‘ఆఫ్రికాలో రోగాలు ఎక్కువని, తక్కువ కాలం బతుకుతారని ఇప్పటి వరకు ఎక్కువమంది అనుకుంటున్నారు.. కానీ.,’
ఆఫ్రికాలో ఆయుర్దాయం సగటున ప్రతి మనిషిలో 10 సంవత్సరాలు పెరిగిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఈ పెరుగుదల 2000-2019 మధ్య నమోదైందని వెల్లడించింది. ఈ కాలంలో ఈ స్థాయిలో పెరుగుదల కేవలం ఆఫ్రికా రీజియన్లోనే ప్రత్యేకంగా నమోదైందని పేర్కొంది. 2000 లో సగటున ఓ వ్యక్తి 46 ఏళ్ళు జీవిస్తే 2019నాటికి 56 ఏళ్లకు ఆయుర్దాయం పెరిగిందని స్పష్టం చేసింది. అయితే ప్రపంచవ్యాప్తంగా మానవుల సగటు ఆయురార్దం 64 సంవత్సరాలు కాగా.. ఇప్పటికీ ఆఫ్రికా రీజియన్లో సగటు ఆయుర్దాయం 56 ఏళ్లే ఉన్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయ్.