కూరగాయల్లో బీరకాయ వల్ల మనకున్న ప్రయోజనాల గురించి తెలిస్తే ఆశ్యర్యపోవాల్సిందే. నచ్చని వాళ్లకు సైతం దాని గురించి తెలుసుకొంటే తినకుండా ఆగలేరు. బాలింతలు, సర్జరీ అయిన వాళ్లకు బీరకాయ ఎంతో ఉపయోగం. అందులో నీటి శాతం, ఫైబరే కాకుండా ఎన్నో పోషకాలు ఉన్నాయి. సమ్మర్ సీజన్ లో బీరకాయ తినడం వల్ల అనేక లాభాలు ఉన్నాయి.
బీరకాయలో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ బి6, పొటాషియం, ఐరన్, మెగ్నీషియం, సోడియం, జింక్, కాపర్, థైమీన్, పిండి పదార్థాలు, నీటి శాతం ఎక్కువగా ఉంటాయి. వాటి వల్ల రక్తహీనత సమస్య తగ్గుతుంది, రక్త ప్రసరణ మెరుగ్గా జరిగేలా చేస్తుంది. నొప్పులు, అలసట నుంచి కూడా దూరం చేస్తుంది.
రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. తగినంత రోగ నిరోధక శక్తి ఉంటే వ్యాధులు రాకుండా ఉంటాయి. అలాగే జీర్ణ వ్యవస్థ మెరుగు పరుస్తుంది. బీరకాయలో తగినంత ఫైబర్ ఉంటుంది. దాని వల్ల త్వరగా అరిగిపోతుంది. దీని వల్ల కడుపులో నొప్పి, గ్యాస్, అజీర్తి, మలబద్ధకం వంటి సమస్యలు తలెత్తవు. అలాగే లివర్ ను ఆరోగ్యంగా ఉంచుతుంది. శరీరంలోని వ్యర్థాలు, ఆల్కహాల్ అవశేషాలు, జీర్ణం కాని ఆహార కణాలను తొలగించడంలో బీరకాయ సహాయ పడుతుంది.