ఆల్బుకరా .. ఈ పండ్లు చూడగానే ఆకట్టుకుంటాయి. అందంగా కనిపించడమే కాదు.. వీటిని తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అందువల్ల ఇవి రోగనిరోధకశక్తిని పెంచి, త్వరగా ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడతాయి. మనం తిన్న ఆహారం నుంచి శరీరం ఇనుమును బాగా గ్రహించేలా కూడా చేస్తాయి. కాబట్టి ఈ పండ్లనూ వీలైనప్పుడల్లా తినటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారువీటిల్లోని ప్రోసైయానిడిన్, నియోక్లోరోజెనిక్‌యాసిడ్, క్యూర్సెటిన్ వంటి ఫెనోలిక్ రసాయనాలు శరీరంలో వాపు తగ్గేందుకు తోడ్పడతాయి.
1. ఇవి కణాలు దెబ్బతినకుండా కాపాడతాయి. జ్యూసీగా ఉండే ఈ పండులో కేలరీలు తక్కువ. జీర్ణశక్తిని మెరుగుపరిచే ఫైబర్ ఇందులో చాలా వుంది.
2. రోగనిరోధకశక్తిని పెంచడంలో ఇది మనకెంతగానో తోడ్పడుతుంది. విటమిన్ ఎ, బీటా కెరోటిన్లూ ఇందులో ఉన్నాయి. దీనిలో ఉన్న పొటాషియం గుండెజబ్బులు, రక్తపోటు రాకుండా కాపాడుతుంది.
3. ఎండు ఆల్‌బుకారాలను రోజుకు పది చొప్పున తీసుకుంటే ఎముకలు దృఢంగా తయారై ఎముక విరుపు సమస్యలుండవు. దీంతోపాటు మోనోపాజ్ దశ దాటిన మహిళల్లో సాధారణంగా కనిపించే ఆస్ట్రియోపోరోసిస్‌ని కూడా ఇవి నివారిస్తాయని నిర్ధారించారు.
4. ఈ పండు శరీర ఉష్ణోగ్రత సమతుల్యతను కాపాడుతుంది. ఇందులోని విటమిన్ కె ఎముకల పటిష్టతను కాపాడటానికి, అల్జీమర్స్‌ను నయం చేయడానికి సాయపడుతుంది. దీనిలో ఉండే విటమిన్ ఎ కంటిచూపును మెరుగుపరుస్తుంది