క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ కల నెరవేరింది. దేశం తరఫున ఆడాలని ఎన్నోఏళ్లుగా ఎదురుచూస్తున్న తన ఆశయం నేటికి నెరవేరింది. 26 ఏళ్ల సర్ఫరాజ్ రాజ్‌కోట్‌లో ఇంగ్లండ్‌తో ప్రారంభమైన మూడో టెస్టులో బరిలోకి దిగుతున్నాడు. తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. తమ కుమారుడు మైదానంలో అడుగు పెడుతున్నప్పుడు చూడాలని సర్ఫరాజ్ కుటుంబం కూడా రాజ్‌కోట్‌లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వద్దకు చేరుకుంది.
సర్ఫరాజ్‌కు అనిల్ కుంబ్లే టెస్టు క్యాప్ అందివ్వగానే ఆనందం పట్టలేక అతడి తండ్రి నౌషద్ కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. క్యాప్ ప్రెజెంటేషన్ తర్వాత కుమారుడిని నౌషద్ ఆలింగనం చేసుకుని క్యాప్‌కు ముద్దిచ్చారు. సర్ఫరాజ్ భార్య కూడా కన్నీటిని ఆపుకోలేకపోయారు. అలాగే ఉత్తరప్రదేశ్ వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ కూడా టెస్ట్ క్యాప్ అందుకున్నాడు.