రెండో విడత భూములు ఇవ్వకపొతే… అమరావతి మున్సిపాలిటీయే . .. చంద్రబాబు బెదిరింపు వెనుక . …

Rama Chandra P

33 వేల ఎకరాలు.. అమరావతి మున్సిసిపాలిటీయే . .. సీఎం చంద్రబాబు బెదిరింపు వెనుక ఏమి జరిగింది . .. రైతులలో ఆందోళన

కూటమి సర్కార్ అధికారం చేపట్టి ఏడాదిన్నర పూర్తవుతున్నా …. భూములు ఇచ్చిన రైతులకు ప్లాట్లు కూడా పూర్తిగా కేటాయించలేదు . రైతులు రోడ్డెక్కుతామని హెచ్చరిస్తే . .. కాస్త భయపడిన సర్కార్ వాళ్ళతో చర్చలకు దిగి వచ్చింది . లేకపోతె అంతే సంగతులు .

”అమరావతి విశ్వ నగరంగా ఎదగాలంటే మరింత భూమి కావాలి . ఇపుడున్న భూములతోనే నగరాన్ని అభివృద్ధి చేయాలంటే కుదరదు . విశ్వ నగరంగా రూపుదిద్దాలంటే మరోవిడత భూసమీకరణ తప్పనిసరి . లేకపోతె అమరావతి కేవలం ఒక మున్సిసిపాలిటీగా మిగిలిపోతుంది . దీనిపై రైతులు ఆలోచించుకోవాలి . ..” అని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పడం వెనుక ఆంతర్యం ఏమిటి ? 33 వేళా ఎకరాల భూమిని ఇచ్చింది . .. మున్సిసిపాలిటీ కోసమా ? ఈ ధోరణితో మాట్లాడటం సీఎం స్థాయికి తగునా ? రైతులను బెదిరిస్తున్నారు ? బ్లాక్ మెయిల్ చేస్తున్నారా ? అన్న సందేహం కలగకమానదు .

”రైతులు రాజధాని కోసం త్యాగాలు చేసారు . వారి త్యాగాలకు వారి తర్వాత తరాలకు ప్రతిఫలం అందేలా చేస్తున్నాం . .” ఆంటు చంద్రబాబు పదేపదే చెపుతూ ఉంటారు . అలాంటి మాటలు చెప్పే చంద్రబాబు . .. 33 వేల ఎకరాలకు పరిమితం అయితే మిసిసిపాలిటీ గా మిగిలిపోతుంది . .. అంటూ అమరావతిపై నెగిటివ్ కామెంట్స్ చేయడంపై రైతులు , పలువురు మేధావులలో ఆశ్చర్యం వ్యక్తం అవుతోంది . సాక్షాత్తు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న నేత ఈ విధమైన బెదిరింపు ధోరణితో చేసిన వ్యాఖ్యలపై తెలుగు రాష్ట్రాలలో చర్చ సాగుతోంది .

ల్యాన్డ్ పూలింగ్ కి గ్రీన్ సిగ్నల్ . ..

చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం మరో వివాదాస్పద కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని అమరావతి ప్రాంతంలో రెండో విడత ల్యాండ్ పూలింగ్‌ చేపట్టాలని రాష్ట్ర కేబినెట్‌లో ఆమోదం తెలిపింది. ఈ దశలో మరో16 వేల ఎకరాల సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు సంబంధించిన ప్రక్రియపై ప్రభుత్వం కసరత్తు చేపట్టింది. రాజధాని అమరావతి కోసం మొత్తం 50 వేల ఎకరాలు రైతుల నుంచి భూ సమీకరణ చేపట్టాలని ప్రభుత్వం భావించింది. మొదటి దశలో రైతుల నుంచి 34 వేల ఎకరాల సమీకరణ.. రెండో దశలో మరో 16 వేల ఎకరాలపై కసరత్తు చేస్తోంది. త్వరలో ల్యాండ్‌ పూలింగ్‌‌కు సంబంధించిన నోటిఫికేషన్‌‌ను సీఆర్డీఏ విడుదల చేయనుంది.మొత్తం ప్రభుత్వ భూమి, రైతుల వద్ద నుంచి తీసుకున్న భూమితో కలిపి 74 వేల ఎకరాలలో రాజధాని నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టనుంది. ఇక ఈ రెండో విడత భూ సమీకరణకు సంబంధించి 7 గ్రామాల్లో భూ సేకరణ చేయనుంది. వైకుంఠపురంలో 3,361 ఎకరాలు, పెదమద్దూరులో 1,145 ఎకరాలు, ఎండ్రాయిలో 2,168 ఎకరాలు, కర్లపూడిలో 2,946 ఎకరాలు, వడ్డమానులో 1,915 ఎకరాలు, హరిశ్చంద్రపురంలో 2,418 ఎకరాలు, పెదపరిమిలో 6,513 ఎకరాల భూ సమీకరణకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ప్రభుత్వ అసైన్డ్‌ భూములతో కలిపి మొత్తం 20, 496 ఎకరాల భూ సేకరణ ద్వారా సీఆర్డీఏ తీసుకోనుంది.

అప్పుడు రిక్వస్ట్… ఇపుడు వార్న్0గ్ … రాజధాని కోసం భూ సమీకరణ సమయంలో రైతులు , రైతు నేతలను బతిమాలి భూసమీకరణకు ఒప్పించారు . అదే చంద్రబాబు టీమ్ . ..ఇపుడు భూములు ఇవ్వకపోతే అమరావతి మున్సిపాలిటీగా ఉండిపోతుంది . .. తర్వాత మీ ఇష్టం . ..అంటూ హెచ్చరికలు చేయడంపై రైతుల్లో తీవ్ర ఆవేదన నెలకొంది . ”మొదటి విడత తీసుకున్న భూములను అభివృద్ధి చేసి . … రెండో విడత భూ సమీకరణ అంటే మేము సహకరిస్తాం . … ఏమీ లేకుండా మళ్ళీ భూములు అంటే . .. రాజకేయం తారుమారై . … జగన్ మళ్ళీ గెలిస్తే . .. మా పరిస్థితి ఎవరికీ చెప్పుకోవాలి . . ఇపుడు టీడీపీ , జనసేన ఎమ్మెల్యేల అరాచకాలకు ప్రజలలో తిరుగుబాట వచ్చి . .. కూటమి ఓటమిపాలైతే … జగన్ వచ్చి అమరావతిని స్మశానం చేస్తే . .. మా తర్వాత తరాల వారు ఏమి కావలి . ..దీని గురించి ఆలోచన చేయాలి . .. అని రైతులు కోరుతున్నారు .

You May Also Like…