సాయిపల్లవి మంచి హీరోయిన్ గా తెలుగులో మంచి పేరు తెచ్చుకుంది. సాయిపల్లివి సారంగధరియా.. సాంగ్ తెలుగురాష్ట్రాలను ఊపేసింది. తను కొత్తసినిమా ‘విరాటపర్వం’. రేపు ఈ సినిమా విడుదలకు సిద్ధమయింది. ఈ సినిమా ప్రమోషన్స్ సందర్భంగా సాయిపల్లవి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ఈ సినిమాలో తాను ‘వెన్నెల’ పాత్రలో కనిపిస్తానని చెప్పింది. గ్రామం పెరిగిన అమ్మాయి ఎలా ఉంటుందో తాను ఈ సినిమాలో అలాగే కనిపిస్తానని చెప్పింది. ఈ సినిమాలో అసలు మేకప్ లేకుండానే చేశానంటూ చెప్పుకొచ్చింది. ‘‘‘‘‘‘’షాట్ రెడీ అనగానే ముఖం కడుక్కుని కెమెరా ముందుకు వెళ్లిపోయేదానిని… ఆ పాత్ర సహజత్వం కోసం అలా చేయవలసి వచ్చిందని సాయిపల్లవి చెప్పింది. ‘‘తనకు ఇచ్చిన పాత్రను సాధ్యమైనంత సహజంగా చేయడానికి ట్రై చేస్తుంటానని.. ఒక పాత్రను ఏ స్థాయి వరకూ తీసుకుని వెళ్లొచ్చు అనే విషయంలో ఒక అవగాహన ఉంటుందని తెలిపింది.