సెప్టెంబరు 24 నుంచి తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాలు
తరాల సాంప్రదాయబద్దమైన సాలకట్ల బ్రహ్మోత్సవాలకు తిరుమల సిద్ధమైంది. ఈ క్రమంలో సెప్టెంబరు 24 నుంచి అక్టోబరు 2 వరకు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని టీటీడీ అదనపు ఈవో వెంకయ్యచౌదరి అధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక అన్నమయ్య భవనంలో ముందస్తు ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించి, కీలక నిర్ణయాలు తీసుకున్నారు. విభాగాల వారీగా అధికారులకు దిశానిర్దేశం చేశారు.
కీలక నిర్ణయాలు:
- బ్రహ్మోత్సవ రోజుల్లో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, ప్రొటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలు, వృద్ధులు, దివ్యాంగులు, చంటి పిల్లల తల్లిదండ్రులు, ఎన్ఆర్ఐలు, దాతల కోటాలో దర్శనాలకు అనుమతి ఉండదు.
- దర్శన క్యూ లైన్లు, మాడ వీధుల్లోని గ్యాలరీలు, ముఖ్యమైన ప్రాంతాలలో అన్నప్రసాదాల పంపిణీ, లడ్డూల నిల్వను పెంచుకోవడం.
- వివిధ సేవలకు శ్రీవారి సేవకులుగా యువతీ, యువకులకు ఆహ్వానం
- సెప్టెంబర్ 28న గరుడ వాహన సేవ నిర్వహించనుండటంతో, ఆ నెల 27 నుంచి 29 వరకు తిరుమల ఘాట్ రోడ్లలో ద్విచక్ర వాహనాలకు అనుమతి నిరాకరణ.
బ్రహ్మోత్సవాల వివరాలు :
- బ్రహ్మోత్సవాలకు ముందే సెప్టెంబరు 16న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం.
- సెప్టెంబరు 23న బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ, 24 న ధ్వజారోహణం.
- అక్టోబరు 1న రథోత్సవం, 2న చక్రస్నానం.
- ప్రతిరోజూ ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు, అదే విధంగా సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు వాహన సేవలు అందుబాటులో ఉంటాయి.


