హైదరాబాద్‌‌లో రియల్‌ ఎస్టేట్‌..మరో ఐదేళ్లు ఇంతే,,

Abhi Correspondent

వాస్తవ పరిస్థితులకు భిన్నంగా 200, 300 శాతం ధరలు కృత్తిమంగా పెంచేసి హైప్ చేసిన మార్కెట్లు ఎప్పటికైనా కిందకు దిగి వాస్తవ ధరలకు రావలిసి0దే కదా . …

రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఎక్కడ వెనక్కి తిరిగి చూడలేదు. అయితే గత పాలకులు కేసీఆర్, కెటిఆర్ వంటి వారి స్వార్ధ్య ప్రయోజనాల కోసం ఉన్న ధరలకు హెచ్చు చూపించడం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మెడకు ఉరితాడు పడినట్లయింది .

హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం నాలుగైదేళ్లుగా నేల చూపులు చూస్తోంది. ఇటీవల వరకు దూసుకుపోయిన మార్కెట్ రానున్న రోజుల్లో ఎటువంటి పెరుగుదల చూపే అవకాశం లేదని రియల్ ఎస్టేట్ వర్గాలు చెబుతున్నాయి. ఏళ్ళ తరబడి స్థిరమైన వృద్ధిని సాధించిన హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం ప్రస్తుతం దీర్ఘకాలిక మందగమన సంకేతాలను చూపుతోంది.ప్రస్తుతానికి ధరల పెరుగుదల రోజులు నగరంలో ముగిసిపోవచ్చని పరిశ్రమ వర్గాలు హెచ్చరిస్తున్నాయి.రాబోయే ఐదు నుండి ఆరు సంవత్సరాలలో, ధరల పెరుగుదల స్థిరంగా ఉంటుందని వార్షిక వృద్ధి కేవలం 3-7%గా ఉంటుందని అంచనా వేశాయి పరిశ్రమవర్గాలు.

హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో ప్రస్తుతం ఊపు రాకపోవడానికి ప్రధాన కారణాల్లో ఒకటి వాస్తవ ధరలతో పోలిస్తే మార్కెట్ ధర చాలా ఎక్కువ . . ఇప్పటికే అత్యధిక రేట్ల స్థాయికి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ చేరుకుంది. వచ్చే ఐదేళ్ల తర్వాత ఎంత విలువ ఉంటుందో ముందే అంచనా వేసుకున్న బిల్డర్లు ఇప్పుడే ఆ ధరకు విక్రయాలు ప్రారంభించారు. అందుకే హైదరాబాద్ నగరంలో రియల్ ధరలు అనూహ్యంగా పెరిగిపోయాయి.ఈ నేపథ్యంలో ధరలు కొంత కాలం స్థిరంగా ఉండటం ఖాయంగా కనిపిస్తోంది.

మరొక కీలకమైన అంశం ఏంటంటే.. కీలకమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులలో జాప్యం జరగడం. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రీజినల్ రింగ్ రోడ్ (RRR), మెట్రో రైలు విస్తరణ – రెండూ నగరం యొక్క కనెక్టివిటీ, నివాసయోగ్యతకు గేమ్-ఛేంజర్‌లుగా ప్రచారం చేయడం ప్రభావం చూపుతోంది. ఈ ప్రాజెక్టులు పూర్తి కాకుంటే 2026 తర్వాత వాణిజ్య రియల్ ఎస్టేట్ రంగంలో హైదరాబాద్ తన ఊపును కొనసాగించడానికి ఇబ్బంది పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.కీలకమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను వేగంగా, సమర్థవంతంగా అమలు చేయకపోతే, జాతీయ రియల్ ఎస్టేట్ రంగంలో హైదరాబాద్ తన ప్రాధాన్యత కోల్పోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

హైదరాబాద్ నగరంలో గతేడాది 32,974 యూనిట్లు విక్రయించారని.. 1.56 కోట్ల చదరపు అడుగుల ఆఫీస్‌ స్పేస్‌ లావాదేవీలు జరిగాయని నైట్‌ఫ్రాంక్‌ ఇండియా తాజా నివేదిక తెలిపింది . ప్రస్తుతం సిటీలో అపార్ట్‌మెంట్ల సగటు ధర చ.అ.కు రూ.6000 గా ఉంది. ఏడాదిలో అపార్ట్‌మెంట్ల ధరలు దాదాపు 9 శాతం మేర పెరిగాయి. గతేడాది సిటీలో 44,013 యూనిట్లు మొదలయ్యాయి . అంతకు క్రితం ఏడాదితో పోలిస్తే 6 శాతం తగ్గాయి. హైడ్రా దూకుడు వ్యవహారంతో కొత్త గృహాల ప్రారంభానికి డెవలపర్లు ఆచితూచి వ్యవహరించడంతో లాంచింగ్స్‌లో క్షీణత నమోదయినట్లుగా తెలుస్తోంది. ఇదే పరిస్థితి మరో ఐదారేళ్ళ ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు .

You May Also Like…