by Rama Chandra P | Jun 11, 2025 | ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
తెలుగు రైతాంగానికి ఉగాదే కాకుండా . .. ఏరువాక పౌర్ణమి కూడా చెప్పుకోదగ్గ పండగే. అయితే ఇటీవల దీని ప్రాధాన్యత క్రమంగా రైతాంగం తగ్గిస్తూ వస్తున్నారు . కొన్ని ప్రాంతాలలో మాత్రం ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు .
ఓషధులకి, సస్యానికి అధిపతి అయిన చంద్రుడు జ్యేష్ఠా నక్షత్రానికి చేరువలో ఉన్న తరుణంలో ఏరువాక పూర్ణిమ శుభ ఫలితాలను అందిస్తాడని చాలా మంది నమ్ముతారు. అందుకే జ్యేష్ఠ పూర్ణిమ నాడు మొదటిసారి పొలాన్ని దున్నుతారు. ఏరువాక పూర్ణిమను సీతాయజ్ఞం అని సంస్కృతంలో ఉద్వృషభ యజ్ఞం అని, కన్నడంలో కారణి పబ్బం అని జరుపుకుంటారు.
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, జ్యేష్ఠ నక్షత్రం వేళ నాగలి సారించి పనులు ప్రారంభించడానికి మంచి రోజుగా భావిస్తారు. అందుకే వర్ష బుుతువు ప్రారంభం కాగానే, రైతులు ఉదయమే ఎడ్లను శుభ్రం చేసి, వాటి కొమ్ములకు రంగులు పూసి గజ్జెలు, పూలతో అలంకరించి కట్టేకాడిని ధూప దీప నైవేద్యాలతో పూజిస్తారు. అనంతరం కాడెద్దులకు ప్రత్యేక పూజలు నిర్వహించి బొబ్బట్లు తినిపిస్తారు. పొలానికి వెళ్లి భూమాతకు ఆరాధిస్తారు. అలాగే ఏరువాక పున్నమి రోజున సాయంకాలం వేళ రంగు రంగుల బట్టలతో ఎడ్లను అలంకరించి, డప్పులు, మేళతాళాలతో ఊరేగిస్తారు. అనంతరం ఎడ్లు అంటు రోగాల బారిన పడకుండా వాటికి ఆయుర్వేద మందులను, నూనెలను తాగిస్తారు.
సాధారణంగా మనం మత సంబంధమైన పండుగలు, జాతీయ పండుగలు, పూజలు, నోములు, వ్రతాలు వంటివి ఎన్నో చేసుకుంటూ ఉంటాము. కానీ రైతులకు మాత్రమే ప్రత్యేకమైన ఓ పండుగ ఉంది. ‘ఏరువాక పున్నమి’ పేరిట జరుపుకునే ఈ పండుగ విశేషాలేమిటో ఈ కథనంలో తెలుసుకుందాం.
ఏరువాక పౌర్ణమి ఎప్పుడు వస్తుంది?
జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమిని ఏరువాక పౌర్ణమి అని అంటారు. ప్రతి ఏటా జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి రోజును మనం ఏరువాక పౌర్ణమిగా జరుపుకోవడం సంప్రదాయంగా వస్తోంది. ఈ ఏడాది జూన్ 11వ తేదీన జరుపుకోనున్న ఏరువాక పౌర్ణమి విశేషాలను తెలుసుకుందాం.
ఏరువాక పౌర్ణమి అంటే?
రోళ్ళు పగిలే రోహిణి కార్తె వెళ్లి, తొలకరి చినుకులను తెచ్చే మృగశిర కార్తె రాకను స్వాగతిస్తూ జరుపుకునేదే ఏరువాక పౌర్ణమి. వర్ష ఋతువు ప్రారంభంలో వచ్చే ఏరువాక పౌర్ణమి రోజు రైతులు ఎద్దులను, నాగలిని పూజించి దుక్కి దున్నడం ప్రారంభించేవారని ఈ పండుగ గురించి ఋగ్వేదంలో వివరించారు.
