‘ఇండియా వెడ్స్ లండన్’  ఇది కపుల్ లవ్​ స్టోరీ

‘ఇండియా వెడ్స్ లండన్’ ఇది కపుల్ లవ్​ స్టోరీ

సినిమాగా రూపుదిద్దుకోనున్న నిజజీవిత కధ

ఒకరిది ఇండియా , ఇంకొకరు బ్రిటన్ . వారిద్దరివి రెండు వేరు వేరు దేశాలు. విభిన్న పరిస్థితులు. అయినా సరే ఏకం అయ్యారు. వారి అభిరుచులే వారు ఇద్దరిని కలిపాయి . లండన్​కు చెందిన ఓ యువతి కర్ణాటకలోని గంగావతికి చెందిన యువకుడిని పెళ్లాడింది . వారి ప్రేమ కథేంటో మనమూ ఓ లుక్కేద్దాం . .

విరూపపుర గద్దే ప్రాంతానికి చెందిన మురళి స్థానికంగా ఓ గెస్ట్​ హౌస్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. అలాగే టూరిస్ట్​ గైడ్​గానూ పనిచేస్తున్నాడు. అయితే అతడికి సినిమాలు తీయాలనే కల కూడా ఉంది. ఇదిలా ఉండగా, వృత్తి రీత్యా ఫిల్మ్​ మేకర్ అయిన చార్లెట్ మేరీ ఫ్రాంక్లేయిర్ రెండేళ్ల క్రితం భారత్ పర్యటనకు వచ్చింది. మురళి నిర్మాతగా వ్యవహరించిన ‘ఐ లవ్ మై కంట్రీ ‘ అనే సినిమాకు డైరెక్టర్​గా వ్యవహరించింది. ఈ సమయంలోనే వారిద్దరి మధ్య స్నేహం చిగురించి ప్రేమగా మారింది.
ఈ క్రమంలోనే ఇరు వర్గాల అంగీకారంతో మురళి, చార్లెట్ ప్రేమ పెళ్లి పీటలు ఎక్కింది . ఆడంబరాలకు పోకుండా గంగావతి రిజిస్టర్ ఆఫీస్​లో పెళ్లి సింపుల్ గా చేసుకున్నారు. పెళ్లి తర్వాత స్వీట్లు పంచి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. అయితే మరో ప్రత్యేక విషయం ఏంటంటే – వీరిద్దరూ కలిసి రూపొందించిన ‘ఇండియా వెడ్స్​ లండన్’ అనే షార్ట్​ ఫిల్మ్​ – మే 9న లండన్​లో జరిగే వీరి రిసెప్షన్ రోజునే విడుదల కానుంది. అంతేకాకుండా లోట్టీ ఫ్రాంక్లేర్ ఎంటర్​టైన్​మెంట్స్ అనే సంస్థను కూడా ప్రారంభిస్తున్నట్లు వీరు ప్రకటించారు .

ఏపీలో ‘రియల్ ఎస్టేట్’ వెనుకంజ.. కారణం ?

ఏపీలో ‘రియల్ ఎస్టేట్’ వెనుకంజ.. కారణం ?

గణనీయంగా తగ్గిన రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం .. సర్వే నెంబర్లు , వెబ్ ల్యా0డ్ తప్పుల సవరణపై యంత్రాంగం నిర్లక్ష్యం

కూటమి అధికారంలోకి వస్తే ‘రియల్ ఎస్టేట్ ‘ దూసుకుపోతుంది… అంటూ వేసుకున్న అంచనాలు ఆంధ్రప్రదేశ్ లో రివర్స్ అవుతున్నాయి. చంద్రబాబు ఆధ్వర్యంలో కూటమి సర్కార్ గద్దెనెక్కి పదినెలలవుతున్నా రాష్ట్రంలో మాత్రం ‘రియల్ ఎస్టేట్ ‘ రంగం గాడినపడలేదు. అమరావతి , కృష్ణా , గుంటూరు జిల్లాలలో మాత్రం ఓ మోస్తరుగా భూములు క్రయవిక్రయాలలో కదలిక కనిపిస్తున్నా , , మిగిలిన ప్రాంతాలలో మాత్రం గతేడాదితో పోల్చినా వెనుకబాటు కనిపిస్తోంది.

