‘‘జనసేన పార్టీతో పొత్తు లేకపోతే వైసీపీని ఓడించలేమన్న భయం టీడీపీలో ముఖ్య నేతలకు ముందు నుంచీ ఉంది. జగన్ సర్కార్ పై ఆంధ్రప్రదేశ్ లో తీవ్రమైన వ్యతిరేఖత దాటి.. మెజార్టీ వర్గాలలో అసహ్యించుకునే పరిస్థితి వచ్చేసింది.” ఇపుడున్న అత్యంత దారుణ పరిస్థితులలో జగన్ కి వ్యతిరేఖంగా ఓట్లు వేయడానికి మెజార్టీ వర్గాలు డిసైడ్ అయిపోయారు. ఈ పరిస్థితి తెలుగుదేశం పార్టీకి బాగా కలసి వచ్చే అంశమే. అయితే ఒంటరిగా పోటీకి దిగితే వైసీపీ అరాచరకాలు తట్టుకుని నిలబడగలమా? అన్న భయం టీడీపీలో కొందరు చంద్రబాబు అండ్ కోకు నూరిపోయడం.. వాళ్ళు కూడా దాన్ని నమ్మడం.. సేనతో పొత్తులేకుండా ఎన్నికలకు వెళ్లలేని మానసిక స్థితి తెచ్చేసుకున్నారు.
త్వరలో తెలంగాణ రాష్ట్రంలో జరిగే ఎన్నికలలో జనసేన ఎనిమిది చోట్ల పోటీ చేస్తోంది. ఒక్క సీటు కూడా గెలిచే పరిస్థితి కనిపించడంలేదు. పైగా .. ఒకటి, రెండు అసెంబ్లీ స్థానాలలో 6,7 శాతం ఓట్లు మినహా.. మిగిలిన చోట్ల 4,5 శాతం మించే పరిస్థితి కనిపించడంలేదు.
తెలంగాణలో బీజేపీకి పవన్ సపోర్ట్ చేస్తున్నారు. పవన్ ., జనసేన సపోర్ట్ వల్ల బీజేపీకి అయినా సీట్లు పెరుగుతాయా> అంటే అది కూడా కనిపించడంలేదు. ఆ ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్… పరిస్థితి మరింత దారుణంగా మారే అవకాశం లేకపోలేదు.
ఆంధ్రా విషయంలో..
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు విషయంలో జనసేన తో పొత్తుకు వెళ్లే విషయంలో టీడీపీ వాళ్ళు ఉన్నంత వాస్తవంలో జనసేన కేడర్ ఉండదు. 6 శాతం ఓట్లు కూడా లేని, రెండు చోట్ల ఓడిపోయినా పవన్ తో కలసి వెళ్ళాలి. జనసేన తో వెళ్లడం వల్ల ఏపీలో టీడీపీకి కలసి వచ్చే ఓట్ల కంటే.. రాయలసీమ ప్రాంతమ్, ఉత్తరాంధ్ర లలో టీడీపీకి బీసీల విముఖత కనిపిస్తోందని పలు సర్వేలు వెల్లడి చేస్తున్నాయ్. జనసేన్తో పొత్తు లేకపోయినా.. 2024 ఎన్నికల్లో టీడీపీకి బలమైన మెజార్టీ వస్తుందని పలు సర్వేలు వెల్లడి చేస్తున్నాయ్. 6,7 శాతం ఓట్లు ఉన్న జనసేనకి వేసే ఓటు వెస్ట్ అవుతుందని., వ్యతిరేఖ ఓటు జనసేనకు వెళ్ళుతుందనుకుంటున్న వన్నీ భ్రమలే.. అని పలువురు వ్యాఖ్యనిస్తున్నారు.
జనసేన-టీడీపీ పొత్తు తో..
తెలంగాణ ఎన్నికలలో అపఖ్యాతి పాలైన తర్వాత జనసేన కి.. టీడీపీ మధ్య 30 లోపు అసెంబ్లీ సీట్లు, 2 పార్లమెంట్ స్థానాలు ఉండొచ్చు. దీనికి పవన్ కళ్యాణ్ అంగీకరించినా, జనసేన కేడర్ మాత్రం సహించలేని పరిస్థితి ఎదురుకాబోతోంది. అయినా పవన్ ఆ సీట్లతోనే ఎన్నికలకు సిద్ధమవుతారు. కానీ, కేడర్ ఏ మేరకు సహకరిస్తుంది.. జనసేన ఓటు,, టీడీపీకి ట్రాన్స్ఫర్ అవుతుందా? అనే దానిపై టీడీపీ, జనసేన నేతలలో టెన్షన్ నెలకొంది. జనసేన పొత్తు లేకపోయినా.. 2024 ఎన్నికల్లో టీడీపీ ఒంటరిగా గెలిచే ఛాన్స్ కనిపిస్తుంది. పొత్తు లేకపోయినా 130-140 సీట్లు తెచ్చుకునే బలం టీడీపీకి కనిపిస్తోంది. జనసేన్తో వెళితే మాత్రం.. 20-30 సీట్లు తగ్గే ప్రమాదం కూడా లేకపోలేదు. ఎన్నికల తర్వాత కూడా ;; మా పొత్తు వల్లే టీడీపీ గెలిచింది..” అని జనసేన కేడర్ నుంచి ఐదేళ్లు దెప్పి పొడుస్తూనే ఉంటారు. ఇది టీడీపీ నేతలు గమనించుకోవాలి.