అజెండాతో పార్టీని స్థాపించారు . అంత సిన్సియర్ గా పాలన సాగించారు . పాలన వ్యవహారాలలో ఎన్టీఆర్ కంటే మెరుగ్గా చేసినా , రాజకేయం ఈ విషయంలో చంద్రబాబులో అంత సిన్సియారిటీ కనిపించదు

స్వయంకృతమే:

2014-2019 మధ్య అధికారంలో ఉన్నపుడు కేంద్ర మంత్రులుగా సుజనా చౌదరి , అశోక్ గజపతి ఉన్నారు . వీరిలో అశోక్ గజపతిరావు మంచి పేరున్న నేత. విలువలతో కూడిన రాజకీయాలు చేసే నాయకుడిగా అశోక్ గజపతి ఖ్యాతిపొందారు . అలాంటి నేతను పక్కన పెట్టి . .. లాబీయిస్టుగా పేరొందిన సుజనా చౌదరిని రాజకీయంగా ముందు పెట్టారు. కేంద్రంలో ప్రాధాన్యత తీసుకువచ్చారు.

  • చంద్రబాబు చేసిన ఈ పనికి అప్పట్లో రాష్ట్రంలోనూ , కేంద్రంలోనూ ‘కమ్మ ముద్ర ‘ తెచ్చుకున్నారు .
  • 2014-2019 సమయంలోనే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఉత్తరప్రదేశ్ కేడర్ కి చెందిన ఐఏఎస్ అధికారి ఏఎస్ రాజమౌళిని డిప్త్యూటేషన్ పై తీసుకువచ్చారు. దమ్మాలపాటి శ్రీనివాస్ అనే కమ్మ కులానికి చెందిన అడ్వొకేట్ ని అడ్వొకేట్ జనరల్ చేశారు . మళ్ళీ పదేళ్ల తర్వాత 2024 జూన్ లో అధికారంలోకి వచ్చినపుడు ఇదే చేసారు . (రాజమౌళి , దమ్మాలపాటి లకు మళ్ళీ అవే పదవులు ఇచ్చారు )
  • ప్రస్తుతం కేంద్ర మంత్రులుగా రాష్ట్రం నుంచి (టీడీపీ కోటాలో ) రామ్మోహన్ నాయుడు , పెమ్మసాని చంద్రశేఖర్ ఉన్నారు . రామ్మోహన్ నాయుడు తన పని తాను చేసుకుంటుండగా , పెమ్మసాని ఓవర్ యాక్షన్ చేస్తున్నట్లు పార్టీ కేడర్ నుంచే ఫిర్యాదులు వస్తున్నాయ్ . చంద్రబాబుకి కమ్మ ఫీలింగ్ పెద్దగా లేకపోయినా . . ఇలాంటి నాయకులు చేస్తున్న హంగామాకి కమ్మ కులంపై ముద్రపడింది .
  • నర్సరావుపేట ఎంపీగా ఉన్న లావు శ్రీకృష్ణదేవరాయలుకు టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా పదవి కట్టబెట్టారు . ఇతను వైసీపీ నుంచి వచ్చిన నేత . అవకాశవాద రాజకీయాలకు పెట్టింది పేరు . అలాంటి నేతకు కీలక పదవి ఇవ్వడంపై చంద్రబాబుపై పార్టీలో కమ్మ ముద్ర ఖచ్చితంగా పడుతుంది .
  • అనంతపురం అసెంబ్లీకి దగ్గుబాటి ప్రసాద్ అనే రియల్టర్ ని తెచ్చి పెట్టారు . అతను చేసే అరాచకాలకు పార్టీకి చెడ్డపేరు వస్తుంది . ఈ పేరు కమ్మ కులానికి ఆపాదించేందుకు వైసీపీ ఎలాగూ ప్రయత్నం చేయడం సహజం. అంతకుముందున్న ప్రభాకర్ చౌదరికి కమ్మ మార్క్ కంటే అందరివాడు అనే పేరుంది . అలాంటి వారిని పక్కనపెట్టి బెంగుళూరు రియల్టర్ ని తెచ్చి పార్టీకి చెడ్డ పేరు, కులం ముద్ర రావడానికి పరోక్ష0గా చంద్రబాబు కారణమవుతున్నారని అక్కడ ప్రచారం సాగుతోంది .

