రాముడిపై ఉన్నభక్తితో ఆర్టిస్టులైన దంపతులు 9ఏళ్ల బాలుడిని అచ్చం అయోధ్య బాలరాముడి (రామ్ లల్లా)గా మార్చేశారు. ఎలా చూసినా ఆ బాలుడు అచ్చం అయోధ్య రామయ్యలానే కనిపిస్తుండడం విశేషం. పశ్చిమ బెంగాల్లోని అసన్సోల్కు చెందిన ఆశిష్కుందు తన భార్య రూబీ సహకారంతో కుమారుడిని బాల రామయ్యలా మార్చేశాడు. ఇంట్లో తయారుచేసిన, మార్కెట్లో దొరికిన మేకప్ వస్తువులతోనే ఆశిష్ తన నైపుణ్యాన్ని ప్రదర్శించి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
కేవలం నెలరోజుల్లోపే ఈ అసాధారణ ఘనత సాధించారు. అసన్సోల్లోని మోహిసెలా ప్రాంతానికి చెందిన అబీర్ దే అనే బాలుడు వారి చేతిలో బాల రామయ్యగా ఒదిగిపోయాడు. అయోధ్య బాలరామయ్య రూపురేఖలతో అచ్చం అలాగే దర్శనమిచ్చాడు. అబీర్ బీని బాలరాముడిలా రెడీ చేశాక, అతడిని చూసి జనం తమను తాము నమ్మలేకపోయారు. ఫొటోలు, వీడియోలు తీసుకుని మురిసిపోయారు. ఇవి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆశిష్-రూబీ దంపతులు ఫేమస్ అయిపోయారు.