రామ్ చరణ్ ‘పెద్ది ‘ లో ఆ బిగ్ స్టార్ ఎవరు ?

Srinivas Vedulla

April 16, 2025

2026 మార్చి 27 న పెద్ది విడుదల .. అంతవరకూ మెగా అభిమానులకు వెయిటింగే

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్…  ‘ఉప్పెన’ ఫేమ్ సానా  బుచ్చిబాబు  కాంబినేషన్ లో తెరకెక్కుతున్న  ‘పెద్ది’ సిని మాపై ఇండిస్ట్రిలో అమితాసక్తి నెలకొంది. పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాపై ఇండియా వైడ్ భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఇటీవల విడుదలైన గ్లింప్స్ కి సూపర్-డూపర్  రెస్పాన్స్ వచ్చింది.

స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ తో రానున్న  ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి 27న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి రెడీ చేస్తున్నారు.   పెద్దిలో అలనాటి అందాలతార శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ హీరోయిన్.   కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ ‘పెద్ది’లో  కీలక పాత్ర పోషిస్తున్నారు.  ఈ విషయం దర్శకుడు బుచ్చిబాబు ఇదివరకే ప్రకటించారు.  ఈ సినిమాలో మరో సూపర్ స్టార్ గెస్ట్ రోల్ చేస్తున్నట్లు సమాచారం. అయితే ఆ సూపర్ స్టార్ ఎవరనేది మరికొన్ని రోజులల్లో వెల్లడిచేయనున్నారు..
 ఆ స్టార్  సూర్య అని ఇటీవల  ప్రచారం సాగుతోంది.   నిడివి తక్కువే అయినప్పటికీ పవర్ ఫుల్ రోల్. దీనికి సూర్య కూడా అంగీకరించినట్లు టాక్.

You May Also Like…