న్యాచురల్ స్టార్ నాని నటిస్తోన్న సినిమా ‘సరిపోదా శనివారం’ గ్లింప్స్ రిలీజ్ అయింది. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తుండగా నానికి జోడీగా ప్రియాంక అరుళ్ మోహన్ నటిస్తోంది. ఇక ఎస్జే సూర్య పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు.
శనివారం నాని పుట్టినరోజు సందర్భంగా గ్లింప్స్ రిలీజ్ చేశారు. అష్టా చమ్మా సినిమాతో హీరోగా మారి.. దసరా మూవీతో పాన్ ఇండియా స్టార్‌గా క్రేజ్ అందుకున్నాడు న్యాచురల్ స్టార్ నాని. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ మూవీ తర్వాత ఇటివలే హాయ్ నాన్న సినిమాతో మరోసారి ప్రేక్షకులకు దగ్గరయ్యాడు.