ఆరోగ్య ప్రయోజనాలు కలిగించే పండ్లలో ‘బత్తాయి’ అతి ముఖ్యమైంది. బత్తాయిలో ఆరోగ్యానికి మేలు చేసే విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉన్నాయి. ఒక బత్తాయి పండులో 50 mg వరకు విటమిన్ సి ఉంటుంది, ఇది రోజూవారీ మనకు కావలసిన విటమిన్ సీలో 22 శాతం. వైద్యులు, ఆరోగ్య నిపుణులు ప్రతిరోజూ బత్తాయి జ్యూస్ తాగితే బోలెడన్ని ప్రయోజనాలని చెప్తారు. దీనిలో యాసిడ్ కంటెంట్ తక్కువగా ఉంటుంది.
పోషకాలు ఎన్నో..
బత్తాయిలో విటమిన్ సీ, . విటమిన్-ఎ, కాల్షియం, కార్బోహైడ్రేట్లు, ఫాస్పరస్, పొటాషియం, ఫోలేట్స్ పుష్కలంగా ఉంటాయి. బత్తాయిలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ ట్యూమర్, యాంటీ డయాబెటిక్, యాంటీ అల్సర్ వంటి అనేక ఔషద గుణాలు ఉన్నాయి.
బత్తాయి రోజూ తినే వారిలో అనేక రకాల అనారోగ్య సమస్యలు దూరమవుతాయని.. ప్రముఖ పోషకాహార నిపుణులు చెప్తున్నారు.
కొలెస్ట్రాల్ కు చెక్.
అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడేవారు బత్తాయి తీసుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. బత్తాయిలో యాంటీ-హైపర్లిపిడెమిక్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. అధిక కొలెస్ట్రాల్-తగ్గించే గుణాలు బత్తాయిలో ఉన్నాయి. ప్రతీ రోజూ బత్తాయి జ్యూస్ తాగితే శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు కంట్రోల్లో ఉంటాయి.
క్యాన్సర్కు చెక్..
బత్తాయిలో ఉండే లిమోనాయిడ్స్ క్యాన్సర్ ను క్రమంగా తగ్గిస్తాయి. ప్రధానంగా లివర్ క్యాన్సర్, బ్రెస్ట్ , స్టొమక్ ట్యూమర్లు వచ్చే ప్రమాదం తగ్గుతుందని ఓ పరిశోధన వెల్లడించింది. బత్తాయిలో క్యాన్సర్ నిరోధక లక్షణాలు ఉన్నట్లు పేర్కొంది.