పెళ్ళైనా, పేరంటమైనా – నోమైనా , వ్రతమైనా .. ఇంట్లో ఏ శుభ కార్యం తలపెట్టినా తమలపాకు ఉండాల్సిందే. శుభాలు, పూజాధికార కార్యక్రమాలలో వాడే తమలపాకులో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో ఓషధి గుణాలున్నాయి. ఇది అనేక శాస్త్రీయ పరిశోధనలలో రుజువయింది. తమలపాకులను గతంలో చాలా మంది భోజనం చేశాక తాంబూలం రూపంలో వేసుకునేవారు. ఇటీవల ఆ అలవాటు తగ్గింది.
తమలపాకులను రోజుకు రెండు సార్లు ఒక్కో ఆకు చొప్పున భోజనం తర్వాత నమిలితే తిన్న ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. శరీరంలో ఉండే కఫం సమస్యకు పరిస్కారం దొరుకుతుంది.
రెండు తమలపాకులను గ్లాసు నీళ్లలో వేసి.. ఒక గంట సేపు ఉంచి, 4, 5 సార్లు ఆ నీతిని పుక్కిలిస్తే నోటి దుర్వాసన క్రమంగా తగ్గుతుంది.
తమలపాకుల్లో మన శరీరానికి మేలు చేసే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. రోజుకు రెండు చొప్పున.. మధ్యాహ్నం, రాత్రి తింటే శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వైరస్ చొకకుండా ఉంటుంది.
తమలపాకులతో ఉండే యాంటీ ఆక్క్సిడెంట్స్ కారణంగా తాంబూలం (తమలపాకు, సున్నం) వేసుకుంటే ఆస్టియో ఫోరోసిస్ (ఎముకలు గుల్లబారే సమస్య) తగ్గుతుంది.
అర టీస్పూన్ తమలపాకుల రసం, అంతే మోతాదులో తులసి రసం, అల్లం రసం, మిరియాల పొడి, తేనెలను కలిపి ఆ మిశ్రమాన్ని పిల్లలచేత నాకిస్తే జలుబు, పొడి దగ్గు తగ్గుతాయి.
ఒక తమలపాకును తీసుకుని అందులో అర టీస్పూన్ మిరియాల పొడిని ఉంచి.. చుట్టి దాన్ని ఉదయాన్నే పరగడుపునే తినాలి. తరువాత 30 నిమిషాల పాటు ఏమీ తినకూడదు. ఇలా నెల రోజులు చేస్తే అధిక బరువు, బాన పొట్ట తగ్గుతాయి.
ఒక కప్పు గోరు వెచ్చని పాలలో ఒక టీస్పూన్ తమలపాకుల రసం కలిపి తాగితే మహిళల్లో ఉండే క్షణికావేశం తగ్గుతుంది. పిచ్చిగా ప్రవర్తించేవారి మానసిక స్థితి కొంత వరకు మెరుగు పడుతుంది.
తమలపాకుల రసాన్ని నిమ్మకాయ షర్బత్‌లో కలిపి రెగ్యులర్ గా తాగితే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. కఫం పోతుంది.
అతి మధురం చూర్ణం ఒక టీస్పూన్, తమలపాకుల రసం ఒక టీస్పూన్, తేనె ఒక టీస్పూన్ మోతాదులో తీసుకుని కలిపి రోజుకు రెండు పూటలా సేవిస్తుంటే.. పెద్దల్లో వచ్చే మొండి జలుబు సైతం తగ్గిపోతుంది.
ఇన్ని ప్రయోజనాలున్న తమలపాకులను మనమూ రెగ్యులర్ గా వాడదామా?