రష్యా..ఇండియా..చైనా.. కలిస్తే ఏమవుతుంది ?

Srinivas Vedulla

ఐక్యమత్యంతోనే ఈ సాంకేతిక యుగంలో ముందుకెళ్లగలం

“ఆపరేషన్ సిందూర్” తో భారత్ …పాకిస్థాన్ ను గోడకుర్చీ వేయించింది/ అంతకు మించి ప్రపంచంలో శక్తివంతమైన “ఇండో పసిఫిక్” రాజకీయ, ఆర్ధిక డైనమిక్స్ ముందువరుసలో భారత్ ను తీసుకువెళ్తుంది. 

ఇండో పశిఫిక్ ప్రాంతం గురించి క్లుప్తంగా తెలుసుకుందాం: హిందూ మహాసముద్రం, పసిఫిక్ మహాసముద్రం  పశ్చిమ, మధ్య భాగాలను ఇండో-పసిఫిక్ ప్రాంతం అంటారు. ఇందులో తూర్పు ఆఫ్రికా నుండి పశ్చిమ అమెరికా వరకు విస్తరించిన భూభాగం ఉంటుంది. ఈ ప్రాంత భౌగోళిక లక్షణాలు రాజకీయ ఆర్థిక డైనమిక్స్‌ను గణనీయంగా ప్రభావితం చేస్తాయి. ఇండో-పసిఫిక్ యొక్క భౌగోళిక రాజకీయ మరియు ఆర్థిక ముఖచిత్రం యొక్క కీలక భౌగోళిక అంశాలు ఉన్నాయి.

ప్రపంచ వాణిజ్యంలో 50% కంటే ఎక్కువ జరిగే సముద్ర మార్గాలు ఇండో-పసిఫిక్ ప్రాంతంలో వున్నాయి. మలక్కా జలసంధి ద్వారా సంవత్సరానికి 100,000 ఓడలు దాటుతాయి, ఇవి చైనా, జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాలకు ఇంధనాన్ని వస్తువులను రవాణా చేస్తాయి. సింగపూర్, హాంకాంగ్, మరియు షాంఘై వంటి ఓడరేవులు ఈ ప్రాంతంలో ఆర్థిక కేంద్రాలుగా ఉన్నాయి.

ప్రపంచం “పెద్దన్న” గా భావించే అమెరికా నేతృత్వంలో జపాన్, ఫిలిప్పీన్స్, ఆస్ట్రేలియా దేశాల కూటమి ఇండో పశిఫిక్ ప్రాంతంలో ఆధిపత్యం వహిస్తోంది. అమెరికా ఉద్దేశ్యపూర్వకంగానే భారత్ ను ఇందులో కలపలేదు.

ఆపరేషన్ సిందూర్ తరువాత ప్రపంచదేశాల్లో భారత్ పట్ల ఆలోచనల్లో పెద్ద మార్పు వచ్చింది. ఇది కేవలం సైనిక విజయం వల్ల మాత్రమే కాదు. ఆరు సంవత్సరాలుగా ఆర్ధిక రంగంలో వృద్ధి ప్రభావం. ఆర్ధికంగా 10 వస్ధానం నుంచి 4 వ స్థానానికి చేరుకున్న భారత్ సామర్ధ్యాన్ని ప్రపంచం కుతూహలంగా గమనిస్తోంది. ఆపరేషన్ సిందూర్ ఒక ట్రిగ్గర్ గా పనిచేసింది.

మరోవైపు ఇండో పశిఫిక్ ప్రాంతంలో అమెరికా పక్కనపెట్టిన భారత్ ఇదే ప్రాంతంలోని తైవాన్ తో వాణిజ్యం, ఫిలిప్పీన్స్ తో మిసైల్స్ సరఫరా, జపాన్ తో టెక్నాలజీ సప్లైస్, వియత్నాంతో సైనిక సహకారం, ఇండోనేషియాతో సముద్ర భద్రత ఒప్పందాలు కుదుర్చుకుంది.

ఇదే అదనులో రష్యా ప్రతిపాదించిన రష్యా ఇండియా చైనా (RIC) ప్రతిపాదన మరోసారి తెరమీదికి వచ్చింది.

