‘నలుగురు ఆడపిల్లలు పుట్టిన ఇంట్లో ఈమె నాలుగో అమ్మాయి. అయినా తల్లిదండ్రులు నిరాశ చెందలేదు. ఆమె లక్ష్యం కోసం ఆస్తులు సైతం అమ్మారు.. ఆమె కూడా వారి ఆశలు నెరవేర్చింది..’
అంతిమ్ హరియాణా అమ్మాయి. హిస్సార్ జిల్లాలోని భగానా గ్రామంలో పుట్టి పెరిగింది. అంతిమ్ అంటే చివరి అని అర్థం. తల్లిదండ్రులు రామ్ నివాస్, కృష్ణ కుమారి.. అంతిమ్ కంటే ముందే ముగ్గురు అమ్మాయిలకు జన్మనిచ్చారు. హిస్సార్ జిల్లాలో లింగ వివక్ష అంతా ఇంతా కాదు. 1000 మంది పురుషులకు 872 మంది మహిళలే ఉన్నారు. అంతిమ్ జననం, అంటే నాలుగో సంతానంగా కూడా అమ్మాయి పుట్టడం తల్లిదండ్రులకు ఎక్కువ సంతోషాన్నివ్వలేదు. మగ పిల్లాడి కోసం తపించిన వాళ్లు రాష్ట్రంలో ఉన్న సంప్రదాయం ప్రకారం ఆమెకు ‘అంతిమ్’ అని పేరు పెట్టారు. ఆమే తమ చివరి అమ్మాయి కావాలన్నది వారి ఆశ. . వారికి ఎల్లప్పుడూ మద్దతుగా నిలిచారు. వాళ్ల పెద్దమ్మాయి సరిత జాతీయ స్థాయి కబడ్డీ క్రీడాకారిణి.
రెజ్లింగ్‌ను ఎంచుకున్న అంతిమ్‌కు ఎంతో మద్దతుగా నిలిచాడు రామ్ నివాస్. ఖర్చుకూ వెనుకాడలేదు. అమ్మాయిలకు రెజ్లింగ్ ఎందుకంటే ఇరుగు పొరుగు విమర్శించినా వెనక్కి తగ్గలేదు. రెజ్లింగ్ సాధన కోసం అంతిమ్‌ను తన గ్రామం నుంచి 20 కిలోమీటర్ల దూరంలోని హిస్సార్ పట్టణానికి రోజూ తీసుకెళ్లేవాడు. తర్వాత నివాసాన్నే హిస్సార్‌కు మార్చేశాడు. ఖర్చుల కోసం తన వద్ద ఉన్న వాహనాలనూ అమ్మేశాడు. కుమార్తెపై అతడి నమ్మకం వృథా కాలేదు. 2018లో అండర్-15 జాతీయ టైటిల్ గెలిచిన అంతిమ్ ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. రోజురోజుకూ మెరుగవుతూ.. ఇప్పుడిలా ప్రపంచ వేదికపై భారత్ కు విజయం సాధించి పెట్టింది. ఆమె కూడా సగర్వంగా నిలబడింది.