కర్షకుల పండుగ
ఏరువాక పౌర్ణమి సహజంగా కర్షకుల పండుగ. భూదేవిని నమ్ముకొని పంటలు పండించే రైతులు వర్ష ఋతువు ఆరంభంలో తొలకరి చినుకు కోసం ప్రార్థిస్తూ వర్షాలు సమృద్ధిగా కురవాలని, పంటలు బాగా పండి దేశం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ ఏరువాక పౌర్ణమి రోజును వేడుకగా జరుపుకుంటారు.
ఏరువాక పూజ
ఏరువాక పున్నమి రోజున మట్టిని నమ్మి కష్టించి పని చేసే రైతులు భూమి పట్ల, సమస్త ప్రకృతి పట్ల తన భక్తి ప్రపత్తులు చాటుకుంటూ తమకు వ్యవసాయంలో చేదోడుగా ఉండే ఎద్దులను శుభ్రంగా కడిగి వాటి కొమ్ములకు రంగులు పూసి, రకరకాల గజ్జెలు, గంటలు, పూసల దండలతో, పూల దండలతో సర్వాంగసుందరంగా అలంకరిస్తారు. అనంతరం పొంగలి ప్రసాదాలతో, మంగళ వాయిద్యాలతో పొలాలకు ఊరేగింపుగా వెళ్లి అంగరంగ వైభవంగా పొలం దున్నడం ప్రారంభిస్తారు.
by Rama Chandra P | Jun 10, 2025 | ఆంధ్రప్రదేశ్
క్వాంటం టెక్నాలజీకి భారతదేశంలోని ప్రధాన కేంద్రంగా అమరావతిని తీర్చిదిద్దాలన్న దార్శనికతతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సంకల్పంతో ఉన్నారు . .
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగ నిపుణులు, ఏఐ నిపుణులతో సంప్రదింపులు జరిపిన చంద్రబాబు . .. అమరావతిలోని క్వాంటం వ్యాలీ కోసం బలమైన పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేయడంపై దృష్టి సారించారు, ఈ పరివర్తన రంగంలో ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచ లీడర్ షిప్ కి కేరాఫ్ గా నిలబెట్టాలని కలలు కంటున్నారు . ..
ఈ చొరవ కోసం వ్యూహాత్మక రోడ్‌మ్యాప్‌ను రూపొందించడానికి జూన్ 30న అమరావతిలో క్వాంటం మిషన్‌పై కీలకమైన వర్క్‌షాప్ జరుగుతుందని చంద్రబాబు నాయుడు ప్రకటించారు.
జాతీయ క్వాంటం మిషన్‌కు అనుగుణంగా..
క్వాంటం వ్యాలీ అభివృద్ధి యొక్క ప్రతి వివరాలపై నిశితమైన శ్రద్ధ వహించాలని, ముఖ్యంగా ప్రాజెక్ట్ ఆశయాన్ని సూచించడానికి ఒక ఐకానిక్ ఆర్కిటెక్చరల్ నిర్మాణాన్ని సృష్టించాలని ఆయన అధికారులను ఆదేశించారు.
“హైదరాబాద్ హైటెక్ సిటీ 1990లలో పురోగతికి చిహ్నంగా మారినట్లే, క్వాంటం వ్యాలీ భవనం ఆవిష్కరణకు ప్రపంచ చిహ్నంగా నిలబడాలి” అని చంద్రబాబు నాయుడు అన్నారు, సౌందర్య మరియు క్రియాత్మక శ్రేష్ఠత అవసరాన్ని నొక్కి చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్వాంటం మిషన్ భారతదేశ జాతీయ క్వాంటం మిషన్ (NQM)కి అనుగుణంగా ఉండేలా రూపొందించబడింది, అదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌ను క్వాంటం పరిశోధన మరియు అప్లికేషన్‌లో మార్గదర్శకుడిగా స్థాపించింది. సమీక్ష సందర్భంగా, అధికారులు మిషన్ లక్ష్యాలను వివరించే సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సమర్పించారు:
ఈ మిషన్ నాలుగు కీలక రంగాలపై దృష్టి సారిస్తుంది: క్వాంటం కంప్యూటింగ్, క్వాంటం కమ్యూనికేషన్, క్వాంటం సెన్సింగ్ & మెట్రాలజీ, మరియు క్వాంటం మెటీరియల్స్ & పరికరాలు.