సీఎం చంద్రబాబు పర్సనల్ సెక్రటరి కృష్ణ కపర్తి, పీఏ రాజగోపాల్ , కార్యదర్శి అడుసుమిల్లి రాజమౌళి కమ్మవారు. టీడీపీ పార్టీ ప్రధాన కార్యాలయం మంగళగిరిలో కార్యకలాపాలు పర్యవేక్షించే టీడీ జనార్దన్, లాబీయింగ్ చేస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కిలారి రాజేష్ కమ్మవారు కావడం గమనార్హం . అయితే .. ఇందులో కొందరు ఆర్బాటం చేయడం , చంద్రబాబుకి తాము అత్యంత దగ్గరి మనుషులం అని బిల్డప్ ఇవ్వడం వంటి కారణాలు … చంద్రబాబుకి ”కమ్మ ముద్ర ‘ను అంటిస్తున్నాయ్ .

రాజశేఖర్ రెడ్డి , జగన్ ల కంటేనా ? ”తమ పాలనా కాలంలో సొంత కులానికి భారీగా మేళ్లు చేయలేదు . దోపిడీకి సహకరించలేదు . రాజశేఖర్ రెడ్డి , వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్య మంత్రులుగా ఉన్నపుడు సొంత కులం వారికి భారీగా దోచిపెట్టారు . అయినా వారి కంటే చంద్రబాబుకే ఎక్కువ కుల ముద్ర వస్తుందంటే అది కమ్మవారికున్న శాపమే తప్ప మరేమీ కాదు . .” అని ఓ టీడీపీ సీనియర్ నేత అభిప్రాయపడ్డారు .

యనమల లాంటి వాళ్ళు ‘కమ్మ ‘ వాళ్లను దోపిడీదారులుగా చిత్రీకరించినా చంద్రబాబు నాయుడు పట్టించుకోరు. కనీసం వివరణ కూడా అడగడానికి సాహసించరు . దివీస్ కంపెనీ మురళిపై యనమల రామకృష్ణుడు చేసిన ఆరోపణలు కులం పేరుతొ చేసారు. దీనిపై పార్టీ కూడా యనమల వివరణ తీసుకోలేదంటే . .. కమ్మ కులం దోపిడీపై యనమల చేసిన ఆరోపణలు నిజమన్న అభిప్రాయం సమాజంలో చాలామందికి వస్తుంది. ఇలాంటి వాటిని కట్టడి చేయడంలో చంద్రబాబు అసమర్దుడన్న పేరు ఉంది.

ఈ దఫా అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గతంలో వైసీపీ హయాంలో విద్యుత్ కాంట్రాక్టులలో దోపిడీకి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న షిర్డీ సాయి , పోలవరంలో దోపిడీ ఆరోపణలు ఎదుర్కొంటున్న మేఘ ఇంజనీరింగ్ కృష్ణారెడ్డి , రాయలసీమలో కారుచౌకగా భూములు కొట్టేసిన ఆరోపణలు ఎదుర్కొంటున్న గ్రీన్ కో … ఈ కంపెనీలు ఏవీ కమ్మ వారివి కావు . అయినా వీరిని ప్రోత్సహిస్తున్నారు . దీనిపై జనంలో పెద్దగా చర్చ ఉండదు . చర్చకు వస్తే . .. మాత్రం వారి నుంచి మామూలు అందుకుంటున్నారన్న ఆరోపణలు తెరమీదకు తెస్తారు.

పరిపాలనలో సమర్థులైన వారిని ఈనాడులో మేనేజర్లుగా పెట్టుకునేవారు రామోజీరావు . వాళ్లలో మెజార్టీ కమ్మ వారు ఉండేవారు. అంతమాత్రాన ఈనాడులో కమ్మ వారిదే హవా . . అంటే కరెక్ట్ కాదు కదా .. అలాగే చంద్రబాబు నాయుడు చేస్తున్నా . .. సోషల్ మీడియాను కట్టడి చేయలేక . .. వైసీపీ అరాచకవాదులు , అబద్దాలతో బూకరించేవారికి సమర్థవంతంగా కౌంటర్ ఇవ్వలేక కమ్మ ముద్ర వేసుకుంటున్నారు .

అరాచకవాదులపై చర్యలేవీ? చంద్రబాబు ఎందుకు తటపటాయిస్తున్నారు ?

అరాచకవాదులపై చర్యలేవీ? చంద్రబాబు ఎందుకు తటపటాయిస్తున్నారు ?

వైఎస్ భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఐటీడీపీ కార్యకర్త కిరణ్ పై గంటల వ్యవధిలోనే చర్యలు

భువనేశ్వరి, చంద్రభాబు , పవన్ కళ్యాణ్ , లోకేష్ , హోంమంత్రి అనిత, తదితరులపై అసభ్య వ్యాఖ్యలు చేసిన వారిని వదిలేశారా ?

మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ కుమార్ ని పార్టీ నుంచి సస్పండ్ చేసి , , వెంటనే అరెస్ట్ చేశారు. మహిళలపై జుగుప్సాకర వ్యాఖ్యలు చేస్తే సహించబోమని చెప్పిన మాటపై చంద్రబాబు నిలబడ్డారని ప్రజలలో మంచి పేరు సంపాదించారు. ఈ ఎపిసోడ్ లో పార్టీకి కూడా మైలేజ్ వచ్చింది. ఇంతవరకు ఒకే . కిరణ్ ని అరెస్ట్ చేయడం , సస్పండ్ చేయడం లో ఎవరికీ అభ్య0తరాలు లేవు . ‘తప్పు చేస్తే తమవాడైన వదిలేది లేదు . ‘ అనే సంకేతం పార్టీకి , ప్రభుత్వానికి మంచిదే . కానీ , అరాచకాలు చేసిన అవతలివాళ్ళను మాత్రం వదిలేస్తాం . . మనవాళ్లయితే లోపలేస్తాం . . అన్నట్లు కనిపిస్తోంది చంద్రబాబు ధోరణి.. అంటూ టీడీపీ సీనియర్ నేతల నుంచే విమర్శలు వస్తున్నాయ్ .

అంతకుముందు . .. అసెంబ్లీ సాక్షిగా వైసీపీ కీలక నేత ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వంటి నేతలు చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై అసభ్య వ్యాఖ్యలు చేసారు. అంతటితో ఆగకుండా వైసీపీ సోషల్ మీడియాలో ట్రోల్ చేయించారు. తప్పు తెలుసుకుని తర్వాత క్షమాపణ కూడా చెప్పలేదు . భారతిపై వ్యాఖ్యలు చేసిన కిరణ్ తప్పు తెలుసుకుని ”అలా మాట్లాడటం తప్పే ‘ ‘ అని లెంపలేసుకున్నాడు . అయినా అరెస్ట్ చేశారు . తప్పు అని చెప్పినా వదలమని కాదు . గతంలో భువనేశ్వరి , వంగలపూడి అనిత , చంద్రబాబు నాయుడు , లోకేష్ , పవన్ కళ్యాణ్ వంటి నేతలపై అసభ్య పదజాలాలతో విరుచుకుపడ్డారు . ఒకరోజు , రెండు రోజులు కాదు . . నెలల తరబడి జుగుప్సాకర వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు . అయినా వారిపై ఎలాంటి చర్యలు లేవు . చంద్రబాబు నాయుడు సీఎం అయ్యారు . అరాచకవాదుల ఆట కట్టిస్తాడనుకున్నారు . కానీ ఒకరిద్దరిని లోపలేశారు . చేతులు దులుపుకున్నారు . . అన్నట్లు చేస్తున్నారు . వైసీపీ అరాచకవాదులు ఇంకా పదుల సంఖ్యలో బహిరంగంగా వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు . అయినా వారిపై చర్యలకు కూటమి సర్కార్ , ముక్యంగా సీఎం చంద్రబాబు చొరవ తీసుకోకపోవడానికి కారణాలపై టీడీపీ , జనసేన కేడర్ లలో అనుమానాలు రేకెత్తుతున్నాయి . వీటికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత చంద్రబాబు , లోకేష్, పవన్ కళ్యాణ్ లపై నే ఉంది .