లీడర్ ఎవరని చూడకూడదు..
సమాజంలో మార్పు రావాలి..
పొలిటికల్ ఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు
కోలీవుడ్ పవర్ స్టార్ విజయ్ రాజకీయ ప్రవేశం.. పార్టీ ప్రకటన సౌత్ ఇండియాలో సంచలనంగా మారింది. మరో హీరో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం మంచి పరిణామంగా సీనీ వర్గాలు భావిస్తున్నాయి. అందుకే హీరో విజయ్ ను ప్రముఖులు ప్రశంసిస్తున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హీరో విజయ్ రాజకీయాల్లోకి రావడంపై సంతోషం వ్యక్తం చేశారు. సమాజంలో మార్పు రావాలనుకుంటే లీడర్ ఎవరనేది చూడకుండా సపోర్ట్ చేయాలని ఉపాసన అన్నారు. ఒక నటుడిగా విజయ్ ఎంతో మంది హృదయాలను గెలుచుకున్నారని ప్రశంసించారు. ఇప్పుడు ప్రజలకు సేవ చేసేందుకు ముందుకు వస్తున్నారని, గొప్ప విషయమని చెప్పారు. ఒకవేళ విజయ్ ను సపోర్ట్ చేయకపోయినా వెనక్కి మాత్రం లాగొద్దనిక, కొత్త నాయకుడికి మద్దతుగా నిలిచినప్పుడే సమాజంలో మనం కోరుకునే మార్పు వస్తుందని ఉపాసన ఆకాంక్షించారు. తమిళనాడులో కూడా మార్పు వస్తుందనే ఆశాభావం తనకు ఉందని చెప్పారు.
మీరు రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందా? అనే ప్రశ్నకు తాను పాలిటిక్స్ లోకి వచ్చే అవకాశం లేదని ఆమె స్పష్టం చేశారు. అయితే, మార్పు తీసుకొచ్చే నాయకుడికి మాత్రం తన మద్దతు ఎప్పుడూ ఉంటుందని చెప్పారు.