గత ఏడాది . (2023-2024).. 22 లక్షల 25 వేల డాక్యుమెంట్స్ రిజిస్ట్రేషన్ అయ్యాయి . 9,600 కోట్ల ఆదాయం వచ్చింది .

గడిచిన ఏడాది 2024-2025 ఆర్ధిక సంవత్సరం 20 లక్షల 20 వేలు మాత్రమే అయ్యాయి . 8,800 కోట్లు మాత్రమే వచ్చింది .

800 కోట్ల ఆదాయం తగ్గింది.

అయితే కూటమి నేతలు మాత్రం.. అభివృద్ధిలో దూసుకుపోతున్నాం . . అంటూ ఆర్బాటంగా ప్రకటనలు గుప్పిస్తూనే ఉన్నారు. అభివృద్ధికి కొలమానంగా చెప్పుకునే రియల్ ఎస్టేట్ రంగంలోనే ఇంత వెనుకబాటు ఉంటే మిగిలిన రంగాల పరిస్థితి కూడా పరిశీలించుకుని సమస్యలను పరిష్కరించుకుని ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి.

రియాల్టీ పతనానికి కారణం ?

వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లూ ఏపీలో రియల్ ఎస్టేట్ కుదేలయింది . ఇక్కడి పెట్టుబడిదారులు చాలామంది హైదరాబాద్ వెళ్లి అక్కడ భూములు , భవనాలు కొనుగోలు చేశారు. 2022-2023 నాటికి హైదరాబాద్ లో భూముల ధరలు కృత్రిమంగా పెంచేశారు. ఇంకా పెరిగిపోతాయన్న భ్రమల్లో ఉన్న ఆంధ్రులు ఎగబడి … ఆంధ్రాలో ఉన్న సొమ్ములు తీసుకువెళ్లి తెలంగాణాలో పెట్టుబడులు పెట్టారు .

  • తర్వాత హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ పతనమైంది . అక్కడి పెట్టుబడులు లాక్ అయ్యాయి .
  • జగన్ మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నపుడు ‘జగనన్న సమగ్ర భూ సర్వే ‘ పేరుతొ జరిగిన అక్రమాలు , తప్పులు లక్షలలో చేరిపోయాయి . వాటిని సరిదిద్దే యంత్రాంగం ఏపీలో లేదు . కూటమి సర్కార్ సైతం అప్పటి తప్పులను సరిదిద్దే ప్రయత్నం సంపూర్నంగ చేయడంలేదు .
  • ఈ ప్రభావం వల్ల ఆంధ్రప్రదేశ్ లో భూముల లావాదేవీలు పెరగడంలేదు . ఏపీలో రియల్ పతనానికి ఇదో ప్రధాన కారణంగా చెప్పవచ్చు .
  • ఈ అంశాన్ని ప్రభుత్వం పరిశీలించి0దో లేదో తెలియదు .
ట్రంప్ చర్యకు చైనా స్ట్రాంగ్ కౌంటర్‌

ట్రంప్ చర్యకు చైనా స్ట్రాంగ్ కౌంటర్‌

అమెరికా ఉత్పత్తులపై 34% టారిఫ్స్‌

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మొదలెట్టిన వాణిజ్య యుద్ధం ముదిరిపాకాన పడేలా కనిపిస్తోంది. రెండో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా ఉన్న చైనా కూడా అమెరికాపై వాణిజ్య యుద్ధం ప్రకటించింది. చైనాలో విక్రయించే అమెరికా ఉత్పత్తులపై 34% టారిఫ్ ప్రకటించింది. ఇది ఏప్రిల్ 10 నుంచి అమలులోకి వచ్చేలా చైనా ఆదేశాలు జారీ చేసింది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రారంభించిన వాణిజ్య యుద్ధం ప్రపంచవ్యాప్తంగా తీవ్రమవుతోంది. అమెరికా నుంచి తమ దేశంలోకి దిగుమతయ్యే అన్ని వస్తువులపైనా 34 శాతం సుంకాలు విధిస్తామని చైనా తాజాగా చేసిన ప్రకటనతో వరల్డ్ వైడ్ వాణిజ్య సంబంధాలకు విఘాతం కలిగేలా కనిపిస్తోంది . ఈనెల 10 నుంచి నూతన టారిఫ్‌లు అమల్లోకి వస్తాయని తెలిపింది. ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల్లో వినియోగించే ఏడు కీలక ఖనిజాల దిగుమతులపైనా చైనా వాణిజ్య శాఖ నియంత్రణలు విధించింది. అటు అమెరికా విధించిన ప్రతీకార సుంకాలపై ప్రపంచ వాణిజ్య సంస్థలో చైనా ప్రభుత్వం వ్యాజ్యం దాఖలు చేసింది. చైనా నుంచి అమెరికాలోకి దిగుమతయ్యే వస్తువులపై ట్రంప్ 34 శాతం సుంకాలు విధించడంతో తాజాగా డ్రాగన్ అదే స్థాయిలో సుంకాలను వడ్డించింది.

సత్యప్రమాణాల దేవుడు.. కాణిపాకం వినాయకుడు

సత్యప్రమాణాల దేవుడు.. కాణిపాకం వినాయకుడు

తెలుగు రాష్ట్రాలలో రాజకీయ నేతల ప్రమాణాలకు ప్రసిద్ధి

 .

 శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువై ఉన్న తిరుపతికి అరవై కిలోమీటర్ల దూరంలో ప్రసిద్ద పుణ్యక్షేత్రం ఉంది. అదే కాణిపాకం.. ఇక్కడ విజ్ఞేశ్వరుడు స్వయంగా వెలిసాడని పురాణాలు  చెబుతున్నాయి.   ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో ఉన్న కాణిపాకం గ్రామంలో ఉన్న గణపతి ఆలయం  11వ శతాబ్దం ప్రారంభంలో చోళ రాజు కులోత్తుంగ చోళ I స్థాపించాడు మరియు 1336లో విజయనగర రాజవంశ చక్రవర్తులు దీనిని మరింతగా అభివృద్ధి చేశారు.

 ఒక గ్రామంలో ..  మూగ, చెవిటి, గుడ్డివారు అయిన ముగ్గురి అన్నదమ్ముల ఉండేవారు. వారి వ్యవసాయ బావిలో నీరు ఎండిపోవడం గమనించి బావిని ఇంకొద్దిగా తవ్వితే నీళ్లు వస్తాయని తవ్వడం మొదలు పెట్టగా అక్కడ గట్టి రాయి తగిలి క్షణాలలో బావిలో రక్తం ఊరటం మొదలైంది. కొద్దీ కొద్దిగా బావి నిండుతుంది. ఆ ముగ్గురు అన్నదమ్ములు ఏమైందో అని గమనించగ బావిలో వినాయకుడి విగ్రహం కనిపించింది. వారు ఆ విగ్రహాన్ని పూజించగా వారి యొక్క అవటితనం తొలగి మామూలు మనుషులుగా మారారు. ఆ విషయం గ్రామస్తులకు తెలిసి ఆ విగ్రహాన్ని పూజించడం మొదలు పెట్టారు. అలా భక్తులు కొట్టిన కొబ్బరి కాయల నీరు ఒకటి మరియు పావు ఎకరము అంత విస్తీర్ణము పారింది దానితో ఆ స్థలానికి “కాణిపరకం ” అనే తమిళ పేరు వచ్చింది, రాను రాను ఇది “కాణిపాకం” గా మారిందని ఓ కథ ప్రచారంలో   ఉంది.

ఆలయ ప్రత్యేకతలు ♦ ఇక్కడ స్వామివారి విగ్రహం నీటిలో కొద్దిగా మునిగి ఉంటుంది. ఎంత త్రవ్వినా స్వామివారి తుది మాత్రం కనుగొనలేకపోయారు. ఇక్కడి వినాయకడి పరిమాణం పెరుగుతూ ఉంటుంది. ♦ స్వామివారికి అష్టోత్తర పూజలతో నిత్యం పూజలు చేస్తారు. ♦ వినాయక చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ♦ ఈ ఆలయంలో ఎల్లప్పుడూ ఒక సర్పం తిరుగుతూ ఉంటుంది. కానీ అది ఎవరికీ హాని చేయదు. ♦ సత్యానికి మారుపేరుగా కాణిపాక వినాయకుడి పేరును చెబుతూ ఉంటారు. అందుకే అక్కడ ఏదైనా సమస్య వచ్చినప్పుడు తప్పు చేసిన వ్యక్తిని ఆలయం ముందు ఉన్న నీటిలో స్నానం చేయిస్తే తప్పు ఒప్పుకొంటాడు అని ప్రసిద్ధి..

