Araku: అందాల లోయ అరకులోయకు పర్యాటకుల తాకిడి

ఏపీలో అందాల లోయ, ఆంధ్ర ఊటీకి పర్యాటకుల తాకిడి పెరిగింది. దసరా సెలవులు, పండుగ హడావుడితో అందుకు కలిసి వచ్చింది. మన్యంలో ప్రకృతి అందాలను తిలకించేందుకు ఆదివారం పర్యాటకులు పోటెత్తారు.  పర్యాటకులు ప్రకృతి ఒడిలో సందడి చేస్తున్నారు.  ప్రకృతి ప్రేమికుల సందడితో హోటల్ గదులన్నీ హౌస్ ఫుల్ అయ్యాయి. కూల్ క్లైమేట్ లో ఎంజాయ్ చేస్తున్నారు సందర్శకులు. చాపరాయి, బొర్రా గుహలు, గిరిజన మ్యూజియం పద్మాపురం గార్డెన్స్, వ్యూ పాయింట్స్, వాటర్ ఫాల్స్ వద్ద సందర్శకులు సందడి చేస్తున్నారు.

దక్షిణ మధ్య రైల్వే కూడా అరకుకు ప్రత్యేక రైలు నడపడంతో పర్యాటకులు మరింత పెరిగారు.  ఉదయం వేళలో మంచు కురుస్తూ పర్యాటకులను మరింత ఆకర్షిస్తున్నాయి అరకు అందాలు. శని, ఆదివారాలలో అద్దె గదులు దొరకక టూరిస్టులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఒక్కసారిగా పర్యాటకులు పెరగడంతో అరకులోయలో సందడి వాతావరణం నెలకొంది.