Telangana: కొత్త రెవెన్యూ చట్టంపై తెలంగాణ సర్కార్ ప్రకటన.!!

తెలంగాణ (Telangana) లో అతి త్వరలో రెవెన్యూ చట్టం అమల్లోకి రానుందని తెలుస్తోంది. గత ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణి పోర్టల్ (Dharani Portal) వలన రాష్ట్రంలోని ప్రజలు, రైతులు అందరూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కాంగ్రెస్ మంత్రులు, నేతలు చెబుతున్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే తాజాగా కొత్త రెవెన్యూ చట్టం (New Revenue Act
) డ్రాఫ్ట్ బిల్లుపై తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ (Telangana Revenue Employees Services Association) నిర్వహించిన సమావేశానికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Minister Ponguleti ) హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చట్టాలు సరిగ్గా పని చేయకపోతే కలిగే నష్టాలకు గతంలోని ప్రభుత్వం తెచ్చిన 2020 రెవెన్యూ చట్టమే ఉదాహరణ అని పేర్కొన్నారు. అయితే తాము మాత్రం ఆలస్యమైనా సరైన చట్టాన్ని రూపొందిస్తున్నామని చెప్పారు. ప్రజాభిప్రాయాలను స్వీకరించి డ్రాప్టును పబ్లిక్ డొమైన్ (Public domain) లో పెడతామని తెలిపారు. ఆ దిశగానే కాంగ్రెస్ సర్కార్ అడుగులు వేస్తోందని వెల్లడించారు.

రెవెన్యూ వ్యవస్థను రూపొందించడమే కాకుండా కాపాడే విషయంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వాని (Congress Government) కి పూర్తి స్పష్టత ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. రెవెన్యూ గ్రామాల్లో రెవెన్యూ వ్యవస్థను తెస్తామన్న ఆయన రెవెన్యూ కోర్టుల ( Revenue Courts) ను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ మేరకు త్వరలోనే రెవెన్యూ ఉద్యోగ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేస్తామని తెలిపారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురానున్న కొత్త రెవెన్యూ చట్టం ఏ విధంగా ఉండనుంది? అన్నది తెలియాల్సి ఉంది.