అరకు ట్రైబల్ స్టూడెంట్స్ వరల్డ్ రికార్డ్

అరకు ట్రైబల్ స్టూడెంట్స్ వరల్డ్ రికార్డ్

అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లా అరకు, పరిసర గురుకుల పాఠశాల విద్యార్థులు అరుదైన ప్రపంచ రికార్డు సాధించారు .  ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని.. ఒకేసారి 21,850 మంది గిరిజన బాలబాలికలు 108 సూర్య నమస్కార ఆసనాలతో చరిత్ర సృష్టించారు. రాజమండ్రికి చెందిన ప్రముఖ యోగ గురువు పతంజలి శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో సోమవారం అల్లూరి జిల్లా అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించిన ఈ ప్రదర్శన ఈ వరల్డ్ రికార్డ్ కి వేదికయింది . లండన్‌ నుంచి వచ్చిన ప్రపంచ రికార్డు యూనియన్‌ మేనేజర్‌ అలీస్‌ రేనాడ్‌ కార్యక్రమాన్ని పరిశీలించి ప్రపంచ రికార్డుగా నమోదు చేశారు. రికార్డు ధ్రువీకరణ పత్రాన్ని కలెక్టర్‌ దినేశ్‌కుమార్‌కు అందజేశారు. యోగ గురువు పతంజలి శ్రీనివాస్ . .. గిరిజన విద్యార్థులకు దశాబ్ద కాలంగా యోగలో శిక్షణ ఇస్తున్నారు. శ్రీనివాస్ నిస్వార్ధ సేవలకు గాను కలెక్టర్ . . దినేష్ ఎక్కడికి బదిలీ అయినా . . ఆయా ప్రాంతాలలో గిరిజనులకు శ్రీనివాస్ సేవలు వినియోగిస్తున్నారు .

‘అదుర్స్ – 2’ ఎన్టీఆర్ ఎందుకు నో చెప్పాడు

‘అదుర్స్ – 2’ ఎన్టీఆర్ ఎందుకు నో చెప్పాడు

ఇమేజ్ కోసమా ? అప్పటి కామెడీని కంటిన్యూ చేయడంపై భయమా ?

టాలీవుడ్ లో ఏ కేరెక్టర్ అయినా ఇట్టే ఒదిగిపోగల నటుడు జూనియర్ ఎన్టీఆర్ . తాను పోషించిన పాత్రకు 100 శాతం న్యాయం చేయగల అరుదైన నటులలో ముందువరసలో ఉంటారు తారక్. అయినా అదుర్స్ సీక్వల్ ఎందుకు చేయనంటున్నారు ఈ యాక్టర్.

”అన్ని కేరెక్టర్ లలోకి కామెడీ చేయడమే కష్టం. అందునా అదుర్స్ లో చేసిన కామెడీ ఇప్పుడు చేయాలంటే నాకు భయంగానే ఉంది. మళ్ళీ ఆ టెంపో వస్తుందో లేదో అన్న ఆందోళన ఉంది . అందుకే అదుర్స్ – 2 చేయనని చెపుతున్నాను . చేయనంటే .. ఇప్పట్లో చేయనని చెపుతున్నాను . ..” అని ఇటీవల ఓ సినిమా ఫంక్షన్ లో చెప్పుకొచ్చారు జూనియర్. ఔన్ మరి అతను చెప్పింది నిజమే . .. అప్పట్లో అదుర్స్ లో ఎన్టీఆర్ , బ్రహ్మనందం కాంబినేషన్ కూడా అంతలా అదిరింది. ఒక విధంగా చెప్పాలంటే జూనియర్ అప్పట్లోనే ప్రయోగం చేశారనే చెప్పాలి . అంతకు ముందు సింహాద్రి వంటి వయొలెన్స్ సినిమాలు చేసి . .. సడన్ గా పూర్తీ స్థాయి హాస్య ప్రధాన పాత్ర చేయడం సాహసమే . అందునా తెలుగులో ఇలాంటి ప్రయోగాలు పొరపాటున వికటిస్తే ఇక సదరు ప్రయోగం చేసిన నటుడి కెరీర్ దాదాపు క్లోస్ అనే చెప్పాల్సి ఉంటుంది . ఆంత సాహసం చేసినందుకే జూనియర్ కి ఇప్పటికీ అదుర్స్ ఒక మైలురాయిలా మిగిలిపోయింది .

క్షణాల్లో రూ.20లక్షల కోట్లు ఆవిరి!

క్షణాల్లో రూ.20లక్షల కోట్లు ఆవిరి!

సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో కుప్పకూలిపోయాయి. ట్రంప్ ప్రతీకార సుంకాలు విధిస్తూ వాణిజ్య యుద్ధాన్ని ప్రకటించడంతో, చైనా కూడా రివెండ్ టారిఫ్స్‌తో ఎదురుదాడి చేసింది. దీనితో వాణిజ్య యుద్ధ భయాలు మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ఫలితంగా మదుపరుల సంపద సోమవారం మార్కెట్ ఓపెన్ అయిన నిమిషాల వ్యవధిలోనే .. ఏకంగా రూ.20 లక్షల కోట్ల మేర ఆవిరైంది.

  • ఈ సెషన్స్ లో టాటా మోటార్స్‌ షేర్లు భారీగా నష్టపోయాయి. వాస్తవానికి అమెరికాలోకి దిగుమతి అయ్యే ఆటోమొబైల్‌ ఉత్పత్తులపై 25% సుంకం విధిస్తామని ట్రంప్‌ ప్రకటించిన రోజే ఈ కంపెనీ షేర్లు కుదేలయ్యాయి . ఈ నేపథ్యంలోనే టాటా మోటార్స్‌కు చెందిన జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌ అమెరికాకు ఎగుమతులను నిలిపివేసిందన్న వార్తలు రావడంతో టాటా మోటార్స్ షేర్లు ఇంట్రాడేలో 10 శాతం మేర క్షీణించి రూ.552 వద్ద లోయర్‌ సర్క్యూట్‌ను తాకాయి.
  • టాటాలకు చెందిన రిటైల్‌ సంస్థ ట్రెంట్‌ షేర్లు కూడా నేడు భారీగా నష్టపోయాయి. ఇంట్రాడేలో కంపెనీ షేర్లు 19.2 శాతం పతనమై రూ.4,491 వద్ద కనిష్ఠాన్ని తాకాయి. 2020 మార్చి తర్వాత కంపెనీ షేర్లు ఈ స్థాయిలో పతనం కావడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.
  • అలాగే టాటా గ్రూపునకు చెందిన టీసీఎస్‌, టాటా స్టీల్‌, టాటా మోటార్స్‌, టైటాన్‌ కంపెనీ, టాటా కన్జూమర్‌ ప్రొడక్ట్స్‌, ట్రెంట్‌ కంపెనీ షేర్లు అమ్మకాల ఒత్తిడి కారణంగా, మొత్తంగా రూ.1.28 లక్షల కోట్ల మార్కెట్‌ విలువను కోల్పోయాయి.

చివరికి బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్‌ 2,226 పాయింట్లు నష్టపోయి 73,137 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 742 పాయింట్లు కోల్పోయి 22,161 వద్ద ముగిసింది. ఇంత దారుణమైన పతనంలోనూ కొన్ని షేర్స్ లాభపడ్డాయి .

  • లాభపడిన షేర్లు : హిందూస్థాన్ యూనిలివర్‌
  • నష్టపోయిన షేర్లు : టాటా స్టీల్‌, ఎల్ అండ్ టీ, టాటా మోటార్స్‌, కోటక్ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌, యాక్సిస్ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, అదానీ పోర్ట్స్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, భారతీ ఎయిర్‌టెల్‌, రిలయన్స్‌, ఎస్‌బీఐ, సన్‌ఫార్మా, టైటాన్‌, టీసీఎస్‌.
  •  కేంద్రం పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని ఒక్కొక్కటి రూ. 2 చొప్పున పెంచుతున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నిర్ణయం భారతదేశంలోని ప్రధాన చమురు మార్కెటింగ్ కంపెనీల (OMCలు) షేర్ ధరలలో గణనీయమైన తగ్గుదలకు దారితీసింది. కీలకమైన OMCలు, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (BPCL), హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ (HPCL), దేశవ్యాప్తంగా పెట్రోలియం ఉత్పత్తుల రిటైల్ మార్కెటింగ్, పంపిణీకి ప్రధాన భూమిక వహిస్తాయి. ఈ ప్రకటన తర్వాత, ఆయా ఆయిల్ కంపెనీల స్టాక్ ధరలు భారీగా తగ్గాయి
  • ఏయే కంపెనీలు ఏ మేరకు తగ్గాయి:
వీటిని ఫ్రై చేసుకుని తింటున్నారా? – క్యాన్సర్​ వచ్చే!

వీటిని ఫ్రై చేసుకుని తింటున్నారా? – క్యాన్సర్​ వచ్చే!

డీప్​ ఫ్రై చేసిన ఆహారాలు అంటే విపరీతమైన ఇష్టమా? అయితే మీ హెల్త్ డేంజర్ లో ఉన్నట్లే

బాగా ఫ్రై చేసిన కొన్ని పదార్థాలను తినడం వల్ల క్యాన్సర్ వచ్చే ముప్పు సాధారణం కంటే రెట్టింపు ఉందని హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలోనే కొన్ని పదార్థాలను ఎక్కువగా ఫ్రై చేసి తీసుకోకూడదని వివరిస్తున్నారు శాస్త్రవేత్త లు .

చికెన్ : చికెన్ , మీట్ ( మాంసాన్ని )ఎక్కువ సేపు ఫ్రై చేయడం వల్ల అందులో క్యాన్సర్ కారకాలు ఉత్పత్తి అవుతాయని నిపుణులు సెలవిస్తున్నారు . ఎక్కువ ఉష్ణోగ్రతల వద్ద మాంసాన్ని వండినప్పుడు, హెటెరోసైక్లిక్ అమైన్స్ (HCAs), పాలీసైక్లిక్ ఆరోమాటిక్ హైడ్రోకార్బన్స్ (PAHs) అనే రసాయనాలు ఏర్పడతాయని అంటున్నారు. ఈ రసాయనాలు DNA ను దెబ్బతీసి క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి . ప్రాసెస్ చేసిన మాంసాన్ని ఎక్కువ ఉష్ణోగ్రతల వద్ద వేయించడం వల్ల క్యాన్సర్​కు కారకమయ్యే కార్సినోజెన్స్ అనే రసాయానాలు ఉత్పత్తి అవుతాయని హెచ్చరిస్తున్నారు. అందుకే తక్కువ ఉష్ణోగ్రత వద్ద మాంసాన్ని కుక్​ చేసుకోవాలని సూచిస్తున్నారు .

ఆలూ చిప్స్ : బంగాళదుంపలు : ఇటీవల కాలంలో యూత్ చిప్స్ అంటే ఎక్కువగా ఇష్టపడుతున్నారు . వీరిని చూసి చిన్నారులు కూడా చిప్స్ పై మోజు పెంచుకుంటున్నారు . సైడ్​ డిష్​గా, స్నాక్స్​గా వీటిని తింటుంటారు. అయితే, బంగాళ దుంపలను చాలా సేపు అధిక ఉష్ణోగ్రతల వద్ద నూనెలో వేయించడం వల్ల హానీకారక అక్రిలైమైడ్ అనే రసాయనం ఉత్పత్తి అవుతుందని, ఫలితంగా క్యాన్సర్​కు దారితీస్తుందని తెలుపుతున్నారు. అందుకే చిప్స్ కాకుండా వీటిని ఉడకబెట్టడం లేదా బేక్ చేసుకుని తినాలని సూచిస్తున్నారు.

బ్రెడ్ :  చాలా మంది బ్రెడ్​తో ఆమ్లెట్, టోస్ట్ లాంటి రకరకాల వంటకాలు ఇష్టపడుతుంటారు . బ్రేడ్ ఎక్కువ ఉష్ణోగ్రతల వద్ద వేడి చేయడం వల్ల క్యాన్సర్ కారక అక్రిలైమైడ్ ఉత్పత్తి అవుతుందని చెపుతున్నారు . అందుకే మరీ ఎక్కువగా కాకుండా తక్కువ ఉష్ణోగ్రతల వద్ద కాల్చుకోవాలని లేదా బేక్ చేసుకోవాలని సూచిస్తున్నారు.

సూచన : అభి న్యూస్ అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసమే . శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని ఇచ్చాము . అభి న్యూస్ హెల్త్ శీర్షికను ఫాలో అయ్యే వారు తమ సొంత వైద్యులు , డైటీషియన్స్ సలహా ప్రకారం ఆహారపు అలవాట్లలో మార్పులు, చేర్పులు చేసుకోవాలని మనవి .

చూయింగ్ గమ్ ‘ప్లాస్టిక్’ డేంజర్..

చూయింగ్ గమ్ ‘ప్లాస్టిక్’ డేంజర్..

ఒక కొత్త అధ్యయనం ప్రకారం, ఒక్క చూయింగ్ గమ్ ముక్క వందల నుండి వేల వరకు మైక్రోప్లాస్టిక్ కణాలను లాలాజలంలోకి విడుదల చేస్తుంది, ఇది నమలడం వల్ల కలిగే ప్రమాదాన్ని మరియు దీర్ఘకాలిక ఆరోగ్య ప్రభావాలను తెలుసుకోండి.

