తాటి ముంజలు. ఈ పేరు మనలో చాలా మందికి తెలుసు. ఏప్రిల్ నెల వచ్చిందంటేనే తాటి ముంజలు సీజన్ వచ్చినట్లు. వేసవి కాలంలో ఎండ వేడి నుండి ఉపశమనం పొందడానికి తాటి ముంజ మేలైనది. ముంజలు చూడటానికి జెల్లీలా పట్టుకుంటే జారిపోయేంత మృదువుగా ఉంటాయి. తియ్యగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉంటే వీటి లోపల భాగంలో నీరు ఉంటుంది. ముంజికాయల నుంచి తీసి..వీటిని మార్కెట్ఈ లో అమ్ముతారు. శరీరాన్ని చల్లబరిచే ఈ తాటి ముంజుల్లో ఉంటే పోషకాలు ఆరోగ్యానికి ఎన్నో …
వేసవిలో మన ఆరోగ్యాన్ని కాపాడడానికి ప్రకృతి ప్రసాదించిన వాటిల్లో తాటిముంజలు ప్రత్యేకమైనవి. వీటిని పిల్లలు, పెద్దలు వయసుతో సంబందం లేకుండా అందరూ అమితంగా ఇష్టపడతారు. ఇవి కల్తీలేనివి, స్వచ్చమైనవి. మండుటెండల నుండి మంచి ఉపశమనం….
ముఖ్యంగా ఎండాకాలం చలువ కోసం ఈ తాటి ముంజలు తినడం చేస్తుంటారు.ఈ పండులో క్యాలరీలు తక్కువ మొత్తంలో శరీరానికి కావలసిన శక్తి ఎక్కువ మొత్తంలో ఉంటాయి. కాబట్టి వేసవిలో చలువ కోసం తాటి ముంజలని తినడం చాలా అవసరం. కొంతమందికి ఎండాకాలంలో వేడికి ముఖంపై చిన్నచిన్న మొటిమలు వస్తుంటాయి.
వీటి నుంచి ఉపశమనం పొందాలంటే కూడా తాటి ముంజల్ని తినాల్సిందే. అంతేకాకుండా ఎండాకాలంలో ఎన్ని మంచి నీళ్లు తాగినా అది చెమట రూపంలో బయటకు వెళ్ళిపోతుంది. ఈ క్రమంలో శరీరం డీహైడ్రేట్ అయిపోతుంది. తాటి ముంజల్లో నీటి శాతం అధికంగా ఉండడం వల్ల వీటిని తింటే ఈ సమస్య నుంచి కాపాడుకోవచ్చు.
వేసవిలో శరీరానికి కావలసిన ఖనిజాలు చక్కెరలను ఇవి బ్యాలెన్స్ చేస్తాయి. వీటిలో అధిక మొత్తంలో ఉండే విటమిన్ బి, ఐరన్, క్యాల్షియం శరీరానికి చాలా అవసరం. అంతేకాకుండా తాటి ముంజల్లో శరీరానికి కావలసిన ఏ,బి,సి విటమిన్లు.. ఐరన్, పాస్పరస్ పొటాషియం వంటివి పుష్కలంగా ఉంటాయి.
వీటిలో అధిక మొత్తంలో నీరు ఉండడం వల్ల శరీర బరువును తగ్గించడంలో ఎంతగానో తోడ్పడతాయి. తాటి ముంజలు కాలేయ సంబంధ సమస్యల్ని కూడా తగ్గిస్తాయి. ఈ పండులో అధిక మొత్తంలో ఉండే పొటాషియం శరీరంలో ఉండే టాక్షిన్స్ సమస్య తొలగుతుంది.
పోషకాలెన్నో…