రాబోయే ఐదు సంవత్సరాలలో ₹4,000 కోట్ల అంచనా పెట్టుబడితో, ఈ చొరవ క్వాంటం ఆధారిత ప్రజా మౌలిక సదుపాయాలను సృష్టించడం లక్ష్యంగా పెట్టుకుంది, ఆంధ్రప్రదేశ్‌ను అటువంటి పురోగతికి పైలట్ రాష్ట్రంగా నిలబడింది .
ఈ మిషన్ రెండు దశల్లో విప్పుతుంది:
దశ I (2025–2027): ఈ దశ అమరావతిలో 50 ఎకరాల క్యాంపస్‌లో క్వాంటం వ్యాలీ స్థాపనతో సహా మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తుంది. క్వాంటం ఆవిష్కరణకు బలమైన పునాదిని నిర్మించడానికి విద్య, పరిశోధన మరియు పైలట్ కార్యక్రమాలపై కూడా ఇది దృష్టి పెడుతుంది. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటి) మద్రాస్ వంటి విద్యాసంస్థలు మరియు ఐబిఎం, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్) మరియు లార్సెన్ & టూబ్రో (ఎల్ అండ్ టి) వంటి పరిశ్రమ దిగ్గజాలతో భాగస్వామ్యాలు ఈ దశను నడిపిస్తాయి.
రెండవ దశ (2027–2030): రెండవ దశ ఆంధ్రప్రదేశ్‌ను క్వాంటం టెక్నాలజీలో ప్రపంచ నాయకత్వానికి నడిపించడం లక్ష్యంగా పెట్టుకుంది, వాణిజ్యీకరణ, ఎగుమతి సామర్థ్యాలు మరియు పరిశ్రమలలో పెద్ద ఎత్తున స్వీకరణపై దృష్టి పెడుతుంది.
క్వాంటం వ్యాలీ ప్రాజెక్ట్
ఈ మిషన్‌కు ముఖ్యమంత్రి నాయుడు నాయకత్వం వహిస్తారు, ఐటీ మంత్రి, ముఖ్య కార్యదర్శి, ఐటీ కార్యదర్శి, ఆర్థిక కార్యదర్శి, అంకితమైన మిషన్ డైరెక్టర్ మరియు నిపుణుల కమిటీ కీలక పర్యవేక్షణ ఉంటుంది. క్రమబద్ధీకరించబడిన అమలును నిర్ధారించడానికి రాబోయే వారాల్లో క్వాంటం మిషన్ కోసం ఒక డైరెక్టర్‌ను నియమించాలని ప్రభుత్వం యోచిస్తోంది. IBM ఈ మిషన్‌కు ఎంకరేజ్ చేస్తుంది.
మే 2024లో IBM, TCS మరియు L&Tతో కుదుర్చుకున్న వ్యూహాత్మక అవగాహన ఒప్పందాల (MoUలు) ద్వారా క్వాంటం వ్యాలీ ప్రాజెక్ట్ ఇప్పటికే గణనీయమైన ఊపును పొందింది. ఈ భాగస్వామ్యాలు 18 జనవరి 2026న ప్రారంభించనున్న క్వాంటం వ్యాలీ టెక్ పార్క్ అభివృద్ధికి కీలకమైనవి.
TCS క్వాంటం సాఫ్ట్‌వేర్ సేవలను అందిస్తుంది మరియు 17 రాష్ట్రాలలో 43 పరిశోధనా కేంద్రాలకు ప్రాప్యతను అందిస్తుంది, అయితే L&T క్వాంటం వ్యాలీ టెక్ పార్క్‌తో సహా ఐకానిక్ మౌలిక సదుపాయాలను నిర్మిస్తుంది.
ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (APCRDA) ఆమోదించిన ప్రాజెక్ట్ యొక్క వివరణాత్మక ప్రాజెక్ట్ నివేదిక (DPR)తో రాష్ట్ర ప్రభుత్వం అమరావతిలో 54 ఎకరాల భూమిని కేటాయించింది.
