సింహాల పేర్లు తమ మత మనోభావాలను దెబ్బతీస్తున్నాయని విశ్వ హిందూ పరిషత్(వీహెచ్పీ) ఫిర్యాదు చేసింది. దీంతో వాటి పేర్లు మార్చాలని కోర్టు ఆదేశాలిచ్చింది. ఈ రెండు సింహాలు ప్రస్తుతం సిలిగురి జిల్లాలోని నార్త్ బెంగాల్ వైల్డ్ యానిమల్స్ పార్కులో నివసిస్తున్నాయి. ఆడ సింహానికి హిందూ దేవత సీత పేరును, మగ సింహానికి 16వ శతాబ్దపు మొగల్ పాలకుడు అక్బర్ పేరును పెట్టారు.
వీటికి ఈ పేర్లు పెట్టడాన్ని వీహెచ్పీ సవాలు చేసింది. ఆడ సింహానికి సీత పేరును పెట్టడం హిందూ దేవతను అవమానపరిచినట్లేనంటూ వీహెచ్పీ అభ్యంతరం వ్యక్తంచేసింది. ఒకే పార్కులో ఈ సింహాలను ఉంచడంపై కూడా అభ్యంతరం చెప్పింది.
జంతువులకు హిందూ దేవతలు, ముస్లిం ప్రవక్తలు, క్రైస్తవ బోధకులు, నోబెల్ పురస్కార గ్రహీతలు, స్వాతంత్య్ర సమరయోధుల పేర్లను పెట్టవద్దని కోర్టు తెలిపింది. ఇలాంటి పేర్లను ఎందుకు పెడుతున్నారు’’ అని జస్టిస్ సౌగత భట్టాచార్య ప్రశ్నించారు.