పుదీనా సువాసనే రిఫ్రెష్ ఫీలింగ్ తెప్పిస్తుంది. మైండ్ పీస్ ఫుల్ అవుతుంది. మంచి రుచి, మంచి వాసన పుదీనా సొంతం. మన ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తుంది. రోజూ కొన్ని పుదీనా ఆకులు మన ఆహారంలో, టీ రూపంలో తీసుకుంటే.. అనేక ఆరోగ్య ప్రయోజనాలు సొంతం చేసుకోవచ్చని నిపుణులు అంటున్నారు. దాని 5 అధ్బుత ప్రయోజనాలు తెలుకుందాం.
పుదీనాలోని యాంటీఆక్సిడెంట్ లక్షణాలు చర్మాన్ని సంరక్షిస్తాయి. చర్మానికి తాజాదనం అందిస్తాయి. రియాక్టివేట్ చేస్తాయి. విటమిన్ ఏ సమృద్ధిగా ఉంటుంది. ఇది కంటి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. దృష్టిని మెరుగుపరుస్తుంది. పుదీనా ఆకుల్లోని విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. అంతేకాదు అందులో ఉండే ఐరన్, మాంగనీస్, ఫోలేట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి జీవక్రియ విధులు, కణాల పెరుగుదలకు తోడ్పడతాయి.