క్వాంటం వ్యాలీ భారతదేశంలో మొట్టమొదటి క్వాంటం కంప్యూటింగ్ పర్యావరణ వ్యవస్థను కలిగి ఉంటుందని భావిస్తున్నారు, ఇది విద్యావేత్తలు, స్టార్టప్‌లు మరియు పరిశ్రమ నాయకుల మధ్య సహకారాన్ని పెంపొందిస్తుంది. హైదరాబాద్‌లోని HITEC సిటీ నుండి ప్రేరణ పొందిన ఈ ప్రాజెక్ట్, క్వాంటం టెక్నాలజీలు, AI, సైబర్ సెక్యూరిటీ మరియు డ్రగ్ డిస్కవరీపై దృష్టి సారించడం ద్వారా దాని విజయాన్ని ప్రతిబింబించడం మరియు అధిగమించడం లక్ష్యంగా పెట్టుకుంది.
జూన్ 30, 2025న జరగనున్న క్వాంటం సమ్మిట్ IT, ఫార్మాస్యూటికల్స్, వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణ, విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, స్టార్టప్‌లు మరియు ఆవిష్కర్తలు వంటి విభిన్న రంగాల నుండి ప్రతినిధులను ఒకచోట చేర్చుతుంది.
క్వాంటం కంప్యూటింగ్, AI మరియు అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలను ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మరియు సామాజిక ఫాబ్రిక్‌లో అనుసంధానించడానికి వ్యూహాత్మక కార్యాచరణ ప్రణాళికలను రూపొందించడం ఈ సమ్మిట్ లక్ష్యం. ఈ మిషన్ అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా మరియు ప్రపంచ ప్రతిభ మరియు పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రపంచ నిపుణులు పాల్గొంటారు.
by Rama Chandra P | Jun 10, 2025 | పరిశీలన
రామజన్మభూమి ఆలయానికి సమీపంలో 10 కిలోమీటర్ల మేర భూముల ధరలు 150 శాతానికి పైగా పెరిగాయి.
అధ్ధ్యాత్మికతకు ప్రాధాన్యత ఉన్న ప్రాంతాలలో భూముల ధరల పెరుగుదల సహజ ప్రక్రియ. అయితే ఇటీవల కాలంలో జనంలో పాపభీతి పెరిగి . .. పుణ్యక్షేత్రాలలో నివాసం ఉండాలని భావించేవారు సంఖ్య పెరుగుతోంది . ఈ ప్రభావం కూడా అయోధ్య వంటి చోట్ల భూముల ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి .
అయోధ్యలో భవ్యరామాలయ నిర్మాణంతో భూముల లావాదేవీలు, మార్కెట్ విలువ అమాతం పెరిగింది. ఇందుకు అనుగుణంగా ఇప్పుడు అక్కడి భూముల సర్కిల్ రేట్లకు తాజాగా రెక్కలు వచ్చాయి. భూముల సర్కిల్ రేట్లను 30 నుంచి 200 శాతం వరకూ పెంచారు. గత ఎనిమిదేళ్లలో భూముల రేట్లను పెంచడం ఇదే మొదటిసారి. కొత్త రేట్లు సోమవారం నుంచే అమల్లోకి వచ్చినట్టు అధికారులు తెలిపారు.
