తెలుగు మహిళకు బ్రిటన్‌ పౌర పురస్కారం

Abhi Correspondent

August 14, 2025

పూర్ణిమ తణుకు – బ్రిటన్‌ అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన సీబీఈ అవార్డుని అందుకున్న తొలి తెలుగు మహిళ

” మా స్వస్థలం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కొత్తపేట. సొంతూరిలోనే ప్రాథమిక విద్య పూర్తయ్యాక అమలాపురంలోని ఎస్‌కేబీఆర్‌ కాలేజీలో డిగ్రీ చదివా. ఆపై ఆంధ్రా యూనివర్సిటీలో పీజీ చేశా. నాన్న విశ్వేశ్వరయ్య, టైపు ఇన్‌స్టిట్యూట్‌ నడిపేవారు. అమ్మ రత్నాంబ, గృహిణి. లండన్‌లో సర్జన్‌గా పని చేస్తున్న డాక్టర్‌ వెంకట సూర్యనారాయణతో పెళ్లవడంతో ఇక్కడే స్థిరపడ్డా. మొదట ఇంజినీరింగ్‌ కంపెనీలో కెరియర్‌ ఆరంభించా. తర్వాత యువత, పిల్లల కోసం పనిచేసే ‘రీజనరేషన్‌ ట్రస్ట్‌’కి మేనేజింగ్‌ డైరెక్టర్‌గా విధులు నిర్వర్తించా. ఆపై జైళ్లలో ఉన్నవారికి విద్యను అందించేందుకు కృషి చేసిన తొలి ఆసియా మహిళగానూ గుర్తింపు దక్కించుకున్నా. ”

 బ్రిటన్‌ అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన సీబీఈ అవార్డుని అందుకున్నారు మన తెలుగు మహిళ పూర్ణిమ తణుకు.

బాలల సంరక్షణku పోరాటం : ప్రస్తుతం నేషనల్‌ డే నర్సరీస్‌ అసోసియేషన్‌ (ఎన్‌డీఎన్‌ఏ)కు ఎగ్జిక్యూటివ్‌ ఛైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్నాఋ పూర్ణిమ . . ఇది యూకేలో బాలల సంరక్షణ, హక్కుల కోసం పనిచేసే అతిపెద్ద ఛారిటీ-మెంబర్‌షిప్‌ అసోసియేషన్‌. 2004లో ఈ సంస్థలో చేరారు . అప్పటికి 20 మంది సిబ్బందితో చిన్నగా ఉండేది. ఇప్పుడు మూడు శాఖలతో 100మందికిపైగా ఉద్యోగులతో శక్తిమంతమైన స్వచ్ఛంద సంస్థగా మార్చగలిగారు పూర్ణిమ . . యూకేలోని 15000 డే నర్సరీల హక్కుల కోసం పోరాడి రికార్డ్ క్రియేట్ చేసారు . . దాదాపు పదిలక్షల మందికిపైగా చిన్నారులు, వారి కుటుంబాలకు అత్యున్నత సంరక్షణ విధానాలు అమలయ్యేలా చేయగలిగానని వినంరంగా చెపుతారీమె .

అవార్డు అందుకున్న తొలి తెలుగు మహిళ : ”ఇంగ్లండ్‌ సహా 22 దేశాల్లో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నా. ఇలా 20 ఏళ్ల పాటు ఎన్‌డీఎన్‌ఏకు నాయకత్వం వహిస్తూ బాలల విద్యకు చేయూత అందించినందుకు గానూ పలు పురస్కారాలు దక్కాయి. 2011లో బ్రిటన్‌ పౌర పురస్కారాల్లో ఒకటైన ఆర్డర్‌ ఆఫ్‌ బ్రిటిష్‌ ఎంపైర్‌ (ఓబీఈ)ను కింగ్‌ చార్లెస్‌ చేతుల మీదుగా తీసుకున్నా. తాజాగా కమాండర్‌ ఆర్డర్‌ ఆఫ్‌ బ్రిటిష్‌ ఎంపైర్‌ (సీబీఈ)ని చార్లెస్‌ సోదరి ప్రిన్సెస్‌ అనీ అందించారు. ఖగోళ శాస్త్రవేత్త స్టీఫెన్‌ హాకింగ్, నోబెల్‌ గ్రహీత హెరాల్డ్‌ పింటర్, రగ్బీ ఆటగాడు జొనాథన్‌ పీటర్‌ విల్కిన్సన్‌తోపాటు మనదేశం నుంచి ఈ గౌరవాన్ని పొందినవారిలో లీనా నాయర్‌ ఒకరు. ఈ అవార్డు అందుకున్న తొలి తెలుగు మహిళను నేనే కావడం గర్వంగా ఉంది.” అంటూ తనకు అవార్డు రావడంపట్ల సంతోషం వ్యక్తం చేశారు ఈ తెలుగు ఆడపడచు పూర్ణిమ .

You May Also Like…

మిస్సైళ్ల నిల్వలు తగ్గిపోతున్నాయా? ఇరాన్‌తో మరో 10రోజులు యుద్ధం కొనసాగితే అమెరికాకు ఇక్కట్లేనా ?

మిస్సైళ్ల నిల్వలు తగ్గిపోతున్నాయా? ఇరాన్‌తో మరో 10రోజులు యుద్ధం కొనసాగితే అమెరికాకు ఇక్కట్లేనా ?

తరిగిపోతున్న ఆయుధాలు - ఇరాన్​తో మరో 10 రోజులు యుద్ధం కొనసాగితే అమెరికా క్షిపణి నిల్వలు తగ్గే అవకాశం - పెంటగాన్...