అమరావతిలో ‘బిట్స్’ వెయ్యి కోట్ల పెట్టుబడి

Ram Maddipati

అమరావతిలో మరో ప్రతిష్ట విద్యా సంస్థ క్యా0పస్ ఏర్పాటుపై నిర్ణయం తీసుకుంది. ఇది దేశంలోనే మొదటి ఏఐ యూనివర్సిటీ

అమరావతిలో ఏఐ ప్లస్ క్యాంపస్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రతిష్ఠాత్మక బిర్లా ఇన్స్‌టిట్యూట్‌ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్‌-బిట్స్‌ విశ్వవిద్యాలయ కులపతి, పారిశ్రామికవేత్త కుమారమంగళం బిర్లా ప్రకటించారు. 7000 మంది విద్యార్థులకు స్టడీకి అవకాశం కల్పించేలా కేంద్రాన్ని తీర్చిదిద్దుతామని… వచ్చే 2027 నుంచి ప్రవేశాలు ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. ఆధునిక సాంకేతిక విద్యాకేంద్రంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. కృత్రిమ మేథ, డేటాసైన్స్‌, రోబోటిక్స్‌, కంప్యుటేషనల్‌ లింగ్విస్టిక్స్‌, సైబర్ ఫిజికల్ సిస్టమ్స్ తదితర కోర్సులకు ప్రాధాన్యమివ్వనున్నట్లు వెల్లడించారు .

ఇండియాలో ఫస్ట్ ఏఐ క్యాంపస్: ఐవోటీ, ఏఐ ఆధారిత సేవలతో డిజిటల్ ఫస్ట్ క్యాంపస్ రూపుదిద్దుకుంటుంది .. దేశంలో ఎక్కడా ఇలాంటి క్యాంపస్ లేదు . . . దేశంలో ఉన్నతవిద్య దిశను మార్చేందుకు తొలి అడుగుగా ఈ క్యాంపస్‌ను తీర్చిదిద్దుతామన్నారు. అమరావతిలో రెండేళ్లు, విదేశీ విశ్వవిద్యాలయాల్లో రెండేళ్లు అభ్యసించేలా డిజైన్‌ చేస్తున్నామని జాయింట్ పీహెచ్​డీలు చేయొచ్చని బిర్లా వివరించారు. అమరావతి క్యాంపస్‌ దేశంలోనే మొదటి ఏఐ క్యాంపస్ కాబోతోందని కంప్యూటర్‌ సైన్సులోని అన్ని ముఖ్యమైన ప్రోగ్రామ్స్‌ అక్కడ ఉంటాయని ఉపకులపతి రామగోపాలరావు చెప్పారు. వివిధ మైనర్‌ ప్రోగ్రామ్స్‌ను అందుబాటులోకి తెస్తున్నామని అన్నారు. వ్యవసాయం నుంచి వాతావరణం, ఆరోగ్య సంరక్షణ వరకు అన్ని రంగాల కోర్సులకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వెల్లడించారు.

70 ఎకరాలలో బిట్స్

బిట్స్ అమరావతి క్యాంపస్ ఏర్పాటుకు సీఐర్​డీఏ 70 ఎకరాలు కేటాయించింది. సీడ్ యాక్సిస్‌ రోడ్డు పక్కన వేంకటేశ్వరస్వామి ఆలయ సమీపంలో స్థలం కావాలని బిట్స్ కోరింది. తమ సంస్థ భవనాలనూ ఆలయ నమూనాలో నిర్మిస్తామని తెలిపింది. దీంతో వారు కోరిన ప్రాంతంలోనే ప్రభుత్వం భూములు కేటాయించింది. ఇటీవల సీఎం చంద్రబాబు వద్ద కూడా దీనిపై చర్చ జరిగింది. బిట్స్ క్యాంపస్ నమూనాలను ఆయన పరిశీలించారు.

భూ సమీకరణ-2 .. వ్యవహారంలో ప్రభుత్వం తాత్కాలికంగా వెనక్కి తగ్గిన నేపథ్యంలో… ఆ అంశంపై పెద్దగా చర్చ లేకుండా ఉండేందుకు బిట్స్ అమరావతిలో ఏర్పాటు అంశం వెంటనే తెరపైకి వచ్చినట్లు కూడా పలువురు ప్రచారం మొదలుపెట్టారు .

You May Also Like…