మోదీ నోట.. ఏదీ  అమరావతి చట్టబద్దత?

మోదీ నోట.. ఏదీ అమరావతి చట్టబద్దత?

ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హామీలు ప్రకటించని ప్రధాని

చంద్రబాబును పొగడం – ప్రసంగం తెలుగులో ప్రారంభించడం.. ఇవే మోడీ చేసినవి

ఆంధ్రుల రాజధాని అమరావతికి ఎన్నో వరాలు ప్రకటిస్తారు.. అని మోడీపై పెట్టుకున్న ఆశలు అడియాసలయ్యాయి. హామీల మాటల ఉన్నా.. ‘అమరావతికి చట్టబద్దత ‘ అంశంపై కూడా మోడీ పెదవి విప్పలేదు . కేంద్రమంత్రి శ్రీనివాస్ వర్మ . … మోడీ సభకు ఒకరోజు ముందు అమరావతి చట్టబద్దత అంశం పరిశీలిస్తాం . . అంటూ స్టేట్ మెంట్ ఇచ్చారు . అమరావతి రైతులు చంద్రబాబుకు చేసిన విజ్ఞప్తి కూడా చట్టబద్దత . దీనిపై ప్రధానితో మాట్లాడతానని చంద్రబాబు చెప్పారు . అయితే మోడీ మాత్రం దీనిపై ప్రస్తావించకుండా దాటవేశారు .

పోలవరం ప్రాజెక్టును పూర్తిచేస్తామని , అమరావతికి సహకారం అందిస్తామని మాత్రమే చెప్పారు మోడీ . ..

జగన్ భయం ఎలా పోగొడతారు బాబు గారూ.. టీడీపీ అధికారంలోకి వచ్చినపుడు కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి అమరావతిని రాజధానిగా చంద్రబాబు ప్రకటించారు . 2019 లో అధికారంలోకి వచ్చిన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి . .. అమరావతి రాజధాని కాదని , , మూడు రాజధానుల నినాదాన్ని తెరపైకి తెచ్చి గందరగోళంలో పడేసారు . అమరావతి కోసం భూములిచ్చిన 29 వేలమంది రైతులు రోడ్డెక్కారు . దేశంలోనే అత్యంత అరుదైన ఉద్యమం చేసారు .

మరోమారు జగన్ అధికారంలోకి రారన్న భరోసా ఇస్తారా ? అంటూ పలువురు పారిశ్రామికవేత్తలు సైతం చంద్రబాబు నాయుడు , పవన్ కళ్యాణ్ , లోకేష్ లను అడుగుతున్నారు . జగన్ వస్తే . .. భారీ పెట్టుబడులు పెట్టిన మాకు భరోసా ఏమిటి ? అంటూ ఇప్పటికే కీలకమైన పారిశ్రామికవేత్తలు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు దొరక్క వారు వేరే రాష్ట్రాల వైపు ద్రుష్టి సారిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయ్ .

ఒక స్వప్నం సాకారమవుతుందనే విషయం కళ్లముందు కనిపిస్తుంది: ప్రధాని మోదీ

  • తెలుగులో ప్రసంగం ప్రారంభించిన ప్రధాని మోదీ
  • దుర్గాభవానీ కొలువైన పుణ్యభూమిలో మిమ్మల్ని కలవడం ఆనందంగా ఉందన్న ప్రధాని
  • ఇప్పుడు నేను పుణ్యభూమి అమరావతిపై నిలబడి ఉన్నా: ప్రధాని
  • ఒక స్వప్నం సాకారమవుతుందనే విషయం కళ్లముందు కనిపిస్తుంది: ప్రధాని మోదీ
  • దాదాపు 60 వేల కోట్ల విలువైన పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశా: ప్రధాని
  • ఇవి కేవలం కాంక్రీట్‌ నిర్మాణాలు కాదు.. ఏపీ ప్రగతికి, వికసిత్‌ భారత్‌కు బలమైన పునాదులు: ప్రధాని
  • చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌కు శుభాకాంక్షలు: ప్రధాని మోదీ

రూ.58 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శ్రీకారం

  • అమరావతి పునర్నిర్మాణ పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన
  • రాజధాని పనులు సహా రూ.58 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు శ్రీకారం
  • రూ.49,040 కోట్ల విలువైన రాజధాని పనులకు ప్రధాని మోదీ శ్రీకారం
  • రూ.8 వేల కోట్ల విలువైన వివిధ కేంద్ర ప్రాజెక్టులకూ ప్రధాని శంకుస్థాపన
  • ప్రధాని సభకు రాష్ట్ర నలుమూలల నుంచి హాజరైన లక్షలమంది ప్రజలు
  • సరైన సమయంలో సరైన నేత … : సీఎం చంద్రబాబు
  • ఇవాళ ఏపీ చరిత్రలో శాశ్వతంగా లిఖించదగ్గ రోజు: సీఎం చంద్రబాబు
  • గతంలో మోదీయే అమరావతి పనులకు శంకుస్థాపన చేశారు: సీఎం చంద్రబాబు
  • గత ఐదేళ్లు రాజధాని నిర్మాణ పనులు నిలిచిపోయాయి: సీఎం
  • పహల్గాంలో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారన్న బాధలో ఉన్నారు: సీఎం
  • మళ్లీ మోదీ చేతులమీదుగానే పనుల పునఃప్రారంభం: సీఎం
  • గతంలో మోదీని ఎప్పుడు కలిసినా చాలా ఆహ్లాదకరంగా ఉండేవారు: సీఎం
  • ఇటీవల మోదీని కలిసినప్పుడు ఆయన చాలా గంభీరంగా ఉన్నారు: సీఎం
  • ఉగ్రవాదాన్ని అణచివేయడంలో కేంద్రం తీసుకునే ప్రతి చర్యకు అండగా ఉంటాం: సీఎం చంద్రబాబు
  • మోదీకి అండగా ఉంటామని ప్రతిజ్ఞ చేస్తున్నాం: సీఎం చంద్రబాబు
  • మోదీజీ మేమంతా మీకు అండగా ఉన్నాం: సీఎం
  • ప్రజలతోనూ వందేమాతరం, భారత్‌మాతాకి జై నినాదాలు చేయించిన సీఎం
  • సరైన సమయంలో సరైన నేత దేశాన్ని పాలిస్తున్నారు: సీఎం
  • ప్రపంచవ్యాప్తంగా మోదీ నాయకత్వాన్ని ఆమోదిస్తున్నారు: సీఎం
  • మోదీ అధికారంలోకి వచ్చినప్పుడు పదో స్థానంలో భారత ఆర్థిక వ్యవస్థ: సీఎం
  • ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థలో భారత్‌ ఐదో స్థానానికి ఎదిగింది: సీఎం
  • త్వరలోనే భారత ఆర్థిక వ్యవస్థ మూడో స్థానానికి చేరుతుంది: సీఎం
  • 2047 నాటికి ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ ఎదుగుతుంది: సీఎం
  • ఒకవైపు అభివృద్ధి.. మరోవైపు పేదరిక నిర్మూలనకు మోదీ కృషిచేస్తున్నారు: సీఎం
  • దేశాభివృద్ధే లక్ష్యంగా మోదీ పనిచేస్తున్నారు: సీఎం చంద్రబాబు
  • మోదీ నాయకత్వంలో భారత్‌.. అభివృద్ధి చెందిన దేశంగా మారుతుంది: సీఎం
  • కూటమిగా పోటీచేయడంతో 93 శాతం స్ట్రైక్‌రేట్‌తో విజయం సాధించాం: సీఎం
  • వెంటిలేటర్‌పై ఉన్న ఆర్థిక వ్యవస్థను మోదీ సాయంతో గట్టెక్కిస్తున్నాం: సీఎం
  • కేంద్ర సాయంతో మరికొన్ని రోజుల్లో రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేస్తాం: సీఎం
  • దివిసీమ తుపానులా గత ప్రభుత్వం అమరావతిని తుడిచేసింది: పవన్‌ కల్యాణ్
  • ధర్మయుద్ధంలో అమరావతి రైతులు విజయం సాధించారు: పవన్‌ కల్యాణ్
  • రాజధాని రైతుల పోరాటానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా: పవన్‌ కల్యాణ్
  • అమరావతి రైతుల త్యాగాలను మరచిపోము: పవన్‌ కల్యాణ్
  • అమరావతి రైతుల త్యాగాలకు జవాబుదారీగా ఉంటాం: పవన్‌ కల్యాణ్
  • రాజధాని నిర్మించి అమరావతి రైతుల రుణం తీర్చుకుంటాం: పవన్‌ కల్యాణ్

నమో కొట్టే దెబ్బకు పాకిస్థాన్‌కు దిమ్మతిరగడం ఖాయం: లోకేశ్

  • ఒక్క పాకిస్థాన్‌ కాదు వంద పాకిస్థాన్‌లు వచ్చినా భారత్‌ను ఏమీచేయలేరు: మంత్రి లోకేశ్
  • భారత గడ్డపై గడ్డి మొక్క కూడా పీకలేరు: మంత్రి లోకేశ్
  • భారత్‌ వద్ద మోదీ అనే మిసైల్‌ ఉంది: మంత్రి లోకేశ్
  • నమో కొట్టే దెబ్బకు పాకిస్థాన్‌కు దిమ్మతిరగడం ఖాయం: లోకేశ్
  • మోదీకి ఏపీ అంటే ప్రత్యేక అభిమానం: లోకేశ్
  • ఏపీ ప్రాజెక్టులకు ఆమోదం చెబుతూ మద్దతిస్తున్నారు : లోకేశ్
  • మోదీ, బాబు ఇద్దరూ కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారు: లోకేశ్
  • 2014లో మనల్ని మెడపట్టి గెంటేశారు: లోకేశ్
  • రాజధాని కూడా లేకుండానే విడిపోయాం: లోకేశ్
  • చంద్రబాబు ఆత్మస్థైర్యం కోల్పోకుండా రాష్ట్రాన్ని నిలబెట్టారు: లోకేశ్
  • చంద్రబాబుపై కోపంతో అమరావతిని పక్కనబెట్టారు: లోకేశ
మోదీ అమరావతికి ఏమిస్తారు ?

మోదీ అమరావతికి ఏమిస్తారు ?

రాజధాని మారకుండా పార్లమెంటులో చట్టబద్దత హామీ అయినా ఇస్తారా?

ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పనుల పునఃప్రారంబించి . .. ఏయే వరాలు ప్రకటిస్తారు? 2015లో అమరావతి శంఖుస్థాపన చేసినపుడు నీళ్లు – మట్టి ఇచ్చి తర్వాత చేతులు దులుపుకున్న అప్పటి NDA సర్కార్ . .. 2025 లో ఏమి చేయబోతోంది. ఇప్పటి వరకు వరల్డ్ బాంక్ నుంచి, ఇతర సంస్థల నుంచి వేల కోట్ల రూపాయలు అప్పులు ఇప్పించారు . ఇంతవరకు బాగానే ఉంది . కేంద్రం నుంచి రాష్ట్రానికి ఇవ్వబోయే పథకాలపై మోదీ క్లారిటీ ఇవ్వాలని ఆంధ్రప్రజలు కోరుతున్నారు. విభజిత ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి మొండిచేయి చూపారు . దానిపై గట్టిగా అడిగే సత్తా ఉన్న నాయకులు ఆంధ్రప్రదేశ్ లో ఏ పార్టీ అధికారంలో ఉన్నా కనిపించరు. 2019-2024 మధ్య అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి సీబీఐ , ఈడీ కేసుల భయంతో స్పెషల్ స్టేటస్ గురించి కేంద్రాన్ని అడదకుండా దొంగాట ఆడేసారు .

ఇపుడు అధికారంలో ఉన్న చంద్రబాబు 2014-2019 మధ్య సీయంగా ఉన్నారు . చంద్రబాబుకు కేసుల భయం లేకపోయినా … మెతక వైఖరి అవలంబించి ప్రత్యేక హోదా సాధించలేకపోయారు . ఇపుడు అడిగే పరిస్థితి ఉన్నా , , అమరావతి , పోలవరం పనులకు భారీగా నిధులు రాబట్టుకోవాలన్న కుతూహలంతో స్పెషల్ స్టేటస్ గురించి ఎలాగూ మోదీ ని అడగే పరిస్థితి ఉండదు .

కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పై ఆధారపడి ఉందన్న విషయం తెలిసిందే . రాజకేయగ మన అవసరం ఉన్నా . .. ఆంధ్రప్రదేశ్ కి ఇవ్వాల్సినంత ప్రాధాన్యత ఇవ్వడంలేదనే చెప్పాలి.

అమరావతికి చట్టబద్దత హామీ ఇస్తారా ? రాజధాని ఏర్పాటు సమయంలో ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సపోర్టుగా మాట్లాడారు. 33 వేల ఎకరాలు కూడా సరిపోదన్నారు . 2019లో అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతిని సర్వనాశనం చేయడానికి శతవిధాలా ప్రయత్నించారు . అమరావతిపైనా , ఆ ప్రాంతంలో ఒక సామాజిక వర్గంపైనా కక్షపూరిత ధోరణితో వ్యవహరించారు . రాజధానికి భూములు ఇచ్చిన రైతులపై రాక్షసత్వం చూపారు . దేవుడు కరుణించి వారి ఉద్యమం సక్సెస్ అయింది . వారి మనోభీష్టం మేరకు జగన్ ని ఆంధ్రప్రజలు అధఃపాతాళానికి తొక్కేశారు . ఇంతవరకు బాగానే ఉంది . చంద్రబాబు నాయుడు , కూటమి నేతలు తామే ఆంధ్రప్రదేశ్ లో శాశ్వతంగా అధికారంలో ఉంటామన్న భ్రమలలో తేలియాడుతున్నారు . అయితే ప్రజలు మాత్రం కొన్ని అనుమానాలలోనే ఉంటారు . ఆంధ్రప్రదేశ్ గ్రహపాటు బాగోక మరోమారు జగన్ అధికారంలోకి వస్తే . . పరిస్థితి ఏమిటి ? అన్న భయంలో మాత్రం కొందరు ఉన్నారు . వీరికి కూటమి ఎటువంటి భరోసా ఇస్తుంది . అమరావతి పనుల పునఃప్రారంభానికి వస్తున్న ప్రధాని మోదీతో ‘అమరావతి చట్టబద్దత ‘ హామీ ఇప్పించాలని డిమాండ్ చేస్తున్నారు . చంద్రబాబు ఈ పని చేయగలిగితే సక్సెస్ అయినట్లే . అమరావతి చట్టబద్దత అంశంపై మోదీ ఎటువంటి హామీ ఇవ్వకపోతే మాత్రం అమరావతి భవితవ్యంపై నీలినీడలు అలుముకునే ప్రమాదం పొంచి ఉంటుంది .

ప్రధాని మోదీ టూర్ షెడ్యూల్

ప్రధాని నరేంద్ర మోదీ మే 2న ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో పర్యటిస్తారు. అమరావతి నిర్మాణ పనులను పునః ప్రారంభిస్తుండటంతో ఈ పర్యటన కీలకంగా మారింది. ఈ సందర్భంగా మోదీ.. లక్ష కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. ….. షెడ్యూల్ ప్రకారం ప్రధాని మోదీ శుక్రవారం మధ్యాహ్నం 2.55కి కేరళలోని తిరువనంతపురం నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకి వస్తారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి మధ్యాహ్నం 3.15కి అమరావతి హెలిప్యాడ్‌కి చేరతారు. తర్వాత 3.25కి సభా వేదిక దగ్గరకు వెళ్తారు. మధ్యాహ్నం 3.30 నుంచి 4.45 వరకు అమరావతి పనుల పునఃప్రారంభ కార్యక్రమంలో పాల్గొంటారు. అప్పుడే అమరావతి పెవిలియన్‌ను పరిశీలిస్తారు .

