ఏటా ఈ సీజన్ లో లభించే తాటి ముంజలు తినాలని అందరికి ఉంటుంది. అయితే చిన్న పాటి ఆశ్రద్దో., సమయానికి అవి దొరక్కో తినాలన్న కోరికను వాయిదా వేసుకుంటారు చాలా మంది. వేసవిలో మన ఆరోగ్యాన్ని కాపాడడానికి ప్రకృతి ప్రసాదించిన అమృతం తాటిముంజలు. వీటిని పిల్లలు, పెద్దలు వయసుతో సంబందం లేకుండా అందరూ అమితంగా ఇష్టపడతారు. ఇవి కల్తీలేనివి. మండుటెండల నుండి మంచి ఉపశమనం తాటిముంజలు. వేసవి సెలవలకు పల్లెటూర్లు వెళ్లేవారు తాటిముంజలని ఖచ్చితంగా లాగిస్తారు. ఇప్పుడు పట్టణాలు, రోడ్డు పక్కల కూడా విరివిగా దొరుకుతున్నాయి. శరీరంలోని చక్కెర, ఖనిజాల ప్రమాణాలను సమతుల్యం చేయడంలో తాటి ముంజల మేలు చేస్తాయి. తాటి ముంజల్లో అనేక ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి.
బరువు తగ్గుతారు
వేసవిలో మన శరీరం సహజంగానే వేడిగా మారుతుంది. రెగ్యులర్ గా తాటి ముంజులు తినేవారి శరీర ఉష్టోగ్రత తక్కువగా ఉంటుంది. వేడిమి నుంచి తప్పించుకుని, డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటారు. . అధిక బరువును తగ్గించడంలోనూ తాటి ముంజలు ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ సీజన్ లో కనీసం 20-30 రోజులపాటు వీటిని తింటే 80-90 కేజీల బరువు వున్న వారు కనీసం.. 3-5 కేజీల బరువు తగ్గుతారు.
జీర్ణ శక్తి మెరుగవుతుంది ..
జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరిచే గుణాలు తాటి ముంజల్లో ఉంటాయి. కనుక వీటిని తింటే గ్యాస్, మలబద్దకం, అసిడిటీ వంటి సమస్యలకు పరిస్కారం దొరుకుతుంది. జీర్ణశక్తి మెరుగవుతుంది. ముంజలను తినడం వల్ల లివర్ పనితీరు మెరుగు పడుతుంది. లివర్లోని వ్యర్థాలు బయటకుపోయి. . క్లిన్ అవుతుంది.