Bharat Bandh: దేశవ్యాప్తంగా భారత్ బంద్ ప్రభావం.. !!

Bharat Bandh: ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల (SC, ST Reservations) లో ఉపకులాల వర్గీకరణకు భారత అత్యున్నత న్యాయస్థానం అనుకూలంగా ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ మాల మహానాడు, ఎస్సీ వర్గీకరణ పోరాట సమితి బంద్ (Bandh) కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో యావత్ దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారత్ బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. అయితే ఆగస్ట్ ఒకటోవ తేదీన సుప్రీంకోర్టు (Supreme Court) ఎస్సీ, ఎస్టీలను ఉప కులాలుగా విభజించేందుకు గ్రీన్ సిగ్నల్ (Green Signal)ఇచ్చింది. ఈ క్రమంలో రిజర్వేషన్లపై ధర్మాసనం ఇచ్చిన తీర్పును సవాల్ చేయడంతో పాటు దాన్ని వెనక్కి తీసుకోవడమే లక్ష్యంగా భారత్ బంద్ కు పిలుపునిచ్చామని మాల మహానాడు, ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి తెలిపింది. బంద్ నేపథ్యంలో పలు ప్రాంతాల్లో శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా ఉండేందుకు పోలీసులు పటిష్టమైన భద్రత (Strong security) ను ఏర్పాటు చేశారు. ఇక ఈ బంద్ కు ఏపీ, తెలంగాణ (AP and Telangana) రాష్ట్రాల్లోని ప్రజా సంఘాలు మద్ధతు తెలిపాయి. అదేవిధంగా ప్రభుత్వ మరియు ప్రైవేట్ విద్యాసంస్థలు, వాణిజ్య వ్యాపార సంస్థలు బంద్ కు స్వచ్ఛంధంగా సహకరిస్తున్నాయి.