ఒకప్పుడు పాకిస్తాన్ లో ఎంపీ – భారత్ లో ఐస్ క్రీమ్ అమ్ముకుంటూ

ఒకప్పుడు పాకిస్తాన్ లో ఎంపీ – భారత్ లో ఐస్ క్రీమ్ అమ్ముకుంటూ

భారత్ పౌరసత్వం కోసం దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న వైనం

ఒకప్పుడు అతను పాకిస్థాన్ పార్లమెంట్ మెంబర్ . అంటే ఎంపీ అన్న మాట . పరిస్థితులు ఎలా తారుమారవుతాయో ఇతని ఉదంతం ఒక ఉదాహరణ . ఆ ​ మాజీ ఎంపీ ప్రస్తుతం భారత్​లో ఐస్​క్రీములు అమ్ముకుంటున్నారు. పాక్ మాజీ ప్రధాని బెనజీర్​ భుట్టో ప్రభుత్వ హయాంలో ఎంపీగా ఉన్న దివాయా రామ్​, హరియాణాలోని ఫతేబాద్​లో ఐస్​క్రీమ్​ వ్యాపారం చేసుకుంటున్నారు. 25ఏళ్ల క్రితం భారత్​కు వచ్చిన ఆయన ఇక్కడే స్థిరపడిపోయారు. తాజాగా భారత్​- పాకిస్థాన్​ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో వీసాలు రద్దు చేయగా ఈయన వ్యవహారం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. అసలు ఆయన భారత్​కు ఎందుకు వచ్చారు? జీవనం సాగించేందుకు ఐస్​క్రీములు వ్యాపారం ఎంచుకున్నారు .

పాకిస్థాన్​కు చెందిన దివాయా రామ్​ 1989లో మైనార్టీల రిజర్వ్​ స్థానంలో ఎంపీగా ఎన్నికయ్యారు. అయితే, పార్లమెంట్​ సభ్యులుగా ఉన్నా ఆయన కుటుంబంపై దాడులు మాత్రం ఆగలేదు. ఒకసారి దివాయా రామ్​ కూతురిని కిడ్నాప్​ చేసినా, పోలీస్ వ్యవస్థ కూడా ఈయనకు సహకరించలేదు . దీంతో ఆవేదన వ్యక్తం చేసిన ఆయన, ఎంపీ పదవికి రాజీనామా చేసి కుటుంబంతో సహా భారత్​కు వచ్చేశారు. భార్య రాజో రాణి, 8మంది కుమారులు, ఇద్దరు కూతుళ్లు సహా 13 మంది వచ్చారు. ఆ తర్వాత ఒక కుమార్తె జన్మించగా, ప్రస్తుతం వీరి కుటుంబ సభ్యుల సంఖ్య 30కి చేరింది. తొలుత నెల రోజుల టూరిస్ట్​ వీసాతో వచ్చిన ఆయన, తర్వాత ప్రతి ఏడాది రెన్యూవల్ చేస్తున్నారు . అనంతరం ఐదేళ్లకు ఆయన వీసాను 2018 వరకు పొడిగించారు.

పాకిస్థాన్​లో వేధింపులు తాళలేక దివాయా రామ్​ బంధువు రామ్ ప్రకాశ్​ కుటుంబం కూడా 2006లో భారత్​కు వచ్చి స్థిరపడింది. ఫతేబాద్​లోని సర్దావాలాకు వచ్చి స్థిరపడి, ఇక్కడే వివాహం చేసుకున్నాడు. అనంతరం అతడి కుటుంబంలోని ఆరుగురికి భారత పౌరసత్వం దక్కగా, ఇంకా కొందరివి ప్రాసెస్​లో ఉన్నాయి. కాగా, జమ్ము కశ్మీర్​ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్​ వీసాలను రద్దు చేసింది భారత ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే భారత్‌ విధించిన ఆంక్షల కారణంగా ఇప్పటి వరకు 786 మంది పాకిస్థానీయులు అటారీ-వాఘా సరిహద్దు దాటి పాకిస్థాన్​కు తిరిగి వెళ్లిపోయారు. అదే సమయంలో అక్కడ నుంచి 1,367మంది పౌరులు భారత్​ తిరిగి వచ్చినట్లు అధికారులు తెలిపారు.

