ఉప్పాడ తీర0 రక్షణ చర్యలు – రూ.323 కోట్ల

Ram Maddipati

ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. సముద్రకోటతో దశాబ్దాలుగా కోతకు గురవుతున్న ఉప్పాడ తీరప్రాంతానికి రక్షణ కవచం ఏర్పాటు చేస్తాను…అని ఇచ్చిన హామీ పవన్ రెండేళ్లలోనే అమలులోకి తీసుకువచ్చారు.

సముద్ర కోతతో every Year దెబ్బతింటున్న ఉప్పాడ తీర ప్రాంత పరిరక్షణకు కీలక ముందడుగు పడింది. ఉప్పాడ తీర ప్రాంత రక్షణ గోడ నిర్మాణానికి ఐఐటీ మద్రాస్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు బుధవారం నాడు మంగళగిరి క్యాంపు కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి పవన్‌ సమక్షంలో ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. తీర ప్రాంత రక్షణ గోడ నిర్మాణం, సమగ్ర ప్రాజెక్ట్‌ రిపోర్టు, సాంకేతిక పర్యవేక్షణ చేయనుంది. రూ.323 కోట్లతో ఉప్పాడ తీర ప్రాంత రక్షణ గోడ నిర్మాణం కానుంది. కేంద్ర ప్రభుత్వ విపత్తు నిర్వహణ నిధులతో చేపట్టే ఈ ప్రాజెక్టుకు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ నోడల్‌ ఏజెన్సీగా వ్యవహరించనుంది. నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో అమలు చేసే ఎగ్జిక్యూటివ్‌ ఏజెన్సీగా ఏపీ మారిటైమ్ బోర్డు బాధ్యతలు నిర్వహించనుంది

గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉప్పాడ తీర ప్రాంత వాసుల సమస్యలను పట్టించుకోలేదు. ఎన్నికల ముందు హడావిడిగా సర్వేలు చేయించి మిన్నకుంది. ఎన్నికల ప్రచారంలో పవన్‌ కల్యాణ్‌ తీర ప్రాంతాన్ని పరిశీలించి, తాము అధికారంలోకి వస్తే రక్షణ గోడ నిర్మించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం కొలువు తీరాక జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థతో సర్వే చేయించారు. వాకలపూడి-యు.కొత్తపల్లి మండలం అమినాబాద్‌ చేపలరేవు వరకు 14.5 కిలోమీటర్ల మేర రూ.323 కోట్ల అంచనాతో రక్షణ గోడ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించి నిధుల మంజూరుకు హామీ పొందారు. ఈ క్రమంలోనే ఐఐటీ మద్రాస్‌తో బుధవారం నాడు ఒప్పందం జరిగింది.

తీరనున్న తీరప్రాంత వాసుల కల:

  • ఇప్పటికే సుబ్బంపేట సమీపంలో తీరం వెంబడి రహదారి కోతకు గురికాకుండా రూ.90 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టారు. గత ఐదేళ్లలో ఉప్పాడ తీరంలో సముద్ర కోత కారణంగా సుమారు 400కు పైగా ఇళ్లు, 8 ఆలయాలు నేలమట్టమవగా, దాదాపు 14 కిలోమీటర్ల మేర రహదారి దెబ్బతింది.
  • గత 25 ఏళ్లుగా యు.కొత్తపల్లి మండలం సుబ్బంపేట నుంచి మాయాపట్నం వరకు రాకాసి అలల ప్రభావానికి గ్రామాలు సముద్ర గర్భంలో కలిసిపోయాయి. వందల ఎకరాల వ్యవసాయ భూములూ కనుమరుగయ్యాయి. ఇప్పటివరకు అన్ని గ్రామాల్లో కలిపి 1360.75 ఎకరాల మేర కోతకు గురైంది. ఉప్పాడ-కాకినాడ బీచ్‌రోడ్డు నిరంతరం కోతకు గురయ్యేది. మరమ్మతులకు ఏటా రూ.కోట్లలో ఖర్చు అయ్యేది.
  • 2009లో అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలనలో రూ.12 కోట్ల వ్యయంతో జియోట్యూబ్‌ నిర్మించారు. నాలుగేళ్ల వరకు గ్రామాలకు రక్షణ కల్పించింది. అనంతరం జియోట్యూబ్‌ మరమ్మతులకు గురవడంతో కాలం గడిచేకొద్దీ కనుమరుగైంది. దీంతో పదేళ్లుగా మళ్లీ కోత సమస్య తీవ్రమైంది. ఇన్నాళ్లకు కూటమి ప్రభుత్వ చొరవతో సమస్యకు పరిష్కారం దిశగా అడుగులు పడుతున్నాయి.

You May Also Like…