. కాణిపాకం వినాయకుడి దైవిక ప్రతిమ అనేక అద్భుతాలకు నిలయం.   కాలక్రమేణా విగ్రహం పరిమాణం పెరుగుతోందని చెబుతారు. ప్రస్తుతం, విగ్రహం యొక్క మోకాలు మరియు ఉదరం మాత్రమే కనిపిస్తాయి. వాస్తవానికి సాక్ష్యం దాదాపు యాభై సంవత్సరాల క్రితం తీవ్రమైన భక్తులలో ఒకరు విగ్రహానికి సమర్పించిన వెండి కవచం (కవచం), ఇది నేటి విగ్రహానికి సరిపోదు!

. కాణిపాకం యొక్క గణపతి యొక్క స్వయం-వ్యక్తీకరించబడిన విగ్రహం స్వయంభూ.   ఆసక్తికరంగా, చాలా మంది చాలా కాలంగా ఆలయ చెరువులోని పవిత్ర జలాల్లో మునిగి దేవత విగ్రహం ముందు ప్రమాణం చేయడం ద్వారా పరస్పర కలహాలను పరిష్కరించడానికి ఆలయాన్ని సందర్శిస్తున్నారు. పవిత్ర స్నానం చేసిన వెంటనే మరియు “న్యాయస్థానం” లేదా ఆలయం లోపలి గదులలోకి అడుగుపెట్టే ముందు కూడా పాపి తన తప్పులను అంగీకరించిన సందర్భాలు ఉన్నాయి.  

సత్యప్రమాణాలకు ప్రసిద్ధి.. 

   అబద్దమ్ చెప్పకుండా నిజాలు చెప్పడానికి వరసిద్ధి వినాయకుడి ముందుకు వస్తారు. ప్రముఖంగా రాజకీయ నాయకులు ‘సత్య ప్రమాణాలు’ ఇక్కడ ఎక్కువ చేస్తుంటారు. 2014-2019 మధ్య కాలంలో మంత్రిగా పనిచేసిన బీజేపీ నేత, ప్రస్తుత కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్.. తన హయాంలో రూపాయి కూడా అవినీతికి పాల్పడలేదని ‘కాణిపాకం వినాయకుడు ముందు ప్రమాణం చేసి అప్పట్లో సంచలనం సృష్టించారు. 

ఇక్కడ ఇష్టమైన వాటిని వదిలేస్తే మనం కోరుకున్నది స్వామి వారు తీరుస్తారని భక్తుల నమ్మకం ♦ స్వామి వారి ఆలయానికి ఈశాన్య దిశలో వరదరాజ స్వామి ఆలయం కూడా ఉంది. ♦ బస్సు సౌకర్యములు తిరుపతి నుండి ప్రతి 15 నిమిషములకు ఒక బస్సు ఉంది. చిత్తూరు నుండి ప్రతి 10 నిముషాలకు ఒక బస్సు ఉంది. చంద్రగిరి నుండి కూడా జీపులు, వ్యానులు, ట్యాక్సీలు మొదలగునవి లభించును. రైలు సౌకర్యములు: ఆంధ్రప్రదేశ్ ఏమూల నుండి అయిననూ చిత్తూరుకు లేదా రేణిగుంట లేదా గూడూరు లకు రైళ్ళు ఉన్నాయి. ఈ ప్రదేశాల నుండి బస్సు ద్వారా సులభముగా కాణిపాకం చేరవచ్చు. 10 కిలోమీటర్ల పరిధిలో అంతే కాకుండా రేణిగుంట విమానాశ్రయం కూడా కలదు.