2018 వరకు వీసాతో ఉన్న దివాయా రామ్​ కుటుంబం శరణార్థిగా భారత్​లోనే ఉంటున్నారు. అనంతరం 2018లో వీసా గడువు పెంపునకు దరఖాస్తు చేసుకున్నారు. ఆ తర్వాత తన వీసా గడుపు పెంచడానికి స్థానిక నేతలతో పాటు అందరి చూట్టూ తిరిగారు. CAA చట్టం ద్వారా భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకుని ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం వీరి దరఖాస్తులు పరిశీలనలో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇలా పాకిస్తాన్ వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్న ఆ దేశ పౌరులైన . . దీర్ఘకాలంగా ఇక్కడే ఉంటున్న వారికి భారత్ పౌర సత్వం విషయంలో మానవత్వంతో ఆలోచించి . .. నిర్ణయం తీసుకోవాలి .

కంచి కామకోటి తదుపరి పీఠాధిపతిగా గణేష్ శర్మ

కంచి కామకోటి తదుపరి పీఠాధిపతిగా గణేష్ శర్మ

కంచి కామకోటి పీఠం . . ప్రపంచంలోనే పురాతన పీఠంగా పేరొందింది. శంకర భగవత్పాదుల వారు స్థాపించిన ఈ పీఠానికి పీఠాధిపతిగా అధిష్టించాలంటే పూర్వజన్మ సుకృతం ఉండాలి. అన్నవరం ప్రాంతానికి చెందిన ఓ యువ సన్యాసికి ఈ అరుదైన గౌరవం దక్కింది.

కంచి కామకోటి పీఠం 71వ పీఠాధిపతిగా అన్నవరం వేద పండితుడు దుడ్డు సత్య వెంకట సూర్య సుబ్రహ్మణ్య గణేశశర్మ ద్రవిడ్ (24) ఏప్రిల్ 30న అక్షయ తృతీయ రోజున అభిషేకం చేయబడ్డారు . ప్రస్తుత పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి శంకరాచార్య స్వామి ఆయనకు సన్యాస దీక్ష ఇచ్చి సంప్రదాయబద్దంగా కార్యక్రమాలు నిర్వహించారు .

యాదృచ్చికంగా . .. : 2009 మేలో గణేశశర్మ తిరుపతిలో బంధువుల ఇంటికి వెళ్లారు. కంచి కామకోటి పీఠాధిపతిని దర్శించుకున్నారు. ఆచార్యులు ఆశీర్వదించి రుగ్వేద పండితుడు, ద్వారకా తిరుమలలో సేవ చేస్తున్న రత్నాకరభట్‌ శర్మ వద్ద వేదవిద్యలో చేర్పించమని సలహా ఇచ్చారు. గణేశశర్మ అక్కడ చేరారు. 12 ఏళ్లు రుగ్వేద సంహిత, ఐతరేయ బ్రాహ్మణం, ఉపనిషత్తులు నేర్చుకున్నారు. ఆ తర్వాత మంత్ర ఉచ్ఛరణలో ప్రావీణ్యం పొందారు. అరసవల్లి సూర్యనారాయణ ఆలయంలో రత్నాకరభట్‌ కుమారుడు శ్రీనివాసశర్మ మార్గదర్శకత్వంలో వేద గ్రంథాల్లో ఉన్నత శిక్షణ పొందారు. తెలంగాణలోని బాసర జ్ఞాన సరస్వతి దేవస్థానం ఆధ్వర్యంలోని వేదపాఠశాలలోనూ సేవలు అందించారు. కొన్నేళ్లుగా కంచి పీఠంలో శాస్త్ర అధ్యయనం చేస్తున్నారు.