రామజన్మభూమి ఆలయానికి చుట్టుపక్కల 10 కిలోమీటర్ల వరకూ కొత్త రేట్ల ప్రభావం ఎక్కువగా ఉండబోతోంది. ఇక్కడ భూముల ధరలు 150 శాతానికి పైగా పెరిగాయి. 2004 సెప్టెంబర్‌లో భూముల ధరల పెంపు కోరుతూ ఒక ప్రతిపాదన తమకు రావడంతో సవరించిన రేట్లను అమల్లోకి తెచ్చినట్టు సదర్ (ఫైజాబాద్) సబ్ రిజిస్ట్రార్ శాంతి భూషణ్ చౌబే తెలిపారు. కొత్త సర్కిల్ రేట్లకు జిల్లా మెజిస్ట్రేట్ ఆమోదం తెలుపడంతో ఇప్పుడు అమల్లోకి తెచ్చామని చెప్పారు. కొత్త రేట్ల ప్రకారం జిల్లాలోని రాకాబ్‌గంజ్, దేవ్‌కాళి ప్రాంతాల్లో భూముల రేట్లు భారీగా పెరుగుతాయన్నారు. అయోధ్య ఆధ్యాత్మక పర్యటనా కేంద్రంగా అందరినీ ఆకర్షిస్తుండటం, మౌలిక వసతు కల్పన కారణంగా రామాలయం చుట్టూ ఉన్న సర్కిల్ రేట్లు చదరపు మీటరుకు రూ.26,660 నుంచి రూ.27,900 వరకూ పెరుగుతుందని చెప్పారు. గతంలో ఈ రేటు రూ.6,650 నుంచి రూ.6,975 వరకూ ఉండేది. ల్యాండ్ రెసిడెన్షియల్, కమర్షియల్, అగ్రికల్చరల్ అనే కేటిగిరిల కింద వివిధ రేట్లలో భూముల పెరుగుదల ఉంటుందని చౌబే వివరించారు. రానున్న రోజులలో ఈ పెరుగుదల మరింత ఉంటుందని మార్కెట్ నిపుణులు అంచనావేస్తున్నారు .
by Rama Chandra P | Jun 8, 2025 | పరిశీలన
ఎలాన్ మస్క్ విచిత్ర ప్రవర్తనను విశ్లేషించిన డాక్టర్ డ్రూ
- అతి ఉత్సాహం, తక్కువ నిద్ర, వేగంగా మాట్లాడటం ‘హైపోమేనియా’ లక్షణాలు
- జన్యుపరమైన కారణాలు, రసాయనాల అసమతుల్యత, ఒత్తిడి ప్రధాన హేతువులు
- మానసిక వైద్యుల పర్యవేక్షణలో నిర్ధారణ, చికిత్స అవసరం
- నిర్లక్ష్యం చేస్తే తీవ్ర పరిణామాలని నిపుణుల హెచ్చరిక
- కొన్ని సందర్భాలలో ఆత్మహత్యకు పూనుకునే ప్రమాదం
”రోజుకి ఐదారు గంటలు మాత్రమే నిద్రపోతాను . ..” అని తరచూ చెప్పే ఎలాన్ మస్క్ మానసిక పరిస్థితి తేడా కొడుతోంది . టెస్లా, స్పేస్‌ఎక్స్, న్యూరాలింక్ వంటి ప్రఖ్యాత సంస్థల అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ గురించి తెలియని వారుండరు. ఆయన సాధించిన విజయాలు ఎంత గొప్పవో, కొన్నిసార్లు ఆయన ప్రవర్తించే తీరు కూడా అంతే వివాదంగా , చర్చనీయాంశంగా మారుతుంది. తాజాగా, ప్రముఖ సైకాలజిస్ట్, ఎడిక్షన్స్ వైద్య నిపుణుడు డాక్టర్ డ్రూ పిన్స్కీ, మస్క్ ప్రవర్తనపై హాట్ కామెంట్స్ చేశారు. మస్క్ ప్రవర్తన ‘హైపోమేనియా’ అనే మానసిక స్థితికి దగ్గరగా ఉండవచ్చని ఆయన అంచనా వేశారు. గతంలో మస్క్ తనకు ఆస్పెర్గర్స్ సిండ్రోమ్ ఉందని స్వయంగా వెల్లడించినప్పటికీ, ఆయన బహిరంగ ప్రవర్తన వెనుక మరో కారణం ఉండొచ్చని డాక్టర్ డ్రూ సూచిస్తున్నారు.
