”పిల్లలు మారాం చేస్తుంటే ఓ స్మార్ట్ ఫోన్ వాళ్లకి ఇచ్చేస్తే తాత్కాలికంగా మీకు సమస్య పరిస్కారం అయినట్లే. అయితే చిన్న వయసులో ఫోన్ ఎక్కువగా వాడే పిల్లల్లో భవిష్యత్తులో అసాధారణ రీతిలో మానసిక సమస్యలు తలెత్తుతాయని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. అమెరికా సంస్థ సేపియన్ ల్యాబ్స్ వివిధ దేశాల్లో శాంపిళ్లను సేకరించింది. 2010-2014 మధ్య జన్మించిన వారిలో ఈ సమస్య అధికంగా ఉన్నట్టు గుర్తించారు. ఆరేండ్లకే ఫోన్లకు అలవాటు పడిన వారిలో 74 శాతం మంది ఈ సమస్యతో కొట్టుమిట్టాడుతున్నట్టు తేల్చారు. ఇది ప్రపంచ వ్యాప్తంగా తలెత్తుతున్న సమస్య.