జగద్గురు ఆది శంకరాచార్యులు ప్రబోధించిన అద్వైత మతానికి కాలక్రమంలో ఏర్పడిన కేంద్రపీఠాల్లో తమిళనాడులోని కంచి కామకోటి పీఠం ఒకటి!

మొక్కుబడులు, కృతజ్ఞతలు చెల్లించుకునే జంతు బలులు, రక్తతర్పణాల నుండి మానవ సమాజాలను సాత్విక, ఆధ్యాత్మిక దృక్పధాల్లోకి నడిపిన తాత్వికుడు, మత సంస్కర్త ఆది శంకరాచార్యులు. అస్పృశ్యత కూడదన్న ఆచరణవాది. 2500 ఏళ్ళ క్రితం భారతీయ సామాజిక, మతపరమైన స్ధితిగతులకు ఊహించగలిగితే శంకరాచార్య మత విప్లవవేత్త అని బోధపడుతుంది.

గుంపులు, సమూహాల పూజావిధానాన్ని వైదికమతాన్ని, దేవాలయాల వైపు, దేవతారాధన వైపు తిప్పడం ద్వారా ఆయన సఫల మయ్యారు. దేశ స్థితిగతుల దృష్ట్యా మధ్యేమార్గంగా ఆయన పంచాయతన పూజ రూపంలో బహు దేవతా సంఖ్యను షణ్మతానికి పరిమితం చేశారు.

షణ్మతాలు అంటే ఆరు ప్రధాన హైందవ సంప్రదాయాలు, ఇవి వివిధ దేవతల ఆరాధనను కేంద్రీకరించి ఉంటాయి. ఇవి:

1. శైవం – శివుడిని ప్రధాన దేవతగా ఆరాధించే సంప్రదాయం.

2. వైష్ణవం – విష్ణువు లేదా అతని అవతారాలను (రామ, కృష్ణ) ఆరాధించే సంప్రదాయం.

3. శాక్తం – దేవి (శక్తి)ని ప్రధాన దేవతగా ఆరాధించే సంప్రదాయం.

4. గాణపత్యం – గణపతిని (వినాయకుడు) ప్రధాన దేవతగా ఆరాధించే సంప్రదాయం.

5. కౌమారం – కుమారస్వామి (కార్తికేయ)ని ఆరాధించే సంప్రదాయం.

6. సౌరం – సూర్య దేవుడిని ఆరాధించే సంప్రదాయం.

ఆది శంకరాచార్యులు ఈ ఆరు సంప్రదాయాలను సమన్వయం చేసి, హైందవ ధర్మంలో ఏకత్వాన్ని స్థాపించేందుకు కృషి చేశారు. ఈ షణ్మతాలు ఒక్కొక్కటి విభిన్న దేవతలను ఆరాధించినప్పటికీ, అన్నీ ఒకే బ్రహ్మతత్త్వాన్ని సూచిస్తాయని శంకరులు బోధించారు. ఇది అద్వైత వేదాంత సిద్ధాంతంతో సమన్వయం చేయబడింది.

ఈ విధంగా, షణ్మత స్థాపన హైందవ ధర్మంలో వైవిధ్యాన్ని గౌరవిస్తూనే ఏకత్వాన్ని ప్రోత్సహించింది.

అనేక సాంఘిక పరిణామాల నుంచి ప్రపంచమంతా వేర్వేరు ప్రదేశాల్లో సాంస్కృతిక పునర్జీవనం సంభవించిన కాలంలో ఆదిశంకరాచార్యులు (క్రీస్తుపూర్వం) అద్వైత తత్వాన్ని ప్రభోదించారు. ఆయన స్థాపించిన కాంచీపురం (కంచి) పీఠంనుంచి హిందూ దేశమంతటా అద్వైత తత్వం విస్తరించింది. ఆదిశంకరాచార్యులను “నడిచే శివుడు” అని హిందువులు విశ్వసిస్తారు.

