ఏప్రిల్ 14 న ఇరాన్ ఇజ్రాయెల్ మీద చేసిన దాడిలో నాలుగు బాలిస్టిక్ మిస్సైల్స్ అమెరికా,బ్రిటన్ నావీ లనుండి తప్పించుకొని నేరుగా ఇజ్రాయెల్ లోని నెవాటిమ్ ఎయిర్ బేస్ (Nevatim Air base)మీద దాడి చేశాయి.
Nevatim ఎయిర్ బేస్ లో ఇజ్రాయెల్ F-35 లు ఉన్నాయి. అలాగే ఒక న్యూక్లియర్ బేస్ కూడా ఉంది. అలాంటి ఎయిర్ బేస్ దగ్గర ఎలాంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పెట్టలేదు IDF.
ఇరాన్ నేరుగా నెవాటిమ్ ఎయిర్ బేస్ ను లక్ష్యంగా చేసుకొని దాడి చేస్తూ మరో వైపు కామికాజ్ డ్రోన్లు, క్రూయిజ్ మిస్సైల్స్ తో అమెరికన్, బ్రిటన్, ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ లని బిజీగా చేసింది. ఇది చాలా ప్రమాదకరమైన వ్యూహం కానీ అగ్ర దేశాలు పసిగట్టలేక పోయాయి.
నిజం చెప్పాలి అంటే ఇరాన్ వ్యూహం వెనుక చైనా ఉంది.
మూకుమ్మడిగా వచ్చి పడుతున్న డ్రోన్లు, క్రూయిజ్ మిస్సైల్స్ ను ఎదుర్కోవడంలో తలమునకలు అయి ఉన్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ మొత్తం దొడ్డి దారిన వచ్చిన బాలిస్టిక్ మిస్సైల్స్ ను ఎదుర్కోవడంలో విఫలం అయ్యాయి.
So! అమెరికన్, బ్రిటన్ యుద్ధ నౌకల మీద ఉండే రాడర్లు ఓకే సమయంలో ఎన్ని టార్గెట్స్ ను ట్రాక్ చేయగలవు అనే సమాచారం చైనా దగ్గర ఉంది.
అఫ్కోర్స్ అవి ఫ్రిగెట్స్ అయినా, డిస్ట్రాయర్స్ అయినా పరిమితి సంఖ్యలో టార్గెట్స్ ను ట్రాక్ చేసి దాడి చేయగలవు. ఇది అన్ని దేశాల నావీ లకి వర్తిస్తుంది.
ఇక్కడే ఇరాన్ అడ్వాంటేజ్ తీసుకుంది.
ఏ మాత్రం ఆధునిక టెక్నాలజీ లేకుండా చవకగా మిస్సైల్స్ తయారు చేసి వాటిని మూకుమ్మడిగా ప్రయోగిస్తూ అదే సమయంలొ అడ్వాన్స్ టెక్నాలజీ ఉన్న నాలుగు మిస్సైల్స్ తో టార్గెట్ ను కొట్టవచ్చు అనేది నిరూపితం అయ్యింది.
ఇరాన్ కి ఒక డాలర్ ఖర్చు అయితే ఇజ్రాయెల్ కి 500 వందల డాలర్లు ఖర్చు అయ్యింది. దీర్ఘకాలిక యుద్ధం అంటూ జరిగితే నష్టపోయేది నాటో తో పాటు ఇజ్రాయెల్ కూడా ఉంటుంది.
ఇరాన్ చేసిన దాడి వల్ల చైనా కి డాటా అనలైజ్ చేసే అవకాశం దక్కింది.
ఇదే తరహాలో తైవాన్ మీద దాడి చేసే అవకాశం ఉంది చైనా.
ఆధునిక టెక్నాలజీ తో చేసే ఏ ఆయుధం అయిన ఖర్చు తో పాటు సమయం కూడా ఎక్కువగా ఉంటుంది తయారు చేయడానికీ. ఈ సమస్య పశ్చిమ దేశాలకి ఉంది చైనా కి ఉండదు.
రష్యా విషయానికి వస్తె క్రమశిక్షణ,training లేని ఉద్యోగుల వల్లనే దెబ్బ తింటున్నది. మరో వైపు రష్యన్ సైనిక జనరల్స్ యుద్ధ వ్యూహాలు కూడా రెండవ ప్రపంచ యుద్ద కాలం నాటివి.
చైనా ఇరాన్ విషయంలో ఉత్సాహం చూపించడానికి కారణం చవకగా ముడి చమురు తో పాటు $400 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెడుతున్నది ఇరాన్ లో. ఇజ్రాయెల్ వల్ల ఇరాన్ దెబ్బతింటే అది ఇరాన్ కంటే చైనాకే నష్టం.
అందుకే చైనా ఉత్తర కొరియా తో పాటు ఇరాన్ కి కూడా హైపర్ సానిక్ మిసైల్ టెక్నాలజీ ను ఇచ్చింది. ప్రస్తుతం ఇరాన్ దగ్గర హీన పక్షం 10 హైపర్ సానిక్ మిసైళ్ళు ఉండవచ్చు అని అంచనా!
వీటిని ఉపయోగించి Nevatim ఎయిర్ బేస్ ను ధ్వంసం చేస్తుంది అనే భయం అమెరికాతో పాటు ఇజ్రాయెల్ కి కూడా ఉంది.
ఇజ్రాయెల్ చిన్న దేశం అవడం వలన తన కీలక అణ్వాయుధాలు,F35 లని Nevatim ఎయిర్ బేస్ నుండి సురక్షిత ప్రాంతానికి తరలించలేదు!
ఇరాన్ అమెరికా తో పాటు ఇజ్రాయెల్,జోర్డాన్, సౌదీ,UAE లకి హెచ్చరిక చేస్తున్నది అంటే డర్టీ బాంబ్ ను కూడా సిద్ధం చేసింది అని అనుకోవాలి.
ఏ మాత్రం పరిస్థితి అదుపు తప్పినా ఇరాన్ ఈ సారి టెల్ అవీవ్,జెరూసలేం ల మీద దాడి చేస్తుంది. ఇప్పటికే ఈ హెచ్చరిక చేసింది కూడా!