తాజాగా ఓ న్యూస్‌మ్యాక్స్ కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ డ్రూ పిన్స్కీ, ఎలాన్ మస్క్ మేధస్సును, ఆయన సాధించిన విజయాలను ప్రశంసించారు. అయితే, “మస్క్ విజయం వెనుక మరో కోణం కూడా ఉంది. ఆయన బహుశా హైపోమేనియాతో బాధపడుతుండవచ్చు” అని వ్యాఖ్యానించారు. మస్క్ ప్రదర్శించే అపారమైన శక్తి, నిరంతరం చేసే ట్వీట్లు, కొన్నిసార్లు అదుపుతప్పిన వ్యాఖ్యలు, మాజీ అధ్యక్షుడు ట్రంప్‌తో వివాదాలు వంటివి కేవలం ఆస్పెర్గర్స్ సిండ్రోమ్ పరిధిలోకి రావని, ఇవి హైపోమేనిక్ ఎపిసోడ్‌లకు సంబంధించిన మూడ్ డిజార్డర్‌ను సూచిస్తున్నాయని డాక్టర్ డ్రూ అభిప్రాయపడ్డారు.
హైపోమేనియా అంటే ఏమిటి?
హైపోమేనియా అనేది ఒక రకమైన మానసిక రుగ్మత. ఈ స్థితిలో వ్యక్తి మానసిక స్థితి అసాధారణంగా ఉత్సాహంగా లేదా చిరాకుగా ఉంటుంది. శక్తి స్థాయిలు అమాంతం పెరిగి, కనీసం నాలుగు రోజుల పాటు విపరీతమైన చురుకుదనం కనిపిస్తుంది. ఇది పూర్తిస్థాయి మేనియా కన్నా తీవ్రతలో తక్కువగా ఉంటుంది. హైపోమేనియాలో సాధారణంగా వాస్తవికతతో సంబంధం కోల్పోవడం (సైకోసిస్) లేదా ఆసుపత్రిలో చేర్పించాల్సినంత తీవ్రమైన లక్షణాలు ఉండవు. అయినప్పటికీ, ఇది వ్యక్తి సాధారణ మానసిక పనితీరులో గణనీయమైన మార్పును సూచిస్తుంది. మానసిక రుగ్మతల విశ్లేషణ మార్గదర్శిని అయిన డీఎస్ఎమ్-5 ప్రకారం, ఇది బైపోలార్ II డిజార్డర్‌లోని ఒక దశగా పరిగణిస్తారు.
క్రియేటివిటీతోపాటు . ..
కొన్నిసార్లు హైపోమేనియా అద్భుతమైన సృజనాత్మకతకు లేదా ఉత్పాదకతకు దారితీయవచ్చని, అందుకే కొందరు దీనిని “జీనియస్ జోన్” అని కూడా అంటారని నిపుణులు చెబుతున్నారు. అదే సమయంలో, హఠాత్తు నిర్ణయాలు తీసుకోవడం, ప్రమాదకర ప్రవర్తనలకు పాల్పడటం వంటివి కూడా దీనివల్ల జరగవచ్చు. కుటుంబంలో ఎవరికైనా బైపోలార్ స్పెక్ట్రమ్ డిజార్డర్స్ ఉండటం, మెదడులోని రసాయనాల అసమతుల్యత, తీవ్రమైన ఒత్తిడి, నిద్రలేమి, కొన్ని రకాల మందుల వాడకం వంటివి హైపోమేనియాకు కారణాలు కావచ్చని వైద్య నిపుణులు విశ్లేషిస్తున్నారు.
by Rama Chandra P | Jun 8, 2025 | జనరల్
ఓ తండ్రి . . కొడుక్కి చెప్పిన ఆసక్తికరమైన విషయాలు మీరూ చదవండి . ..
తండ్రిని ఒక కొడుకు అడిగిన ఒక సందేహం…. (పాతికేళ్ల క్రితం నాటి కధ . . అయినా కొత్తగానే ఉంటుంది . ..)
నాన్నా ! మీ కాలంలో;;;;
1. ఇంత టెక్నాలజీ లేదు..
2. ఆర్డర్ పెడితే పది నిమిషాలలో ఫుడ్ ఇంటికొచ్చే సౌకర్యంలేదు . ..
3. వేగవంతమైన ఇంటర్నెట్ లేదు..
4. ఆధునిక TV లు లేవు..
5. కంప్యూటర్లు లేవు..
6. ఏసీ లు లేవు..
7. లగ్జరీ కార్ లు లేవు..
8. మొబైల్ ఫోన్ లు లేవు… మీరెలా బ్రతికేవారు?
*దానికి ఆ తరము తండ్రి గారు ఇచ్చిన జవాబు అందరూ చదవవలసిందే*.
