భారత్ (India) తో స్కూటర్ల వినియోగం రోజురోజుకి పెరుగుతుంది. పెరిగిన డిమాండ్ ప్రకారం కంపెనీలు కూడా సరికొత్త మోడళ్ల (New Models) ను మార్కెట్ లోకి తీసుకొస్తున్నాయి. దాంతో పాటుగా పాత మోడళ్లను టెక్నాలజీ సాయంతో అప్ డేట్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే టీవీఎస్ మోటార్స్ (TVS Motors) కొత్త స్కూటీని లాంచ్ చేసింది. అదే టీవీఎస్ జూపిటర్ 110.
టీవీఎస్ జూపిటర్ 110 (Jupiter 110) ఫస్ట్ ఇన్ సెగ్మంట్ మరియు నెక్ట్స్ జెన్ ఇంజన్ -ఫ్యూచరిస్టిక్ ఫీచర్లతో రూపొందించబడింది. దీని ఎక్స్ షోరూమ్ (Ex-showroom) ధర రూ.73,700 గా ఉంది. కాగా ఈ స్కూటీ టీవీఎస్ మోటార్ డీలర్ షిప్ లలో డ్రమ్, డ్రమ్ అల్లాయ్, డ్రమ్ ఎస్ఎక్సీసీ మరియు డిస్క్ ఎస్ఎక్స్సీ అనే వేరియంట్లలో అందుబాటులో ఉండనుంది.
మెరుగైన ఇంధన సామర్థ్యం కలిగి ఉన్న టీవీఎస్ జూపిటర్ బ్రాండ్ కు వినియోగదారుల నుంచి మంచి స్పందన వస్తోంది. టీవీఎస్ 2013లో ప్రారంభమైన జూపిటర్ విక్రయాలు 6.5 మిలియన్ యూనిట్లుగా ఉందని తెలుస్తోంది. కాగా ఇందులో 110 సీసీ మరియు 125 సీసీ వెర్షన్లు (Versions) ఉన్నాయి. ప్రస్తుతం 2024 జూపిటర్ 110 ఫేస్ లిఫ్ట్ ఇతర 110 సీసీ,యాక్టివా మరియు హీరో ప్లెజర్ తో పోటీ పడుతుంది.