”లంకా దహనం చేసిన హనుమంతుడే మాకు ఆదర్శం. మనపైకి వచ్చే శత్రుమూకలను వదిలిపెట్టకూడదు . గట్టిగ బుద్ధి చెప్పాలి . . అన్న ఉద్దేశ్యంతోనే పాక్ పై మనం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ . .. ” అని రక్షణశాఖ మంత్రి రాజ్ నాధ్ సింగ్ చెప్పుకొచ్చారు . మన అమాయక పౌరులను చంపిన వారినే మట్టుబెట్టామని, సాధారణ పౌరులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అత్యంత జాగరూకతతో ఈ దాడులు నిర్వహించామని చెప్పారు. మన సైనికులు అద్భుత పరాక్రమం ప్రదర్శించారని కొనియాడారు.
హనుమంతుడే ఆదర్శం!
అంతేకాకుండా, సైన్యం మానవత్వంతో వ్యవహరించిందని, పౌరులకు ఎలాంటి నష్టం జరగకుండా చూసుకోవడంలో భారత సాయుధ దళాలు జాగ్రత్త ఉన్నాయన్నారు. యావత్ దేశం తరపున సైనికులు, అధికారులను అభినందిస్తున్నట్లు చెప్పారు. సాయుధ దళాలకు మద్దతు ఇచ్చినందుకు ప్రధాని మోదీకి కేంద్ర మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. అశోక వనానికి వెళ్ళేటప్పుడు హనుమంతుడు అనుసరించిన సూత్రాన్ని ఈ దాడిలో తాము అనుసరించినట్లు రాజ్నాథ్ చెప్పారు. తమ అమాయక ప్రజలను చంపిన వారిని మాత్రమే తాము లక్ష్యంగా చేసుకున్నట్లు రక్షణ మంత్రి అన్నారు. తన గడ్డపై జరిగిన దాడికి ప్రతిస్పందించే హక్కును భారత్కు ఉందని రాజ్నాథ్ చెప్పారు.
. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO) మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆయన ‘ఆపరేషన్ సిందూర్’కు ఆర్మీకి పూర్తి స్వేచ్ఛనిచ్చిన ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మార్గదర్శకత్వంలో భారత సాయుధ దళాలు అందరినీ గర్వపడేలా చేశాయని రక్షణ మంత్రి అన్నారు. నిన్న రాత్రి భారత సాయుధ దళాలు తమ శౌర్యం, ధైర్యాన్ని ప్రదర్శించి కొత్త చరిత్రను సృష్టించాయన్నారు. భారత సాయుధ దళాలు కచ్చితత్వం, అప్రమత్తతతో వ్యవహరించాయని నిర్దేశించిన లక్ష్యాలను సరైన సమయంలో కచ్చితత్వంతో నాశనం చేశాయన్నారు.