చూయింగ్ గమ్ నమిలి . . దానిని బుడగలా ఊది.. సరదా పడటం మనందరికీ తెలిసిన విద్య . . అయితే ఇక అలాంటివాటికి దూరంగా ఉండాల్సిన పరిస్థితి తలెత్తింది .

 UCLA నుండి వచ్చిన తాజా అధ్యయనం ప్రకారం.., ”చూయింగ్ గమ్ మైక్రోప్లాస్టిక్‌లకు ఊహించని మూలం కావచ్చు. ఒకే ముక్క లాలాజలంలోకి 3,000 ప్లాస్టిక్ కణాలను విడుదల చేయగలదు . . ” అని ఇటీవల పరిశోధకులు కనుగొన్నారు, సింథటిక్ మరియు సహజ చిగుళ్ళు రెండూ ఒకే విధమైన ఫలితాలను చూపుతాయి. ఆరోగ్య ప్రభావం ఇంకా అస్పష్టంగా ఉంది, దీనిపై మరింత లోతైన పరిశోధన చేస్తే మరిన్ని ప్రమాదకర పరిణామాలు వెలుగులోకి వస్తాయని చెపుతున్నారు .

ఆధునిక జీవితంలో ప్లాస్టిక్ ఒక అనివార్యమైన భాగంగా మారింది, గృహోపకరణాల నుండి వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తుల వరకు ప్రతిదానిలోనూ ఇది కనిపిస్తుంది.కటింగ్ బోర్డులు, సింథటిక్ దుస్తులు మరియు శుభ్రపరిచే స్పాంజ్‌లు వంటి రోజువారీ వస్తువులు మైక్రోప్లాస్టిక్‌లు అని పిలువబడే సూక్ష్మ ప్లాస్టిక్ ముక్కలను విసర్జిస్తాయి, ఇవి పీల్చడం, తినడం లేదా చర్మాన్ని తాకడం ద్వారా మన శరీరంలోకి ప్రవేశించగలవు.

“మా లక్ష్యం ఎవరినీ భయపెట్టడం కాదు” అని లాస్ ఏంజిల్స్ (UCLA)లోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో ప్రాజెక్ట్ యొక్క ప్రధాన పరిశోధకుడు మరియు ఇంజనీరింగ్ ప్రొఫెసర్ సంజయ్ మొహంతి తన పరిశోధన ఫలితాలను వివరిస్తూ ఒక ప్రకటనలో తెలిపారు.

చూయింగ్ గమ్‌లు రబ్బరు బేస్, స్వీటెనర్లు, సువాసనలు మరియు ఇతర పదార్థాలతో కూడి ఉంటాయి. సహజ గమ్ ఉత్పత్తులు సరైన నమలడం సాధించడానికి చికిల్ లేదా ఇతర చెట్టు రసం వంటి మొక్కల ఆధారిత పాలిమర్‌ను ఉపయోగిస్తాయి, అయితే మరికొన్ని పెట్రోలియం ఆధారిత పాలిమర్‌లతో తయారు చేయబడిన సింథటిక్ రబ్బరు బేస్‌లపై ఆధారపడతాయి.

సింథటిక్ గమ్‌లలో బేస్ ఒక రకమైన ప్లాస్టిక్ కాబట్టి వాటిలో చాలా ఎక్కువ మైక్రోప్లాస్టిక్‌లు ఉంటాయని మా ప్రారంభ పరికల్పన,” అని UCLAలో అండర్ గ్రాడ్యుయేట్ ఇంటర్న్‌గా ప్రాజెక్ట్‌ను ప్రారంభించి పరిశోధనను సమర్పించిన లోవ్ అన్నారు.

గమ్ దేనితో తయారు చేయబడింది

ఆహారం, పానీయాలు, ప్లాస్టిక్ ప్యాకేజింగ్, పూతలు మరియు తయారీ ప్రక్రియల ద్వారా మానవులు ప్రతి సంవత్సరం పదివేల మైక్రోప్లాస్టిక్‌లను – 1 మైక్రోమీటర్ నుండి 5 మిల్లీమీటర్ల వెడల్పు వరకు – వినియోగిస్తారని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.

అయితే, ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందినప్పటికీ, మైక్రోప్లాస్టిక్‌ల మూలంగా చూయింగ్ గమ్‌ను విస్తృతంగా అధ్యయనం చేయాల్సి ఉంది .

దీని ఫలితంగా మొహంతి మరియు తన ప్రయోగశాలలో గ్రాడ్యుయేట్ విద్యార్థి అయిన లిసా లోవ్ సహజ మరియు సింథటిక్ గమ్‌లను నమలడం ద్వారా ఒక వ్యక్తి ఎన్ని మైక్రోప్లాస్టిక్‌లను తీసుకోవచ్చో అన్వేషించడానికి దోహదపడింది .

చూయింగ్ మరియు లాలాజల పరీక్షలు

పరిశోధకులు ఐదు బ్రాండ్ల సింథటిక్ గమ్ మరియు ఐదు బ్రాండ్ల సహజ గమ్‌ను పరీక్షించారు, అన్నీ వాణిజ్యపరంగా అందుబాటులో ఉన్నాయి. వ్యక్తిగత నమలడం అలవాట్లు మరియు లాలాజల కూర్పు కారణంగా వైవిధ్యాన్ని తగ్గించడానికి, వారు ప్రతి బ్రాండ్ నుండి ఏడు ముక్కలను ఒకే వ్యక్తి నమిలారు.

ప్రయోగశాల లోపల, ఈ వ్యక్తి ప్రతి ముక్కను 4 నిమిషాలు నమిలి, ప్రతి 30 సెకన్లకు లాలాజల నమూనాలను అందించాడు, తరువాత శుభ్రమైన నీటితో తుది మౌత్ వాష్ చేశాడు. వీటిని తర్వాత ఒకే నమూనాగా కలిపారు. ఒక ప్రత్యేక పరీక్షలో, మైక్రోప్లాస్టిక్ విడుదల రేటును ట్రాక్ చేయడానికి 20 నిమిషాల వ్యవధిలో లాలాజల నమూనాలను సేకరించారు.

ప్రతి నమూనాలో ఉన్న మైక్రోప్లాస్టిక్‌ల సంఖ్యను అప్పుడు కొలుస్తారు. ప్లాస్టిక్ కణాలను ఎరుపు రంగులో మరక చేసి సూక్ష్మదర్శిని కింద లెక్కించారు లేదా ఫోరియర్-ట్రాన్స్‌ఫార్మ్ ఇన్‌ఫ్రారెడ్ స్పెక్ట్రోస్కోపీని ఉపయోగించి విశ్లేషించారు, ఇది పాలిమర్ కూర్పును కూడా గుర్తించింది.

సగటున, లోవ్ ఒక గ్రాము గమ్‌కు 100 మైక్రోప్లాస్టిక్‌లను విడుదల చేసినట్లు నమోదు చేశారు, కొన్ని ముక్కలు గ్రాముకు 600 మైక్రోప్లాస్టిక్‌లను విడుదల చేశాయి. ఒక సాధారణ గమ్ ముక్క 2 మరియు 6 గ్రాముల మధ్య బరువు ఉంటుంది కాబట్టి, ఒక పెద్ద ముక్క 3,000 ప్లాస్టిక్ కణాలను విడుదల చేస్తుంది.

సగటు వ్యక్తి సంవత్సరానికి 160 నుండి 180 చిన్న గమ్ స్టిక్‌లను నమలడం ఊహిస్తే, ఇది ఏటా సుమారు 30,000 మైక్రోప్లాస్టిక్‌లను తీసుకోవడానికి దారితీస్తుందని అధ్యయనం అంచనా వేసింది. ప్రజలు ఇప్పటికే ప్రతి సంవత్సరం పదివేల మైక్రోప్లాస్టిక్‌లను వినియోగిస్తున్నందున, చూయింగ్ గమ్ ఆ సంఖ్యను గణనీయంగా పెంచుతుంది.

“ఆశ్చర్యకరంగా, సింథటిక్ మరియు సహజ చిగుళ్ళు రెండింటిలోనూ మనం నమిలినప్పుడు ఒకే రకమైన మైక్రోప్లాస్టిక్‌లు విడుదలయ్యాయి” అని ఈ పరిశోధనకు నాయకత్వం వహించిన ప్రొఫెసర్ లోవ్ చెప్పారు.

సారాంశం : చూయింగ్ గమ్ నమిలే అలవాటున్న వారు వెంటనే ఆపండి. మీ చిన్నారులను క్రమంగా దీనికి దూరం చేయండి. ఎందుకంటే వెంటనే బలవంతంగా చూయింగ్ గమ్ అలవాటు నుంచి వారిని దూరం చేయాలనీ ప్రయత్నిస్తే . . అందులో ఏదో ఉందన్న భ్రమలు వాళ్లలో నెలకొంటాయి . అందుకే దానిపట్ల వారికి ఏహ్య భావం కలిగేలా మీ టాలెంట్ ఉపయోగించి ప్రయత్నించండి . ఖచ్చితంగా అది నెరవేరుతుంది.