పశ్చిమాసియా పరిస్థితులపై చర్చించిన మోదీ, ట్రంప్-
హర్మూజ్ జలసంధి తెరిపించాల్సిన అవసరంపై మోదీ, ట్రంప్ మధ్య చర్చ
మోదీకి ట్రంప్ ఫోన్ చేసినట్లు చెప్పిన అమెరికా రాయబారి సెర్గియా గోర్
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న సమయంలో . .. కీలక పరిణామం చోటుచేసుకుంది . భారత ప్రధాని నరేంద్ర మోదీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోన్ చేసారు . ఈ సందర్బంగా ట్రంప్ మోదీ మధ్య కీలక చర్చ నడిచింది . ఇరు దేశాధినేతలు పశ్చిమాసియా సంక్షోభం, హర్ముజ్ జలసంధిని తెరిపించాల్సిన అవసరం గురించి చర్చించినట్లు సమాచారం . ఈ విషయాన్ని భారత్లో అమెరికా రాయబారి సెర్గియా గోర్ ఎక్స్ వేదికగా వెల్లడించారు.
అమెరికా – ఇజ్రాయిల్ – ఇరాన్ మధ్య చోటుచేసుకున్న యుద్ధం ప్రభావం యావత్ ప్రపంచంపై తీవ్ర ప్రభావం చూపుతున్న వేళ… మోడీ – ట్రంప్ చర్చలు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది .



