సైకిల్ తొక్కడం చిన్న పిల్లల దగ్గర్నుంచి పెద్దల వరకూ అన్ని వయసుల వారు ఎంజాయ్ చేసే ఓ సరదా ఆట. ఉరుకుల, పరుగుల జీవనంలో చిన్న చిన్న పనులకు సైకిల్ తీయడం అలవాటు చేసుకుంటే దీనివల్ల కలిగే లాభాలను మీరే గమనిస్తారు… సైక్లింగ్ అంటే ఇంట్లో ఉంది తొక్కడమేనని మనం భావిస్తాం. అలాకాకుండా సాధారణ సైకిల్ కొనుక్కుని దానితో బజారులో చిన్న చిన్న పనులకు వెళ్లడం అలవాటు చేసుకోవాలి.
వారానికి రెండు నుంచి నాలుగు గంటలు సైక్లింగ్ చేస్తే మంచి రిజల్ట్స్ ఉంటాయని చెబుతున్నారు నిపుణులు. ఇతర వర్కౌట్స్ కంటే తక్కువ ఒత్తిడి వీటిని చేయడం వల్ల మీ కండరాలు సమూహాలు మెరుగవుతాయి. తేలిగ్గా దీనిని చేస్తూనే ఎన్నో బెనిఫిట్స్ పొందొచ్చు.
బరువును అదుపులో ఉంచుకోవడానికి చేసే వ్యాయామాల్లో సైక్లింగ్ కూడా ఒకటి. చాలా మంది ఈ వ్యాయామాన్ని అలవాటుగా చేసుకుని ప్రతిరోజూ సైక్లింగ్ చేస్తూ ఉంటారు. ఇంట్లోనే ఉండి మనకు కుదిరినప్పుడు ఇతర సహాయం లేకుండా మనం ఈ వ్యాయామాన్ని చేయవచ్చు. సైక్లింగ్ చేయడం వల్ల శరీరం ఎక్కువగా అలిసిపోకుండా ఉంటుంది. గుండె మీద కూడా ఎక్కువగా ఒత్తిడి పడకుండా ఉంటుంది.
అలాగే సైక్లింగ్ చేయడం వల్ల శరీరంలో పాదాల నుండి ప్రతి అవయవంలో కదలిక జరుగుతుంది. కనుక రక్తప్రసరణ మెరుగుపడుతుంది. శరీరంలో ప్రతి అవయవానికి ఆక్సిజన్ చక్కగా సరఫరా అవుతుంది. అలాగే గుండె జబ్బులు ఉన్న వారికి ఇది ఒక చక్కటి వ్యాయామనే చెప్పవచ్చు. అదే విధంగా సైక్లింగ్ చేయడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. సైక్లింగ్ చేయడం వల్ల మనం సులభంగా బరువు తగ్గవచ్చు. తొడల భాగంలో పేరుకుపోయిన కొవ్వు కరగడంతో పాటు మోకాళ్లకు కూడా చక్కటి వ్యాయామం అవుతుంది. అలాగే కాళ్ల బరువు కూడా తగ్గుతుంది. మోకాళ్ల నొప్పులతో బాధపడే వారు సైక్లింగ్ చేయడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.
అలాగే చాలా మంది పిక్కల నొప్పులతో బాధపడుతూ ఉంటారు. అలాంటి వారు సైక్లింగ్ చేయడం వల్ల రక్తప్రసరణ మెరుగుపడి పిక్కల నొప్పులు తగ్గుతాయి. అదే విధంగా వెరికోన్స్ వీన్స్ సమస్యలతో బాధపడే వారికి సైక్లింగ్ ఒక చక్కటి వ్యాయామం అని చెప్పవచ్చు. సైక్లింగ్ చేయడం వల్ల కాళ్లల్లో కండరాలు బలపడి రక్తం పైకి చక్కగా సరఫరా అవుతుంది. వెరికోన్స్ వీన్స్ వల్ల కలిగే మంటలు, నొప్పులు, వాపులు తగ్గుతాయి. కీళ్ల నొప్పులు, మెడ నొప్పి, నడుము నొప్పి వంటి సమస్యలతో బాధపడే వారు కూడా సైక్లింగ్ చేయడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు. అలాగే సైక్లింగ్ చేయడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది. మనసుకు ప్రశాంతత లభిస్తుంది.