తెలుగు రాష్ట్రాలలో రాజకీయ నేతల ప్రమాణాలకు ప్రసిద్ధి
.
హిందూ సంప్రదాయంలో వినాయకుడు సకల దేవతాగణములకు అధిపతి.. ఏ కార్యం తలపెట్టినా.. ప్రధమంగా విఘ్న నాయకుడి ఆశీస్సులతోనే ఆరంభం కావాలి. ఇది యుగయుగాలుగా వస్తున్న సంప్రదాయం.
శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువై ఉన్న తిరుపతికి అరవై కిలోమీటర్ల దూరంలో ప్రసిద్ద పుణ్యక్షేత్రం ఉంది. అదే కాణిపాకం.. ఇక్కడ విజ్ఞేశ్వరుడు స్వయంగా వెలిసాడని పురాణాలు చెబుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో ఉన్న కాణిపాకం గ్రామంలో ఉన్న గణపతి ఆలయం 11వ శతాబ్దం ప్రారంభంలో చోళ రాజు కులోత్తుంగ చోళ I స్థాపించాడు మరియు 1336లో విజయనగర రాజవంశ చక్రవర్తులు దీనిని మరింతగా అభివృద్ధి చేశారు.
కాణిపాకం అనే పేరు రావడానికి దాని వెనుక ఓ పురాణ గాధ ప్రాశ్చత్యములో ఉంది.
ఒక గ్రామంలో .. మూగ, చెవిటి, గుడ్డివారు అయిన ముగ్గురి అన్నదమ్ముల ఉండేవారు. వారి వ్యవసాయ బావిలో నీరు ఎండిపోవడం గమనించి బావిని ఇంకొద్దిగా తవ్వితే నీళ్లు వస్తాయని తవ్వడం మొదలు పెట్టగా అక్కడ గట్టి రాయి తగిలి క్షణాలలో బావిలో రక్తం ఊరటం మొదలైంది. కొద్దీ కొద్దిగా బావి నిండుతుంది. ఆ ముగ్గురు అన్నదమ్ములు ఏమైందో అని గమనించగ బావిలో వినాయకుడి విగ్రహం కనిపించింది. వారు ఆ విగ్రహాన్ని పూజించగా వారి యొక్క అవటితనం తొలగి మామూలు మనుషులుగా మారారు. ఆ విషయం గ్రామస్తులకు తెలిసి ఆ విగ్రహాన్ని పూజించడం మొదలు పెట్టారు. అలా భక్తులు కొట్టిన కొబ్బరి కాయల నీరు ఒకటి మరియు పావు ఎకరము అంత విస్తీర్ణము పారింది దానితో ఆ స్థలానికి “కాణిపరకం ” అనే తమిళ పేరు వచ్చింది, రాను రాను ఇది “కాణిపాకం” గా మారిందని ఓ కథ ప్రచారంలో ఉంది.
ఆలయ ప్రత్యేకతలు ♦ ఇక్కడ స్వామివారి విగ్రహం నీటిలో కొద్దిగా మునిగి ఉంటుంది. ఎంత త్రవ్వినా స్వామివారి తుది మాత్రం కనుగొనలేకపోయారు. ఇక్కడి వినాయకడి పరిమాణం పెరుగుతూ ఉంటుంది. ♦ స్వామివారికి అష్టోత్తర పూజలతో నిత్యం పూజలు చేస్తారు. ♦ వినాయక చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ♦ ఈ ఆలయంలో ఎల్లప్పుడూ ఒక సర్పం తిరుగుతూ ఉంటుంది. కానీ అది ఎవరికీ హాని చేయదు. ♦ సత్యానికి మారుపేరుగా కాణిపాక వినాయకుడి పేరును చెబుతూ ఉంటారు. అందుకే అక్కడ ఏదైనా సమస్య వచ్చినప్పుడు తప్పు చేసిన వ్యక్తిని ఆలయం ముందు ఉన్న నీటిలో స్నానం చేయిస్తే తప్పు ఒప్పుకొంటాడు అని ప్రసిద్ధి..
నమ్మశక్యం కాని వాస్తవాలు
. కాణిపాకం వినాయకుడి దైవిక ప్రతిమ అనేక అద్భుతాలకు నిలయం. కాలక్రమేణా విగ్రహం పరిమాణం పెరుగుతోందని చెబుతారు. ప్రస్తుతం, విగ్రహం యొక్క మోకాలు మరియు ఉదరం మాత్రమే కనిపిస్తాయి. వాస్తవానికి సాక్ష్యం దాదాపు యాభై సంవత్సరాల క్రితం తీవ్రమైన భక్తులలో ఒకరు విగ్రహానికి సమర్పించిన వెండి కవచం (కవచం), ఇది నేటి విగ్రహానికి సరిపోదు!
. కాణిపాకం యొక్క గణపతి యొక్క స్వయం-వ్యక్తీకరించబడిన విగ్రహం స్వయంభూ. ఆసక్తికరంగా, చాలా మంది చాలా కాలంగా ఆలయ చెరువులోని పవిత్ర జలాల్లో మునిగి దేవత విగ్రహం ముందు ప్రమాణం చేయడం ద్వారా పరస్పర కలహాలను పరిష్కరించడానికి ఆలయాన్ని సందర్శిస్తున్నారు. పవిత్ర స్నానం చేసిన వెంటనే మరియు “న్యాయస్థానం” లేదా ఆలయం లోపలి గదులలోకి అడుగుపెట్టే ముందు కూడా పాపి తన తప్పులను అంగీకరించిన సందర్భాలు ఉన్నాయి.
సత్యప్రమాణాలకు ప్రసిద్ధి..
అబద్దమ్ చెప్పకుండా నిజాలు చెప్పడానికి వరసిద్ధి వినాయకుడి ముందుకు వస్తారు. ప్రముఖంగా రాజకీయ నాయకులు ‘సత్య ప్రమాణాలు’ ఇక్కడ ఎక్కువ చేస్తుంటారు. 2014-2019 మధ్య కాలంలో మంత్రిగా పనిచేసిన బీజేపీ నేత, ప్రస్తుత కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్.. తన హయాంలో రూపాయి కూడా అవినీతికి పాల్పడలేదని ‘కాణిపాకం వినాయకుడు ముందు ప్రమాణం చేసి అప్పట్లో సంచలనం సృష్టించారు.
ఇక్కడ ఇష్టమైన వాటిని వదిలేస్తే మనం కోరుకున్నది స్వామి వారు తీరుస్తారని భక్తుల నమ్మకం ♦ స్వామి వారి ఆలయానికి ఈశాన్య దిశలో వరదరాజ స్వామి ఆలయం కూడా ఉంది. ♦ బస్సు సౌకర్యములు తిరుపతి నుండి ప్రతి 15 నిమిషములకు ఒక బస్సు ఉంది. చిత్తూరు నుండి ప్రతి 10 నిముషాలకు ఒక బస్సు ఉంది. చంద్రగిరి నుండి కూడా జీపులు, వ్యానులు, ట్యాక్సీలు మొదలగునవి లభించును. రైలు సౌకర్యములు: ఆంధ్రప్రదేశ్ ఏమూల నుండి అయిననూ చిత్తూరుకు లేదా రేణిగుంట లేదా గూడూరు లకు రైళ్ళు ఉన్నాయి. ఈ ప్రదేశాల నుండి బస్సు ద్వారా సులభముగా కాణిపాకం చేరవచ్చు. 10 కిలోమీటర్ల పరిధిలో అంతే కాకుండా రేణిగుంట విమానాశ్రయం కూడా కలదు.