మీ తరమువారు ఈ రోజుల్లో ఎలాగైతే
1. ప్రార్ధన లేకుండా..
2. మర్యాద లేకుండా
3. ప్లానింగ్ లేకుండా
4. క్రమశిక్షణ లేకుండా..
5. పెద్దల ఎడల గౌరవం లేకుండా..
6. మన చరిత్ర పై అవగాహన లేకుండా..
7. కుటుంబ విలువలపై ఏ మాత్రం పట్టింపులు లేకుండా.
8. ఏ మోరల్ వేల్యూస్ లేకుండా… రోజులు ఎలా గడిపేస్తున్నారో!
మేము ఆ Morals అన్నీ పాటిస్తూ ఆనందముగా జీవించాము.
మేము మీలాగా…
1. వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ ధరించలేదు..
2. పాఠశాల వేళలు అయిన
తరువాత చీకటి పడేదాకా ఆడుకున్నాము. TV లు చూడలేదు…
3. ఇంటర్నెట్ స్నేహితులతో కాక నిజమైన స్నేహితులతో గడిపాము..
4. దాహము వేస్తే కుళాయి నీరు, బావి నీరు త్రాగాము. బాటిల్ నీరంటే ఏమిటో తెలియదు..
5. ఒకే గ్లాస్ లో నలుగురం జ్యూస్ త్రాగినా, కాకి ఎంగిలి చేసిన జామకాయలు తిన్నా
మాకెప్పుడూ జబ్బులు రాలేదు..
6. మూడు పూటలా అన్నమే తిన్నా మాకు ఊబకాయం రాలేదు…
7. షూస్ లేకుండా ఉత్తి పాదాలపై పరిగెత్తినా
మాకు కీళ్ళ నొప్పులు రాలేదు..
8. సొంత ఆట వస్తువులు తయారు చేసికొని ఆడుకున్నాము,, అష్టా చెమ్మా, ఏడు పెంకులు, కోతి కొమ్మచ్చి, వైకుంఠ పాళీ ఆడుకున్నాము.
బంధువులతో కలసి మెలసి ఆనందముగా ఉన్నాము,
9. పిలువక పోయినా స్నేహితుల ఇండ్లకు వెళ్లి వారి తినుబండారాలు ఆరగించాము..
10. మావి black and వైట్ ఫొటోలే అయినా వాటి వెనుక ఎన్నో మధుర స్మృతులు…..
బహుశా మాతల్లి దండ్రులు చెప్పినది ఆచరించిన చివరి తరం మేమే.
మా వారసులు శాసించినది పాటించే మొదటి తరమూ మాదే కావచ్చు…..
అయినప్పటికీ..
మీ యాంత్రిక జీవితానికి యధాశక్తి సహాయ పడుతున్న వాళ్ళము…
మేము ఒక limited ఎడిషన్ మోడల్స్ లాంటి వాళ్ళము…..
అందుకే మా విన్నపము ఏమంటే..
*భూమి పైనుండి మేము వెళ్ళిపోకముందే మా జీవితాలనుండి, ఎంతో కొంత మానుండి మీరు నేర్చుకోండి*.…….
మమ్మల్ని చక్కగా పెంచిన మంచి తల్లిదండ్రులకు వందనాలు,
మేము అలా పెంచడం చేతకాని ఈ సమాజంలో,
ఓడిపోయిన మొదటి తరం తల్లిదండ్రులం అవుతామేమో . …. ఈ కధ సోషల్ మీడియాలో తరచూ కనిపిస్తూ ఉంటుంది . ఇలాంటి ఆలోచింపచేసే కధలు , వాస్తవాలను నేటి తరం పిల్లలకు ఏదోలా చేరవేయాలి . కనీసం ఒక్క్కసారైనా దీనిపై ఆలోచన చేస్తారు . అందుకు అనుగుణంగా నడుచుకోవాలని ఎప్పుడైనా అనిపిస్తే . .. అటుగా అడుగులు వేసే ప్రయత్నం అయినా మొదలెడతారు . . పాజిటివ్ గా ఆలోచిద్దాం . ..