గుండె జబ్బులు మీ ఆరోగ్యాన్ని దెబ్బ తీయడమే కాదు, ఆయుష్షును కూడా తగ్గించేస్తాయి. హఠాత్తుగా అనారోగ్యం పెరిగి ప్రాణాలు కోల్పోయే వారిలో గుండె జబ్బులే ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి. గుండె జబ్బులు మీ ఆరోగ్యాన్ని దెబ్బ తీయడమే కాదు, ఆయుష్షును కూడా తగ్గించేస్తాయి. హఠాత్తుగా అనారోగ్యం పెరిగి ప్రాణాలు కోల్పోయే వారిలో గుండె జబ్బులే ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి. రీసెంట్ గా జరిపిన ఓ సర్వేలో స్త్రీల కంటే పురుషుల్లోనే ఈ సమస్య కనిపిస్తున్నట్లు తేలింది. వీటికి కారణాలేమై ఉండొచ్చంటే..
1. మీ శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోకపోతే అంటే వ్యాయామం లాంటివి చేయకపోతే గుండెపోటు ప్రమాదం పెరిగే అవకాశాలు ఉన్నాయి.
2. ధూమపానం మరియు పొగాకు ఉత్పతులతో గుండెపోటు వస్తుంది. ధూమపానం మరియు పొగాకు వినియోగం గుండెపోటు ప్రమాదాన్ని మరింతగా పెంచుతుంది. కాబట్టి ధూమపానానికి దూరంగా ఉండాలి. పొగాకు ఉత్పత్తులు తినవద్దు అని వైద్యులు సూచిస్తున్నారు
3. ఒత్తిడి, డిప్రెషన్ కారణంగా కొంతమంది అతిగా తినేస్తుంటారు. దీని కారణంగా ఊబకాయం, అధిక కొలెస్ట్రాల్ మొదలైన సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
4. ఆందోళన ఎక్కువగా ఉంటే ఉదయాన్నే నిద్రలేచి యోగా, ధ్యానం వంటివి చేయండి.
5. మగవారైతే చాలా ఒంటరితనాన్ని పోగొట్టుకునేందుకు దగ్గరగా ఉన్న వారితో మాట్లాడండి. ఇలా చేయడం వల్ల మీకు ఒత్తిడి తగ్గుతుంది.
6. బయట దొరికే ఆహారాన్ని తక్కువగా తినండి. ఇలా చేయడం వల్ల ఒత్తిడి, అలసటను దూరం చేసుకోగలం.
7. మనస్సును రిలాక్స్ చేయడానికి, సమతుల్య భోజనం తినడానికి నచ్చిన పనులను చేయండి. అలా చేస్తే లోపల నుంచి సంతోషంగా ఉండగల్గుతారు.
8. మనసులో రకరకాల ఆలోచనలు పక్కకుపెట్టి ఎక్కువగా కుటుంబంతో, మీకు ఇష్టమైన వారితో గడిపేందుకు ప్రయత్నించండి.
గతంతో పోల్చితే ప్రస్తుతం అధికంగా వస్తున్న జబ్బులలో గుండెపోటు ఒకటి. ఈ రోజుల్లో గుండెపోటు రావడం సర్వసాధారణం అయిపోయింది. దశాబ్దంన్నర క్రితం వరకు వృద్ధులకు, ఊబకాయులకు అధికంగా గుండెపోటు వచ్చే అవకాశం ఉండేది. కానీ ఆహార నియమాలు పట్టించుకోకపోవడం, ఆరోగ్య సూత్రాలు పాటించకపోవడంతో ఇప్పుడు యువకులు సైతం గుండెజబ్బులతో చనిపోతున్నారు. వైద్యుల అభిప్రాయం ప్రకారం, ఒక వ్యక్తికి పలు కారణాల వల్ల గుండెపోటు వస్తుంది.
అధిక రక్తపోటు గుండెపోటుకు కారణమవుతుంది. మీకు అధిక రక్తపోటు (High Blood Pressure) సమస్య ఉంటే జాగ్రత్తగా ఉండాలి. అధిక రక్తపోటు గుండెను నియంత్రించే ధమనులను దెబ్బతీస్తుంది. అధిక కొవ్వు, స్థూలకాయం మరియు డయాబెటిస్ లేక షుగర్ (Diabetes) వ్యాది కారణంగా తరచుగా అధిక రక్తపోటు సమస్య తలెత్తుతుంది. తద్వారా గుండెపోటు వస్తుంది.