‘జనసేనలో కోవర్టులు ఉన్నారు. వారు నన్ను వెనక్కి లాగాలని చూస్తున్నారు. వారు బయటకు వెళ్లిపోవడం మంచిది..’ ఇదీ ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు. నిజమేనా? సేనలో ఆ కోవర్టులు ఎవరై ఉంటారు? ఇదే ఇపుడు జనసేనలో హాట్ టాపిక్. ‘
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన పార్టీలోనే కొందరు కోవర్టులుగా పనిచేస్తున్నారని అన్నారు. పార్టీలోని ఒకరిద్దరిలో కోవర్టు ఛాయలు స్పష్టంగా కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. తనను వెనక్కిలాగే ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. జనసేనలో ఉంటూ పక్కవాడికి సహకరించే పరిస్థితి ఉండకూడదని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇష్టం లేని వాళ్లు పార్టీ నుంచి వెళ్లిపోవచ్చని సూచించారు. పార్టీలో ఉంటూ ఏ ఒక్క తప్పు చేసినా సస్పెండ్ చేస్తానని హెచ్చరించారు. సెప్టెంబరు నుంచి పార్టీలో నిర్మాణ లోపాలు సరిదిద్దుకుంటామని వివరించారు. పార్టీలో తన అధ్యక్షతన క్రమశిక్షణా కమిటీని ఏర్పాటు చేస్తున్నామని , పార్టీలో ఎవరు తప్పు చేసినా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. పాదయాత్ర చేసిన వారందరూ వినోభాభావేలు కారని, పాదయాత్రతోనే అన్ని సమస్యలు పరిష్కారం కావని చెప్పారు.