టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఏపీ సీఐడీ పెట్టిన స్కిల్ కేసులో హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. చంద్రబాబుపై సీఐడీ పెట్టిన కేసు మొదలు.. బెయిల్ వరకు ఏం జరిగింది… అభి న్యూస్ స్పెషల్ …న్యూస్.
స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కేసులో 3300 కోట్ల దుర్వినియోగం నుంచి చివరికి 27 కోట్లు టీడీపీ ఖాతాలోకి వచ్చాయన్న దాకా కిందకు దిగిన సీఐడీ… కనీసం వాటికైనా ఆధారాలు కోర్టుకి చూపలేకపోయింది. కేసులో సీఐడీ చేసిన ఏ ఒక్క ఆరోపణలకు సాక్ష్యాలు లేదని చంద్రబాబుకు బెయిల్ ఇస్తూ జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నది. అసలు నిధులు దుర్వినియోగం అయ్యాయన్నదానికి కూడా సాక్ష్యాలు లేవని స్పష్టం చేసింది. మరి సీఐడీ ఎలా కేసు నమోదు చేసిందో దిగువ కోర్టు సాక్ష్యాలు ఉన్నట్లుగా ఉన్నాయి అని అనిపించచి ఎందుకు రిమాండ్ విధించిందో.. ఇదే కేసులో 53 రోజుల పాటు 14 ఏళ్లు సీఎంగా చేసిన వ్యక్తిని ఎలా జైల్లో పెట్టారో … ఇలాంటి తప్పుడు కేసును పెట్టిన సీఐడీపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో ముందు ముందు తేలనుంది. షెల్ కంపెనీల ద్వారా నిధులు దారి మళ్లాయని అవి చంద్రబాబు డ్రా చేసుకున్నారని సీైడీ ఆరోపించింది. మరి దానికి ఆధారం ఏమిటి అంటే.. ఏమీ లేదు. ఒక్క ట్రాన్సాక్షన్ వివరాలు కూడా కోర్టు ముందు ఉంచలేకపోయారు. టీడీపీపీ ఖాతాలోకి వెళ్లాయని సీఐడీ ఆరోపించింది. పోనీ దానికైనా ఆధారాలు చూపించారా అంటే అదీ కూడా కట్టు కథలాగే మిగిలింది. ఇలాంటి తీవ్రమైన ఆరోపణలు చేసినప్పుడు స్పష్టమైన ఆధారాలు చూపాల్సి ఉంటుంది. కానీ సీఐడీ దగ్గర చూపేందుకు ఏమీ లేవు. ఏవేవో వాట్సాప్ మెసేజులు చూపించారు. అసలు ఈ కేసుతో సంబంధం ఉన్నాయన్నదానికి ఎలాంటి లింకులు చూపించలేకపోయారు.
స్కిల్ డెవలప్ మెంట్ లో అవినీతి జరిగిందంటూ.. సీఐడీ కేసు 2021 డిసెంబర్ 9న కేసు నమోదైంది..
వాదనలు విని.. క్షుణ్ణ0గా పరిశీలించిన ఉన్నత న్యాయస్థానం… బెయిల్ ఇచ్చిన 139 పేజీలలో కీలక అంశాలు ఇవే..
- చంద్రబాబుపై 2023 సెప్టెంబర్ 9న కేసునమోదు చేశారు
- అప్పటి నుంచి ఆయన ఈ కేసులో జోక్యం చేసుకున్నట్లుగానీ రికార్డులను టాంపర్ చేసినట్లుగానీ ప్రాసిక్యూషనే చెప్పలేదు
- సబ్ కాంట్రాక్టర్ పన్ను ఎగవేస్తే, చంద్రబాబుకు ఏం సంబంధమని న్యాయవాది లూథ్రా చేసిన వాదనతో ఏకీభవిస్తున్నాం
- చంద్రబాబుకు ఈ కాంట్రాక్టులో ఉల్లంఘనలు ఉన్నాయని అధికారులు చెప్పారన్న అంశానికి సాక్షాలు లేవు
- ఈ కేసులో ఇప్పటికే 149 మంది సాక్షులను విచారించి 4 వేల పేజీల డాక్యుమెంట్లు సేకరించినట్లు దర్యాప్తు సంస్థ తెలిపింది
ఇవీ అసలు విషయాలు..!
- ఇప్పటికీ ఈ డాక్యుమెంట్లు సీఐడీ ఆధీనంలో ఉండటంతో చంద్రబాబు వీటిని ట్యాంపర్ చేసే అవకాశం లేదు
- జడ్ ప్లస్ కేటగిరీ భద్రతలో ఉన్న చంద్రబాబు పారిపోయే అవకాశం లేదు
- సాక్షులను చంద్రబాబు ప్రభావితం చేస్తున్నారని సీఐడీ తరపున లాయర్లు చేసిన వాదనలకు ఆధారాలు లేవు
- స్కిల్ కేసులో సుజయత్ ఖాన్ ఇచ్చిన స్టేట్మెంట్లో చంద్రబాబు పాత్ర ఉన్నట్లు ప్రాధమిక సాక్షాలు కూడా లేవు
- చంద్రబాబు మాజీ పీఎ పెండ్యాల శ్రీనివాస్ విచారణకు గైర్హాజరుకు చంద్రబాబు బెయిల్ పరిశీలనకు ఎటువంటి సంబంధం లేదు
- చంద్రబాబుకు ఇచ్చిన మధ్యంతర బెయిల్ నేపథ్యంలో హైదరాబాద్లో నమోదైన కేసులో బెయిల్ షరతులను ఉల్లంఘించిట్లుగా పరిగణించడం లేదు
- స్కిల్ కేసులో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లినట్లు సీఐడీ ఎటువంటి ఆధారాలు చూపించలేక పోయింది
- చంద్రబాబు కీలక సాక్షులను ప్రభావితం చేస్తున్నారని సీఐడీ చేసిన ఆరోపణలకు ఎటువంటి ఆధారాలు చూపలేకపోయారు
- నిధులు విడుదల చేయమన్నంత మాత్రాన నేరంలో పాత్ర ఉందని చెప్పలేమని పేర్కొన్న హైకోర్టు
- చంద్రబాబు తప్పు చేసినట్లు ఇన్కంటాక్స్ డిపార్టుమెంట్ ఆరోపణలు చేసింది కానీ ఆధారాలు చూపలేకపోయింది
- స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఉన్నది నిజం.. రెండు లక్షల మందికి ట్రైనింగ్ ఇచ్చినట్లు సీఐడీ అంగీకరించింది
- టీడీపీ ఖాతాలో స్కిల్ స్కామ్ డబ్బులు వచ్చాయని సీఐడీ ఆరోపణలు చేసినప్పటికీ, తగిన ఆధారాలు చూపలేదు.