కంచిపీఠం ఆధిపత్యం ఒక పరంపరగా సాగుతుంది. వేదాలను వైదిక శాస్త్రాలను అపపోసిన వారిని అనేక వడపోతల ద్వారా, పీఠాధిపతి నిర్ణయానుసారం ఉత్తరాధికారిగా ఎంపిక చేస్తారు. పీఠాధిపతి మహానిర్యాణానంతరం ఉత్తరాధికారి కంచి స్వామి (పీఠాధిపతి) అవుతారు. ఇది పరంపరగా సాగుతోంది.

ఇపుడు పీఠాధిపతిగా వున్న శంకర విజయేంద్ర సరస్వతి ఈ పరంపరలో 70 వ స్వామి.

68 వ స్వామి చంద్రశేఖరేంద్ర సరస్వతి (ఇదే పేరుతో అప్పటికి ఏడుగురు కంచిపీఠం అధిపతులుగా వున్నారు) సుదీర్ఘకాలం 1907 నుంచి 94 వరకూ కంచి పీఠాధీశులుగా వున్నారు.

వారిహయాంలో చాలా సంస్కరణలు జరిగాయి. హిందువుల్లో అద్వైతం బ్రాహ్మణులను దాటి బయటకు రావడంలేదన్న అభిప్రాయం బలపడుతున్న సమయంలో ఆయన కంచి పీఠంలోకి అన్ని కులాలవారూ వచ్చేలా చేసి అద్వైతాన్ని సమాజంలో విస్తరింపచేశారు. జ్ఞాన సాధనే మోక్షమార్గమని ప్రజల్లోకి తీసుకువెళ్ళడం ద్వారా మానవ సమాజాల్లో హేతుబద్ధతను పెంపొందించారు.

చంద్రశేఖరేంద్ర సరస్వతి అనంతరం కంచి పీఠం బాద్యతలు చేపట్టిన 69 వ స్వామి జయేంద్ర సరస్వతి 1994 నుంచి 2018 మధ్యలో వైద్య వసతుల ద్వారా, మెడికల్, ఇంజనీరింగ్ కాలేజీలు స్థాపించడం ద్వారా హిందూ మతాన్ని సమాజంలో లోతుగా విస్తరింపచేశారు. అయితే జయేంద్ర సరస్వతి పీఠంలో ఒక అధికారి హత్యకేసులో అరెస్టవ్వడం పెద్ద సంచలనమైంది. హేతువాదాన్ని భుజానవేసుకున్న ఎఐడిఎంకే అధినేత్రి ఎన్నికలకు ముందు ఓట్లకోసం పీఠంలో జరిగిన హత్యను అడ్డుపెట్టుకుని జయేంద్రసరస్వతిని కేసులో ఇరికించారని ప్రజలు నమ్మారు. స్వామి పై ఆరోపణలు రుజువు కాకపోవడం వల్ల జయేంద్ర సరస్వతి నిర్దోషిగా జైలునుంచి బయటపడ్డారు. అయినా శంకరుడి రూపమైన స్వామి హత్యకళంకాన్ని మోయక తప్పలేదు. వారితర్వాత 70 వస్వామిగా (అప్పటి ఉత్తరాధికారి) శంకర విజయేంద్ర సరస్వతి 2018 నుంచి పీఠాధీశులుగా వున్నారు.

గణేశ శర్మ ద్రవిడ్ ఒక ఆధ్యాత్మిక కుటుంబానికి చెందినవాడు. ఆయన తండ్రి దన్వంతరి అన్నవరంలోని శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయంలో ప్రధాన పూజారి. పూర్వీకులూ ప్రముఖ వేద పండితులే.

వారు 2006లో వేద విద్య ప్రారంభించి ఋగ్వేదంతో పాటు యజుర్వేదం, సామవేదం, దశోపనిషత్తులపై లోతైన అధ్యయనం చేశారు. శ్రీ కాంచి పీఠం శంకరాచార్యుల ఆశీస్సులతో విద్యాభ్యాసం కొనసాగించారు.

ఈ ఉత్తరాధికార అభిషేకం, జగద్గురు ఆది శంకరాచార్యుల 2,534వ జయంతి సందర్భంలో జరగడం విశిష్టతను సంతరిస్తోంది .