RIC ఒక త్రైపాక్షిక సహకార వేదికను సూచిస్తుంది. ఇది ఈ మూడు దేశాల మధ్య రాజకీయ, ఆర్థిక, వ్యూహాత్మక, మరియు సాంస్కృతిక సంబంధాలను బలోపేతం చేయడానికి ఏర్పాటైన ఒక అనధికారిక ఏర్పాటు. RIC సమావేశాలు సాధారంణంగా ఈ దేశాల విదేశాంగ మంత్రుల స్థాయిలో జరుగుతాయి.

వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధన రంగం, మరియు సాంకేతికతలో సహకారాన్ని పెంచడం RIC లక్ష్యం.

ప్రపంచ రాజకీయాలలో పాశ్చాత్య దేశాల ఏకపక్ష వ్యతిరేకించి, ప్రపంచ వ్యవస్థను ప్రోత్సహిస్తాయి. ఉగ్రవాదం, సైబర్ భద్రత, మరియు ప్రాంతీయ స్థిరత్వంపై సమిష్టి చర్యలపై చర్చలు జరుగుతాయి.ఆఫ్ఘనిస్తాన్, మధ్య ఆసియా, మరియు ఇండో-పసిఫిక్ ప్రాంతంలో స్థిరత్వం కోసం సహకారం. విద్య, పర్యాటకం, సాంస్కృతిక మార్పిడి కార్యక్రమాల ద్వారా ప్రజల మధ్య సంబంధాలను బలోపేతం చేయడం.

ఆపరేషన్ సిందూర్ తరువాత RIC కూటమి బలోపేతం కాగల అవకాశాలు బాగా మెరుగయ్యాయి. ప్రపంచ జనాభాలో ఈ మూడుదేశాల జనాభా 36 శాతం. అలాగే ప్రపంచ వాణిజ్యంలో ఈ మూడుదేశాల వాటా 37 శాతం. RIC బలపడితే ఈ సహజ సామర్ధ్యమే!

ఈ కూటమి దేశాల సమస్యలను చర్చలద్వారా పరిష్కరించుకోగలిగి, ఏకాభిప్రాయంతో ముందుకి వెళ్ళగలిగితే సూపర్ పవర్ కాగలుగుతాయి.

ఆధిపత్యాన్ని నిలబెట్టుకోడానికి విభజించి పాలించడం ఒక కుటిలనీతి. అపుడు బ్రిటన్, ఇపుడు అమెరికా ఇదే దుర్నీతి పాటించాయి. ఫలితంగా పుట్టిన ద్వేషాగ్నితో ఇప్పటికీ ఇండియా, పాకిస్థాన్ – రష్యా, ఉక్రెయిన్ మండిపోతున్నాయి. వనరులను సద్వినియోగం చేసుకోగలిగిన సామర్థ్యమే శక్తిగా మారుతుంది. ఆ శక్తితో పాటు దౌత్యనీతి కూడా భారత్ ను పెద్ద ఇన్ ఫ్లుయెన్సర్ గా  నిలబెడుతోంది. ఇలాంటి ఇన్ ఫ్లుయెన్సే విద్వేషాల్ని చల్లార్చగలుగుతుంది.

మన స్వరం పెంచి ఐక్యరాజ్య సమితి ని నిలదీసే వరకూ భారత్ ఇన్ ఫ్లుయెన్స్ పెరిగింది. సమితిలో శాశ్వత సభ్యత్వం, వీటో అధికారాల కోసం ఇండియా చాలాకాలంగా ప్రయత్నిస్తోంది. సమితి భద్రతామండలి తాజాసమావేశంలో సెక్రెటరీ మేరీ జాన్సన్ ఈ అంశాన్ని ప్రస్తావించి “భారత్ అభివృద్ధి చెందుతున్న దేశం మాత్రమే. అభివృద్ది చెందాక వీటో అధికారం కూడా వస్తుంది” అన్నారు. దీనిపై విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ భారత్ ఏ రంగంలో ఏమేమి  సాధించిందో వివరిస్తూ, భారత్ ఎక్కడ వెనుకబడిందో చెప్పాలని అడిగినపుడు సెక్రెటరీ మాట్లాడలేకపోయారు. అంటే పరిస్థితి ఏవిధంగా ఉందొ అర్ధం చేసుకోవచ్చు .

You May Also Like…