- అనుకోకుండా ఒక్కటైన సచిన్ టెండూల్కర్, బ్రియాన్ లారా
- లండన్ లో రోజంతా విహారం
- ఈ విషయాన్ని ట్విట్టర్ లో పంచుకున్న సచిన్ రెండు దేశాల తరఫున క్రికెట్ లో జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన వారు. ఎన్నో ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టిన వారు. వారే వెస్టిండీస్ క్రికెటర్ బ్రియాన్ లారా, భారత క్రికెటర్ సచిన్ టెండూల్కర్. వీరిద్దరూ మంచి స్నేహితులు కూడా. కానీ అనుకోకుండా లండన్ లో కలుసుకున్నారు. ఇంకేముంది.. ఓ రోజంతా లండన్ అందాలను వీక్షిస్తూ సరదాగా గడిపారు.
ఈ విషయాన్ని సచిన్ టెండూల్కర్ తన ట్విట్టర్ పేజీలో పంచుకున్నారు. రెండు ఫొటోలను షేర్ చేశారు. లండన్ వీధిలో నడుస్తున్నట్టు ఆ ఫొటోల్లో ఉంది. ‘‘ఈ రోజు ఆసక్తి కలిగిన మరో గోల్ఫ్ క్రీడాకారుడిని కలుసుకున్నాను’’ అంటూ సచిన్ ట్వీట్ చేశారు. సచిన్, లారా ఇద్దరూ గోల్ఫ్ కూడా ఆడుతుంటారు. సచిన్ కు అభిమానులు ఎక్కువనే విషయం తెలిసిందే. సచిన్ పెట్టిన ట్వీట్ ను ఇప్పటికే 18.5 లక్షల మంది వీక్షించారు.