ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ ‘కల్కి 2898 AD’ సినిమాను రూపొందిస్తున్నాడు. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వనీదత్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అత్యధిక బడ్జెట్ తో నిర్మితమవుతున్న సినిమా ఇది. పాన్ వరల్డ్ సినిమా అంటూ ఆదిలోనే ఈ ప్రాజెక్టుపై నాగ్ అశ్విన్ అంచనాలు పెంచేశాడు. ఇటీవలే ఒక షెడ్యూల్లో ప్రభాస్ – దిశా పటాని కాంబినేషన్లో ఒక రొమాంటిక్ సాంగ్ షూట్ చేశారు.
త్వరలో తీయనున్న మరో షెడ్యూల్ లో ప్రభాస్ .. అమితాబ్ .. కమల్ పాల్గొననున్నారు. ఈ ముగ్గురి కాంబినేషన్లోని కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తారు. అందుకు అవసరమైన భారీ సెట్ ను హైదరాబాద్ – రామోజీ ఫిల్మ్ సిటీలో వేశారు. సంతోష్ నారాయణ్ నేపథ్య సంగీతం హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు.