సినీనటులు, స్పోర్ట్స్ స్టార్స్ పాలిటిక్స్ లో పోటీ చేయడం రెండు, మూడు దశాబ్దాలుగా ఫ్యాషన్ గా మారింది. తాజగా ఒకప్పటి టెన్నిస్ స్టార్ సానియా మీర్జా హైదరాబాద్ పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేయడానికి రెడీ అవుతున్నారు. తెలంగాణ కాంగ్రెస్ తరఫున పోటీ చేసే ఎంపీ అభ్యర్థుల జాబితా దాదాపు ఖరారైనట్లుగా సమాచారం. బుధవారం ఢిల్లీ లో కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా ప్రముఖ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా పేరు దాదాపు ఖరారైనట్లుగా తెలుస్తోంది. ఆమె పేరును అజారుద్దీన్ ప్రతిపాదన చేశారు. అటు సానియా స్టార్ ఇమేజ్ కూడా కలిసి వస్తుందని హస్తం నేతలు ఆనందములో ఉన్నారు.