దసరాకు రికార్డు సృష్టించిన ఇంద్రకీలాద్రి

Ram Maddipati

New Record: విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఈసారి జరిగిన దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా రికార్డు స్థాయిలో 18.60 లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు.

విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఈసారి జరిగిన దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా రికార్డు స్థాయిలో 18.62 లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఈసారి ఉత్సవాల నిర్వహణను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు మైసూరు తరహాలో దసరా ఉత్సవాలకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. నిర్వహణకు మంత్రుల కమిటీని నియమించారు. ఏర్పాట్లపై ముందస్తుగా సమీక్షలు నిర్వహించారు. ప్రభుత్వ ఆహ్వానంతో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, తమిళనాడు, మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రులు, ప్రముఖులు హాజరయ్యారు.

అదనంగా ఐదు లక్షల మంది : 2023 దసరా వేడుకల్లో 12 రోజుల్లో 12 లక్షల మంది భక్తులు రాగా, 2024లో 12.54 లక్షల మందికి పెరిగారు. 2025లో స్త్రీశక్తి పథకం అమలులోకి రావడంతో ఉచిత బస్సుల్లో భారీ సంఖ్యలో మహిళలు ఆలయానికి తరలిరావడం ఆరంభించారు. అనూహ్యంగా భక్తుల సంఖ్య పెరిగి దసరా సీజన్‌లో 12 రోజుల్లో 17.52. లక్షల మంది వరకూ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ ఏడాది ఏకంగా 18.50 లక్షల మంది వచ్చారు మూడేళ్ల కిందటితో పోలిస్తే ఐదున్నర లక్షల మంది అదనంగా వచ్చినా ఏర్పాట్లలో ఏ లోటూ రాకుండా ప్రభుత్వం ముందస్తు సన్నాహాలు చేసింది.

ఏర్పాట్లు అద్భుతం : ఈసారి దసరా ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయంటూ భక్తుల నుంచి ప్రశంసలు వచ్చాయి. భక్తుల పర్యవేక్షణ, సౌకర్యాల కల్పన, ట్రాఫిక్‌ రద్దీ నియంత్రణ, పార్కింగ్‌ ఏర్పాట్లు, ప్రసాదాల తయారీ, అన్నదానం, వాటర్‌ బాటిళ్ల పంపిణీ సహా ఎక్కడా రాజీపడకుండా నాణ్యతకు పెద్దపీట వేశారు. గతంలో భక్తులకు వాటర్‌ ప్యాకెట్లను అందించేవారు.

ఈసారి బిస్లరీ బాటిళ్లను లక్షల సంఖ్యలో తీసుకొచ్చి అందుబాటులో ఉంచారు. 11 రోజుల్లోనే 32.19 లక్షల బాటిళ్లను అందించారు. డ్రోన్లతో పహారా, చిన్నారులు తప్పిపోకుండా క్యూఆర్‌ కోడ్‌తో ఉన్న రిస్ట్‌ ట్యాగ్‌లను వేయడం వంటివి సత్ఫలితాలిచ్చాయి. 63,785 మంది పిల్లలకు ఈ ట్యాగ్‌లను వేశారు. దీనివల్ల ఉత్సవాల సమయంలో తప్పిపోయిన 51 మంది పిల్లలను వెంటనే కనిపెట్టి తల్లిదండ్రులకు అప్పగించగలిగారు.

You May Also Like…

సాయికృష్ణ లాకప్ డెత్ కేసు.. ఏపీ సర్కార్ పై సుప్రీంకోర్టు సీరియస్

సాయికృష్ణ లాకప్ డెత్ కేసు.. ఏపీ సర్కార్ పై సుప్రీంకోర్టు సీరియస్

విజయవాడలో కృష్ణలంక గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో బుధవారం కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏపీ...